భారీ షాక్.. రీల్స్ చేయాలంటే డిగ్రీ ఉండాల్సిందేనా?

సోషల్ మీడియా పుణ్యమా అని ప్రతి ఒక్కరు ఫేమస్ అయిపోతున్నారు. ముక్కు మొహం తెలియని వాళ్లు కూడా సోషల్ మీడియాలో అకౌంట్స్ ఓపెన్ చేసి ఓవర్ నైట్ లో ఫేమస్ అయిపోతున్నారు.;

Update: 2025-10-28 11:30 GMT

సోషల్ మీడియా పుణ్యమా అని ప్రతి ఒక్కరు ఫేమస్ అయిపోతున్నారు. ముక్కు మొహం తెలియని వాళ్లు కూడా సోషల్ మీడియాలో అకౌంట్స్ ఓపెన్ చేసి ఓవర్ నైట్ లో ఫేమస్ అయిపోతున్నారు. అలా సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్ లుగా మారి ఎన్నో ఉత్పత్తులను ప్రమోట్ చేస్తూ లక్షలు, కోట్లు సంపాదిస్తున్నారు. అయితే ఇలాంటి వారికి చెక్ పెట్టే విధంగా ఒక కొత్త రూల్ అమలులోకి రానుంది. ఇకపై రీల్స్ చేయాలి అంటే మినిమం డిగ్రీ ఉండాల్సిందే అనే రూల్ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది అని చెప్పవచ్చు.. మరి ఈ షరతులు ఎప్పటినుంచి అమలులోకి వస్తాయి? అసలు ఎక్కడ దీనిని అమలు చేశారు? ఈ రూల్ పెట్టడానికి బలమైన కారణం ఏంటి? ఇలా పలు విషయాలు వైరల్ గా మారుతున్నాయి.

విషయంలోకి వెళ్తే.. చైనా ఈ కొత్త రూల్ తీసుకువచ్చింది. ఇకపై సోషల్ మీడియాలో ఆ విషయాల గురించి రీల్ చేయాలంటే కచ్చితంగా డిగ్రీ ఉండాల్సిందేనట. అసలు విషయం ఏమిటంటే.. చైనాలో అక్టోబర్ 25 నుండి అమలులోకి వచ్చిన కొత్త ఇన్ఫ్లూయెన్సర్ చట్టం ప్రకారం సోషల్ మీడియా క్రియేటర్లు నియంత్రిత అంశాల గురించి అంటే వైద్యం,ఫైనాన్స్, ఎడ్యుకేషన్, లా వంటి అంశాలపై ఏదైనా పోస్ట్ చేయాలనుకుంటే ఆ పోస్ట్ చేయాలనుకునే వ్యక్తి ఆ సంబంధిత సబ్జెక్టులపై కచ్చితంగా డిగ్రీ చేసి ఉండాలని ఓ రూల్ తీసుకువచ్చింది.

అలాంటి అంశాలపై ఏదైనా పోస్ట్ చేయాలంటే కచ్చితంగా డిగ్రీ ఉండాల్సిందేనని తెలిపారు. సైబర్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ చైనా ప్రకారం ఈ నిబంధన అనేది తప్పుడు సమాచారాన్ని అరికట్టడం, తప్పుడు దారి పట్టించే సలహాల నుండి ప్రజలను రక్షించడం కోసమేనని తెలుస్తోంది. అయితే చాలామంది డబ్బు కోసం ఎలాంటి కంటెంట్ నైనా సరే పోస్ట్ చేస్తున్నారు. దీనివల్ల వారిని ఫాలో అయ్యే వారికి చాలా నష్టం జరుగుతుంది. అందుకే ఇలాంటి నష్టం జరగకూడదు అనే ఉద్దేశంతోనే చైనా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. చైనా తీసుకొచ్చిన ఈ కొత్త రూల్ నమ్మకాన్ని పెంపొందించడంతో పాటు కచ్చితత్వాన్ని నిర్ధారించడానికి ఉపయోగపడుతుందని అధికారులు చెబుతున్నారు.

కానీ కొంతమంది విమర్శకులేమో దీన్ని డిజిటల్ సెన్సార్షిప్ యొక్క కొత్త రూపం అని అంటున్నారు. అంతేకాదు సృజనాత్మకతను అణచివేసే ఒక చెత్త రూల్ అంటూ విమర్శిస్తున్నారు. కానీ చైనా తీసుకువచ్చిన ఈ కొత్త రూల్ పట్ల ఎంతోమంది ఆనందం వ్యక్తం చేస్తున్నారు.ఎందుకంటే సోషల్ మీడియాలో చదువు, వైద్యం గురించి ఎలాంటి అవగాహన లేకుండానే చాలామంది కంటెంట్ చేస్తున్నారు. వీరిని ఫాలో అయ్యి ఎంతో మంది నష్టపోతున్నారు.కానీ లా,వైద్యం వంటి అంశాలకి సంబంధించిన కంటెంట్ ని పోస్ట్ చేయాలంటే ఆయా సంబంధిత అంశాలలో డిగ్రీ ఉండాలి అనే ఖచ్చితమైన రూల్ పెట్టడం వల్ల చాలామందికి మేలు కలుగుతోంది. అంతేకాకుండా ఇలాంటి కంటెంట్ ని పోస్ట్ చేసే వారికి సంబంధించిన సోషల్ మీడియా అకౌంట్ లని ముందుగానే వెరిఫై చేస్తారట..

ఎవరైనా ఈ రూల్ ని పాటించకపోతే వారి సోషల్ మీడియా అకౌంట్ ని డిలీట్ చేయడంతో పాటు 12 లక్షల జరిమానా కూడా చైనా ప్రభుత్వం విధించబోతుందట. ఇలా చేస్తే చాలావరకు మేలు కలుగుతుంది అని.. ఎంతో మంది నిపుణుల సలహాలు తీసుకున్నాకే చైనా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇక ఈ రూల్ అనేది మల్టీ ఛానల్ నెట్వర్క్ లలో కూడా వర్తిస్తుంది అని తెలిపింది. అలా తప్పుడు సమాచారాన్ని అరికట్టడం కోసం చైనా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని చాలామంది సపోర్ట్ చేస్తున్నారు.

Tags:    

Similar News