చెన్నై లవ్ స్టోరీ ట్రైలర్.. బానిసను అంటున్న అబ్బవరం

బేబి లాంటి సినిమా తర్వాత నిర్మాతలు ఎస్కేఎన్, సాయి రాజేష్ కలిసి నిర్మించిన మరో ఇంటెన్స్ ఎమోషనల్ మూవీ చెన్నై లవ్ స్టోరీ.

Update: 2026-07-18 15:27 GMT

బేబి లాంటి సినిమా తర్వాత నిర్మాతలు ఎస్కేఎన్, సాయి రాజేష్ కలిసి నిర్మించిన మరో ఇంటెన్స్ ఎమోషనల్ మూవీ చెన్నై లవ్ స్టోరీ. కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరి ప్రియ లీడ్ రోల్స్ లో రవి నంబూరి డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా జూలై 24న థియేటర్లలోకి రాబోతోంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్స్ స్పీడ్ పెంచిన మేకర్స్, మూవీ అఫీషియల్ ట్రైలర్ ను బయటకు వదిలారు.




 


ట్రైలర్ స్టార్టింగ్ లోనే హీరోయిన్ రాత్రి పూట వైన్ షాప్ లో మందు కొంటూ కనిపించడం కాస్త సర్ ప్రైజింగ్ గా అనిపిస్తుంది. ఆ వెంటనే హీరో ఒక ఫిష్ ట్యాంక్ దగ్గర నిలబడి.. అది ఒక్కటే బతకడం కష్టం అన్నా.. నేను ఒక్కడినే బతుకుతాలేను అంటూ చెప్పే డైలాగ్ క్యారెక్టర్స్ కి ఉన్న లోన్లీనెస్ ను ఎలివేట్ చేసింది. ఆ తర్వాత ఇద్దరి మధ్య మొదలైన పరిచయం ప్రేమగా మారే ప్రాసెస్ ను విజువల్స్ లో నీట్ గా చూపించారు.

చెన్నైలోని ఏవీఎం స్టూడియోస్ చుట్టూ తిరిగే ఒక స్ట్రగులింగ్ రైటర్ లా కిరణ్ లుక్ కనిపిస్తోంది. నా కథలన్నీ గుండెలు పిండేసే కథలు సార్.. అవి తెలుగు వాళ్లు తట్టుకోలేరు అనే డైలాగ్ ఫన్ క్రియేట్ చేసింది. మరోవైపు హీరోయిన్ పాత్ర కాస్త బోల్డ్ అండ్ ఇండిపెండెంట్ తరహలో అనిపిస్తోంది. తక్కువ తాగండి అని హీరో చెప్పినా, నన్ను మార్చడానికి నువ్వెవడివి అంటూ ఆమె ఇచ్చే కౌంటర్స్ ఆసక్తికరంగా ఉన్నాయి.

హీరోయిన్ కు చేతి కడియం బహుమతిగా ఇస్తూ కిరణ్ చెప్పే డైలాగ్ ఫీల్ గుడ్ గా అనిపిస్తుంది. జీవితంలో ఎలాంటి అవసరం వచ్చినా వదులుకోని ఈ వస్తువు ఇస్తున్నానంటే.. మీరు నాకు ఎంత ఇంపార్టెంటో ఆలోచించండి అని హీరో చెప్పే సీన్ ఆకట్టుకుంది. అలాగే ఈరోజు నుంచి మీరు నా దేవత.. నేను మీ బానిస అంటూ హీరో తన ప్రేమను వ్యక్తపరిచే విధానం చూస్తుంటే ఇందులో లవ్ ట్రాక్ చాలా డీప్ గా ఉంటుందని అర్థమవుతోంది.

ఫస్ట్ హాఫ్ అంతా ఫన్ తో సాగిన ట్రైలర్, ఎండింగ్ కి వచ్చేసరికి పూర్తిగా ఇంటెన్స్ ఎమోషన్స్ వైపు టర్న్ తీసుకుంది. వర్షంలో ఇద్దరూ ఏడ్చుకునే సీన్స్, చేతిలో పగిలిన బాటిల్ తో హీరోయిన్ నడిచొచ్చే షాట్స్ సినిమాలోని పెయిన్ ను చూపిస్తున్నాయి. నా మనసులో స్టీవెన్ తప్ప ఎవరూ లేరు అని గౌరి ప్రియ ఏడుస్తూ చెప్తే.. కిరణ్ చెప్పే డైలాగ్ తో ట్రైలర్ ముగించిన విధానం క్యూరియాసిటీ పెంచింది.

డైరెక్టర్ రవి నంబూరి తీసుకున్న పాయింట్ ను ప్రెజెంట్ చేసిన విధానం, రాసుకున్న సంభాషణలు ట్రైలర్ కు హైలైట్ గా నిలిచాయి. మణిశర్మ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఎమోషనల్ సీన్స్ కు మంచి డెప్త్ తీసుకొచ్చింది. విశ్వాస్ డానియల్ కెమెరా వర్క్ చెన్నై వాతావరణాన్ని చాలా న్యాచురల్ గా క్యాప్చర్ చేసింది. జూలై 24న రాబోతున్న ఈ లవ్ స్టోరీ ఆడియన్స్ కు ఏ రేంజ్ లో కనెక్ట్ అవుతుందో వేచి చూడాలి.



Full View


Tags:    

Similar News