• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఆ సినిమా వాయిదాతో...

ఆ సినిమా వాయిదాతో రష్మికకి పెద్ద టెన్షన్‌ తప్పింది..!

| ఛావా సినిమా షూటింగ్‌ పూర్తి కాకపోవడంతో ఫిబ్రవరికి వాయిదా వేస్తూ చిత్ర యూనిట్‌ సభ్యులు అధికారికంగా ప్రకటన చేశారు.

By - Tupaki Desk
Update: 2024-11-28 10:30 GMT

అల్లు అర్జున్‌, సుకుమార్ కాంబోలో రూపొందిన పుష్ప 2 సినిమా డిసెంబర్‌ 5న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే. ఈ సినిమాలో అల్లు అర్జున్‌కి జోడీగా రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమాతో పాటు రష్మిక నటించిన హిందీ మూవీ 'ఛావా' సినిమా సైతం డిసెంబర్‌లో విడుదల కాబోతుంది అంటూ చాలా రోజుల క్రితమే అధికారిక ప్రకటన వచ్చింది. పుష్ప 2 డిసెంబర్‌ 5న ప్రేక్షకుల ముందుకు వస్తూ ఉండగా, ఛావా సినిమా డిసెంబర్‌ 6న విడుదల కాబోతుంది అంటూ అధికారిక ప్రకటన వచ్చింది. ఛావా సినిమా షూటింగ్‌ పూర్తి కాకపోవడంతో ఫిబ్రవరికి వాయిదా వేస్తూ చిత్ర యూనిట్‌ సభ్యులు అధికారికంగా ప్రకటన చేశారు.

ఛావా సినిమా కనుక డిసెంబర్‌ 6న ప్రేక్షకుల ముందుకు వచ్చి ఉంటే కచ్చితంగా పెద్ద క్ల్యాష్ బాక్సాఫీస్ వద్ద ఉండేది. అంతే కాకుండా రెండు సినిమాల ప్రమోషన్స్‌కి సమయం ఇవ్వలేక రష్మిక మందన్న చాలా ఇబ్బంది ఎదుర్కోవాల్సి వచ్చేది. మొత్తానికి చాలా సేఫ్‌గా రష్మిక మందన్న నిలిచే విధంగా ఛావా సినిమా వాయిదా పడింది. సినిమాల ప్రమోషన్‌ కోసం రష్మిక మందన్న తన బెస్ట్‌ ఇస్తారు. అయితే రెండు సినిమాలు ఒకేసారి విడుదల అయితే కచ్చితంగా రెండు సినిమాలకు ఆమె పూర్తి స్థాయిలో సమయం కేటాయించే వారు కాదు. అందుకే ఆమె ప్రమోషన్స్‌ సమయంలో ఇబ్బంది ఎదుర్కోవాల్సి వచ్చేది అంటూ పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

విక్కీ కౌశల్‌ హీరోగా రూపొందుతున్న క్రేజీ మూవీ ఛావా సినిమా లక్ష్మణ్‌ ఉటేకర్‌ దర్శకత్వం వహిస్తున్నారు. చత్రపతి శివాజీ మహారాజ్ తనయుడు శంభాజీ మహారాజ్‌ జీవిత చరిత్ర ఆధారంగా 'ఛావా' సినిమా రూపొందుతోంది. శంభాజీ పాత్రలో విక్కీ కౌశల్‌ నటిస్తూ ఉండగా, ఆయన భార్య ఏసుబాయి పాత్రలో రష్మిక నటించారు. ఈ సినిమా షూటింగ్‌ సమయానికి పూర్తి అవుతుందని మొన్నటి వరకు చెబుతూ వచ్చిన మేకర్స్ చివరి నిమిషంలో ఇప్పట్లో విడుదల చేయలేం అంటూ తేల్చి చెప్పారు. దాంతో షూటింగ్‌ ఆలస్యం అవుతుందా లేదంటే మరే సినిమా కారణంగా అయినా ఈ సినిమాను వాయిదా వేశారా అంటూ చర్చ జరుగుతోంది.

ఛావా సినిమా విడుదల వాయిదా పడటంతో పుష్ప 2 సినిమాకు సోలో రిలీజ్ దక్కింది. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించడం కోసం అన్ని చోట్ల పుష్ప 2 మేకర్స్ సోలో రిలీజ్‌ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఛావా సినిమా విడుదల ఉంటుంది, పోటీ తప్పదని భావించారు. కానీ అనూహ్యంగా షూటింగ్‌ పూర్తి కాలేదు అంటూ విడుదల వాయిదా వేయడం జరిగింది. ఛావా విడుదల వాయిదా పడటంతో రెండు విధాలుగా పుష్ప 2 కి మంచి జరిగింది. రష్మిక ప్రచారంకు ఎక్కువ సమయం కేటాయించడంతో పాటు, హిందీ బాక్సాఫీస్ వద్ద పోటీ లేకుండా పోయింది. దాంతో మైత్రి మూవీ మేకర్స్ ఊపిరి పీల్చుకుంటున్నారు.

Tags:    
  • Tollywood 
  • Bollywood 
  • Filmindustry 
  • Pushpa2 
  • Alluarjun 
  • Sukumar 
  • Chava 
  • Vickykaushal 
  • LaxmanUtekar 
  • Rashmikamandanna 

Similar News

సూపర్‌స్టార్లు స్వీయ భారం..నేటి తరం మాత్రం నిర్మాతలపై భారం!

2026-11-05 17:30 GMT

వారణాసి మహేష్ బాబు రాముడిగా ఎంత సేపు కనిపిస్తాడు...

2026-11-05 16:32 GMT

స్టెప్-మదర్ కాదు అంతకుమించి!

2026-11-05 16:30 GMT

అంగరంగ వైభవంగా సాయి దుర్గ తేజ్, కిరణ్ నిశ్చితార్థం.. అమ్మాయి వివరాలు ఇవే!

2026-11-05 16:16 GMT

రెడ్ అవుట్‌ఫిట్‌లో స్టన్నింగ్ లుక్‌తో మెరిసిన పాలక్!

2026-11-05 16:16 GMT

'రామాయణ' సెట్స్‌లో సీతగా సాయి పల్లవి.. BTS ఫొటోలు వైరల్!

2026-11-05 16:15 GMT

RC17: హీరో.. హీరోయిన్..విలన్.. ఎవరెవరంటే..!

2026-11-05 16:15 GMT

హై బడ్జెట్ ఫిల్మ్‌లో దళపతి విజయ్.. గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో!

2026-11-05 16:12 GMT

అనిల్ రావిపూడి.. ఈసారి యాక్షన్ కూడా గట్టిగానే..

2026-11-05 16:12 GMT

ఒకప్పుడు ఏలిన టాప్-5 హీరోయిన్‌లు నేడు ఊహించ‌ని స్థితిలో!

2026-11-05 15:30 GMT

డస్టీ రోజ్ శారీలో షాలిని అందాల సందడి!

2026-11-05 14:30 GMT

కమల్ హాసన్ బ్యానర్‌లో రజనీకాంత్-శ్రీలీల!

2026-11-05 13:30 GMT

Copyright @2026

Powered by Blink CMS