కార్తికేయ 3 ఇప్పుడప్పుడే రాదా..?

కార్తికేయ 1, 2 మధ్యలో 8 ఏళ్ల గ్యాప్ వచ్చింది. అది కావాలని తీసుకున్నారా లేదా కథ రెడీ అవ్వడానికి అంత టైం పట్టిందా అన్నది తెలియదు.;

Update: 2025-06-12 02:45 GMT

చందు మొండేటి, నిఖిల్ కాంబినేషన్ లో వచ్చిన కార్తికేయ, కార్తికేయ 2 రెండు సినిమాలు మంచి సక్సెస్ అందుకున్నాయి. కార్తికేయ వచ్చిన 8 ఏళ్ల తర్వాత కార్తికేయ 2 వచ్చింది. ఐతే కార్తికేయ 2 పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ కాగా నేషనల్ లెవెల్ లో ఆడియన్స్ ని ఆ సినిమా మెప్పించింది. కార్తికేయ 2 చూసిన తర్వాత కార్తికేయ 1 ని డబ్బింగ్ మూవీని వెతికి మరీ చూశారు నార్త్ ఆడియన్స్. రెండిటిలోనూ హీరో పాత్రకు ఉన్న బలం.. ఇంకా అదే పాత్రలు రెండో పార్ట్ లో ఉండటం అందరికీ నచ్చేశాయి.

ఐతే కార్తికేయ 2 ఎలాగు సక్సెస్ అవుతుందని ముందే నమ్మకంతో ఉన్న టీం కార్తికేయ 3 ని అనౌన్స్ చేశారు. కార్తికేయ సీరీస్ ఇంకా కొనసాగుతూనే ఉంటుంది అనిపించేలా పార్ట్ 3 అనౌన్స్ చేశారు. అంతేకాదు కార్తికేయ 3 కి సంబంధించిన కొన్ని సీన్స్ కూడా చివర్లో వేశారు. ఐతే కార్తికేయ 3 ఎప్పుడు వస్తుంది. చందు మొండేటి, నిఖిల్ పార్ట్ 3 గురించి ఏం ఆలోచిస్తున్నారు అన్నది తెలియాల్సి ఉంది.

కార్తికేయ 1, 2 మధ్యలో 8 ఏళ్ల గ్యాప్ వచ్చింది. అది కావాలని తీసుకున్నారా లేదా కథ రెడీ అవ్వడానికి అంత టైం పట్టిందా అన్నది తెలియదు. కానీ కార్తికేయ 2 తీసే టైం లోనే పార్ట్ 3 తీయాలనే క్లారిటీ ఉంది. సో పార్ట్ 3 కథ ఆల్రెడీ ఉండే ఉంటుంది. ఐతే కార్తికేయ 3 తీయాలంటే ఎలా లేదన్నా ఒక రెండేళ్లు టైం తీసుకోవాలి. ఈమధ్యనే చైతన్యతో తండేల్ హిట్ కొట్టాడు చందు మొండేటి. ఆ డైరెక్టర్ నెక్స్ట్ సినిమా ఏదవుతుందా అని ఆడియన్స్ ఆసక్తిగా ఉన్నారు.

ఇక నిఖిల్ కూడా స్వయంభు, ది ఇండియా హౌస్ సినిమాలు పూర్తి చేయాల్సి ఉంది. ఈ రెండు సినిమాలు పూర్తి చేశాక కానీ వేరే సినిమా చేసే వీలుంటుంది. ఐతే చందు, నిఖిల్ మళ్లీ కలిసి కార్తికేయ 3 తీయాలంటే ఎలా లేదన్నా ఒక ఏడాది తర్వాత మొదలు పెట్టే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తుంది. కార్తికేయ నిర్మాతలు కూడా వాళ్లకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. సో వాళ్ల వాళ్ల కమిట్మెంట్స్ పూర్తయ్యాక కార్తికేయ 3 ని చేసేలా ప్లాన్ చేస్తున్నారు. 2026 లేదా 2027 లో కార్తికేయ 3 మొదలు పెట్టినా రిలీజ్ అవ్వడానికి రెండు మూడేళ్లు టైం పడుతుందని చెప్పొచ్చు.

Tags:    

Similar News