'త్రినయని' చందు ఆత్మహత్య.. అసలు కారణమిదే!

వేరే షూటింగ్ కు వెళ్లి వస్తూ తెలంగాణలోని మహబూబ్‍ నగర్‌ జిల్లాలో ఆమె కారు రోడ్డు ప్రమాదానికి గురి కాగా తీవ్రంగా గాయపడింది.

Update: 2024-05-18 14:02 GMT

త్రినయని.. ఇప్పుడు ఈ సీరియల్ పేరు ఎక్కువగా వినిపిస్తోంది. అందుకే ఒకే ఒక్క కారణం.. ఆ సీరియల్ యాక్టర్స్ ఇద్దరూ వరుసగా చనిపోవడమే. ఆ సీరియల్ లో తిలోత్తమ పాత్రలో కనిపించిన పవిత్రా జయరాం కొన్ని రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో మరణించిన విషయం తెలిసిందే. వేరే షూటింగ్ కు వెళ్లి వస్తూ తెలంగాణలోని మహబూబ్‍ నగర్‌ జిల్లాలో ఆమె కారు రోడ్డు ప్రమాదానికి గురి కాగా తీవ్రంగా గాయపడింది. దీంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించింది.

ఇక అదే సీరియల్ లో యాక్ట్ చేసిన చంద్ర కాంత్ అలియాస్ చందు నిన్న సూసైడ్ చేసుకున్నారు. హైదరాబాద్‌ లోని మణికొండలో ఉన్న అపార్ట్మెంట్‌ లోని తన ఫ్లాట్‌ లో సీలింగ్‌ ఫ్యాన్‌ కు ఉరి వేసుకుని చనిపోయారు. పవిత్రా జయరాం మరణించిన తర్వాత మానసికంగా బాగా కుంగిపోయిన ఆయన.. బలవన్మరణానికి పాల్పడ్డారు. దీంతో ఒక్కసారిగా బుల్లితెర ఇండస్ట్రీ అంతా విషాదంలో మునిగిపోయింది. కొన్ని రోజుల గ్యాప్ లో ఇద్దరు మరణించడంతో అంతా విచారం వ్యక్తం చేశారు.

Read more!

అయితే పవిత్ర కారు ప్రమాదం జరిగినప్పుడు.. ఆమెతో వాహనంలో చందు కూడా ఉన్నారు. కానీ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఇక పవిత్ర చనిపోవడాన్ని ఆయన తట్టుకోలేకపోయారు. ఎందుకంటే కొన్నేళ్లుగా పవిత్ర, చందు సహజీవనం చేస్తున్నారు. దీంతో ఆమె మరణం తర్వాత సోషల్ మీడియాలో పవిత్రను గుర్తు తెచ్చుకుంటూ పోస్టులు పెట్టారు. పవిత్ర నీ దగ్గరికి వస్తున్నా అంటూ ఇన్ స్టాలో స్టోరీ పోస్ట్ చేశారు. ఆ తర్వాత సూసైడ్ కు పాల్పడ్డారు చందు.

అయితే చందుకు కొన్నేళ్ల క్రితం శిల్ప అనే మహిళతో వివాహం జరిగింది. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. త్రినయని సీరియల్ లో యాక్ట్ చేస్తున్న సమయంలో పవిత్రతో చందుకు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కొన్ని రోజుల తర్వాత ప్రేమగా మారింది. ఇక పవిత్రకు కూడా పెళ్లి అయ్యి పిల్లలు ఉన్నారు. దీంతో పవిత్ర, చందు ఆరేళ్లుగా సహజీవనం చేస్తున్నారు. ఇప్పుడు పవిత్ర రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చనిపోగా.. చందు ఆత్మహత్యకు పాల్పడి ప్రాణం తీసుకున్నారు.

ఇక చందు మరణం తర్వాత ఆయన భార్య శిల్ప మీడియాతో మాట్లాడారు. పవిత్రపై పెంచుకున్న ప్రేమే చందుని ఇలాంటి నిర్ణయం తీసుకునేలా చేసిందని కన్నీరు పెట్టుకున్నారు. "నన్ను చందు ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఇద్దరం బాగానే ఉండేవాళ్లం. చందుకు సీరియల్ ఆఫర్స్ నేనే ఇప్పించా. త్రినయని సీరియల్ తర్వాత పవిత్ర వల్ల నా భర్త మారిపోయాడు. నన్ను పూర్తిగా వదిలేశాడు. ఆమెతోనే కలిసి ఉంటున్నాడు. ఇప్పుడు సూసైడ్ చేసుకున్నాడు" అంటూ శిల్ప విలపించింది.

Tags:    

Similar News