• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  చైతూ కాకుండా ఇంకెవరూ అలా...

చైతూ కాకుండా ఇంకెవరూ అలా చేయలేరు: చందూ మొండేటి

| దేశభక్తి అంశాలతో ముడిపడి ఉన్న ఎమోషనల్ లవ్ స్టోరీగా సినిమాను దర్శకుడు చందూ మొండేటి తెరకెక్కిస్తున్నారు.

By - Tupaki Desk
Update: 2025-01-30 11:57 GMT

టాలీవుడ్ యువ కథానాయకుడు అక్కినేని నాగచైతన్య.. తండేల్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్న విషయం తెలిసిందే. దేశభక్తి అంశాలతో ముడిపడి ఉన్న ఎమోషనల్ లవ్ స్టోరీగా సినిమాను దర్శకుడు చందూ మొండేటి తెరకెక్కిస్తున్నారు. అల్లు అరవింద్‌ సమర్పణలో బన్నీ వాసు గ్రాండ్ గా నిర్మిస్తున్నారు.

నేచురల్ బ్యూటీ సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తున్న ఆ సినిమా ఫిబ్రవరి 7న తెలుగు, తమిళ, హిందీ భాషల్లో రిలీజ్ కానుంది. మూవీ అనౌన్స్మెంట్ నుంచే సినిమాపై మంచి అంచనాలు ఉండగా.. మేకర్స్ వాటిని రోజురోజుకు పెంచుకుంటూ పోతున్నారు. రీసెంట్ గా ట్రైలర్ తో అంచనాలు ఆకాశాన్ని తాకేలా చేశారు.

బుజ్జి తల్లి (సాయి పల్లవి) - రాజు (నాగ చైతన్య) మధ్య లవ్ స్టోరీ.. అందరినీ ఆకట్టుకునేలా ఉంది. సముద్రంలో పడవపై రాజు చేసిన సాహసాలు, పాకిస్తాన్ జైలులో యాక్షన్ హంగామా సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచేలా కనిపిస్తున్నాయి. అదే సమయంలో సినిమా కోసం చైతూ బాగా కష్ట పడినట్లు క్లియర్ గా అర్థమవుతుంది.

నిజానికి.. సినిమా కోసం నాగ చైతన్య.. శ్రీకాకుళం యాసను నేర్చుకున్నట్లు ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు ఆయన మూవీ కోసం ఎంతలా కష్టపడ్డారో డైరెక్టర్ చందూ మొండేటి ఓ ఇంటర్వ్యూలో షేర్ చేసుకున్నారు. చైతూ కాకుండా సినిమా కోసం ఎవరూ అంతగా చేయలేరని చెప్పి అంచనాలు పెంచారు.

లోపల కసి ఉందో.. లేక సింప్లీ ఫిక్స్ అయ్యారేమో.. కానీ మనిషి అన్నాక కొన్ని పనులు సినిమా కోసం ఆయనలా చేయలేరని తెలిపారు. బాడీ బిల్డ్ చేయడం వంటివి ఆయన ఈజీగా చేయొచ్చని.. కానీ డైలీ సముద్రంలోకి వెళ్లి వచ్చి మూవీ కోసం కష్టపడ్డారని చెప్పారు. వాంతులు చేసి రక్తం కక్కేస్తారని భయం.. అలా నటించారని తెలిపారు.

దాంతోనే యాక్టింగ్ చేయాలి.. డ్యాన్స్ చేయాలి.. ఫైటింగ్ చేయాలి.. అలా చైతూ చాలా కష్టపడ్డారని చెప్పారు. ఆ విషయంలో టెక్నీషియన్స్ కే సుఖమని అనిపించిందని అన్నారు. తాను చిన్న గూటిలో ఉంటే చాలు.. కానీ ఎండలో, నీటిలో ఉండి సినిమా కోసం చైతూ బాగా ఎఫర్ట్ పెట్టారని కొనియాడారు. దీని బట్టి హీరో.. మామూలుగా కష్ట పడలేదని క్లియర్ గా తెలుస్తోంది. మరి మూవీతో ఎలాంటి హిట్ కొడతారో చూడాలి.

Tags:    
  • Tollywood 
  • Filmindustry 
  • Nagachaitanya 
  • Chandoomondeti 
  • Thandel 
  • Thandelmovie 
  • Saipallavi 
  • Alluarvind 
  • Geethaarts 
  • Chandoomondeticomments 
  • Thandelpromotions 

Similar News

సూపర్‌స్టార్లు స్వీయ భారం..నేటి తరం మాత్రం నిర్మాతలపై భారం!

2026-11-05 17:30 GMT

వారణాసి మహేష్ బాబు రాముడిగా ఎంత సేపు కనిపిస్తాడు...

2026-11-05 16:32 GMT

స్టెప్-మదర్ కాదు అంతకుమించి!

2026-11-05 16:30 GMT

అంగరంగ వైభవంగా సాయి దుర్గ తేజ్, కిరణ్ నిశ్చితార్థం.. అమ్మాయి వివరాలు ఇవే!

2026-11-05 16:16 GMT

రెడ్ అవుట్‌ఫిట్‌లో స్టన్నింగ్ లుక్‌తో మెరిసిన పాలక్!

2026-11-05 16:16 GMT

'రామాయణ' సెట్స్‌లో సీతగా సాయి పల్లవి.. BTS ఫొటోలు వైరల్!

2026-11-05 16:15 GMT

RC17: హీరో.. హీరోయిన్..విలన్.. ఎవరెవరంటే..!

2026-11-05 16:15 GMT

హై బడ్జెట్ ఫిల్మ్‌లో దళపతి విజయ్.. గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో!

2026-11-05 16:12 GMT

అనిల్ రావిపూడి.. ఈసారి యాక్షన్ కూడా గట్టిగానే..

2026-11-05 16:12 GMT

ఒకప్పుడు ఏలిన టాప్-5 హీరోయిన్‌లు నేడు ఊహించ‌ని స్థితిలో!

2026-11-05 15:30 GMT

డస్టీ రోజ్ శారీలో షాలిని అందాల సందడి!

2026-11-05 14:30 GMT

కమల్ హాసన్ బ్యానర్‌లో రజనీకాంత్-శ్రీలీల!

2026-11-05 13:30 GMT

Copyright @2026

Powered by Blink CMS