తండ్రి, అన్న ఓకే.. ఇప్పుడు తమ్ముడు పెండింగ్!
తండ్రి, అన్న కమ్ బ్యాక్ ఇచ్చేశారు..తమ్ముడు మాత్రమే పెండింగ్ ఉన్నాడు.. ఇప్పుడు టాలీవుడ్ సినీ వర్గాల్లో ఇదే హాట్ టాపిక్ గా మారింది.;
తండ్రి, అన్న కమ్ బ్యాక్ ఇచ్చేశారు..తమ్ముడు మాత్రమే పెండింగ్ ఉన్నాడు.. ఇప్పుడు టాలీవుడ్ సినీ వర్గాల్లో ఇదే హాట్ టాపిక్ గా మారింది. తమ్ముడు కూడా మంచి హిట్ కొట్టేయాలని ఫ్యాన్స్ అంతా కోరుకుంటున్నారు.. ఆకాంక్షిస్తున్నారు. త్వరలోనే ఆ తమ్ముడి కొత్త సినిమా రిలీజ్ కానుండగా.. ఇప్పటికే ఆడియన్స్ లో సాలిడ్ బజ్ క్రియేట్ అయ్యే ఉంది.
అక్కినేని ఫ్యామిలీ హీరోల గురించే మనం మాట్లాడుకుంటున్నామని ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది. కొంతకాలంగా సరైన హిట్ కోసం టాలీవుడ్ కింగ్ నాగార్జున, యంగ్ హీరోలు నాగచైతన్య, అఖిల్ వెయిట్ చేస్తున్నారు. రీసెంట్ గా తండేల్ తో చైతూ సూపర్ హిట్ ను అందుకోగా.. నాగార్జున తాజాగా కుబేరతో బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకున్నారు.
వరుస సినిమాలు చేస్తున్న హిట్ కొట్టని నాగచైతన్య.. చందూ మొండేటి దర్శకత్వం వహించిన తండేల్ తో రూ.100 కోట్ల విజయాన్ని సాధించారు. సినీ ప్రియులను విపరీతంగా ఆకట్టుకున్నారు. తన మార్కెట్ ను కూడా ఒక్కసారిగా పెంచుకున్నారు. సింపుల్ గా చెప్పాలంటే.. తండేల్ మూవీ తర్వాత చైతూ కెరీర్ లో బిగ్ ఛేంజ్ వచ్చిందని చెప్పాలి.
అదే సమయంలో నా సామి రంగాతో భారీ విజయాన్ని సొంతం చేసుకోవాలని నాగార్జున అనుకున్నారు. భారీ వసూళ్లు రాబట్టినా అనుకున్న స్థాయిలో సక్సెస్ అవ్వలేకపోయారు. ఆ తర్వాత కాస్త గ్యాప్ ఇచ్చిన ఆయన.. కుబేరలో కీలక పాత్రలో కనిపించారు. సీబీఐ ఆఫీసర్ రోల్ లో మెప్పించారు. కత్తి మీద సాము లాంటి క్యారెక్టర్ తో ఆకట్టుకున్నారు.
దీంతో అక్కినేని అభిమానులు చాలా సంతోషంగా ఉన్నారు. నాగ చైతన్య, నాగార్జున ఇద్దరూ బాక్సాఫీస్ వద్ద పెద్ద విజయాలు సాధించడంతో.. అఖిల్ లెనిన్ తో కూడా విజయం సాధిస్తాడని అభిమానులు ఆశిస్తున్నారు. కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ అందుకోవాలని ఆకాంక్షిస్తున్నారు. ప్రస్తుతం లెనిన్ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతున్న విషయం తెలిసిందే.
కెరీర్ లో ఇప్పటికే పలు సినిమాలు చేసిన అఖిల్.. సరైన హిట్ ను మాత్రం సొంతం చేసుకోలేకపోయారు. చివరగా ఏజెంట్ మూవీతో దారుణంగా నిరాశపరిచారు. భారీ బడ్జెట్ తో రూపొందిన ఆ సినిమా.. అనేక విమర్శలు ఎదుర్కొంది. ఇప్పుడు లెనిన్ పైనే ఆశలు పెట్టుకున్నారు. మురళీ కిషోర్ అబ్బూరి దర్శకత్వం వహించిన ఆ సినిమా మాస్ యాక్షన్ డ్రామాగా రూపొందుతోంది. మరి అఖిల్ ఎలాంటి హిట్ అందుకుంటారో వేచి చూడాలి.