• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  పవన్ ఫ్యాన్స్...

పవన్ ఫ్యాన్స్ అత్యుత్సాహం.. థియేటర్లో మంటలు?

| ఈ మధ్యకాలంలో స్టార్ హీరోల అభిమానులు చేసే పనులు ఇతరులకు చిరాకు తెప్పిస్తోంది

By - Tupaki Desk
Update: 2024-02-07 13:40 GMT

ఈ మధ్యకాలంలో స్టార్ హీరోల అభిమానులు చేసే పనులు ఇతరులకు చిరాకు తెప్పిస్తోంది. అభిమానం హద్దులు దాటితే తర్వాత జరిగే పరిణామాలను అంచనా వేయలేం. అభిమానం పేరిట కొంతమంది చేసే పనులు తీవ్ర పరిణామాలకు దారి తీస్తున్నాయి. ఈ మధ్యకాలంలో స్టార్ హీరోల సినిమాలను రీరిలీజ్ పేరుతో థియేటర్స్ లో ప్రదర్శిస్తున్న విషయం తెలిసిందే. ఓ కొత్త సినిమా రిలీజ్ అయితే ఎలా ఉంటుందో ఆ విధంగా రీ రిలీజ్ థియేటర్స్ వద్ద సందడి చేస్తున్నారు అభిమానులు.

పాలాభిషేకాలు, కొబ్బరికాయలు కొట్టడం, భారీ ప్లెక్సీ లు ఏర్పాటు చేయడం.. ఇక్కడి వరకు బాగానే ఉంది అని కొంతమంది ఫ్యాన్స్ అభిమానం పేరుతో థియేటర్స్ ధ్వంసం చేయడం, అద్దాలు పగలగొట్టడం, ఏకంగా థియేటర్లో బాణ సంచనాలు కాల్చడం లాంటివి చేస్తున్నారు. స్క్రీన్స్ చించేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అందుకే ఈమధ్య థియేటర్ యాజమాన్యం రీ రిలీజ్ సినిమాలను నిలిపివేశారు.

రీసెంట్ గా 'జల్సా' సినిమా రీ రిలీజ్ అయినప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ థియేటర్ ధ్వంసం చేశారు. అక్కడ సౌండ్ సరిగా రావట్లేదని పెంచమంటే థియేటర్ యాజమాన్యం సరిగా స్పందించలేదని థియేటర్ ధ్వంసం చేశారు. ఇక ఇప్పుడు మరోసారి అదే పవన్ కళ్యాణ్ అభిమానులు ఆంద్రప్రదేశ్ లోని ఓ థియేటర్లో ఏకంగా మంటలు పెట్టారు. పవన్ కళ్యాణ్ నటించిన 'కెమెరామెన్ గంగతో రాంబాబు' మూవీ రీరిలీజ్ సందర్భంగా ఈ సంఘటన చోటు చేసుకుంది.

'కెమెరామెన్ గంగతో రాంబాబు' రీ రిలీజ్ సందర్భంగా కొంతమంది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అత్యుత్సాహంతో థియేటర్లో చిత్తుకాగితాలను దగ్గరకు చేసి వాటికి నిప్పంటించి ఆ మంటల్లోనే ఎగురుతూ నానా రచ్చ చేశారు. అక్కడితో ఆగకుండా ఆ మంటలను మరింత పెంచేందుకు చిత్తు కాగితాలను అందులోకి విసిరి మంటలు మరింత పెంచే ప్రయత్నం చేశారు.

ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియా అంతట తెగ వైరల్ గా మారింది. ఈ వీడియోని చూసిన నెటిజన్స్ పవర్ స్టార్ ఫ్యాన్స్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. థియేటర్ లోపల ఇలా మంటలు పెట్టడం కరెక్ట్ కాదని, అభిమానం పేరుతో కొందరు ఇలా చేస్తున్నారని, వీలైనంత త్వరగా ఈ రీ రిలీజ్ ట్రెండ్ ని ఆపేయాలని పలువురు అభిప్రాయపడుతున్నారు.

Tags:    
  • Pawankalyan 
  • Cameramangangathorambabu 
  • Pawanfans 
  • Theatrefire 
  • Filmindustry 
  • Moviererelease 

Similar News

రణ్‌బీర్‌కి ఇలా, యష్‌కి అలా…రామాయణం మూవీ వెనుక ఇంట్రెస్టింగ్ సీక్రెట్స్..!

2026-11-20 10:20 GMT

బ‌న్నీ రేసులో బోయ‌పాటి నెంబ‌ర్ - 4!

2026-11-20 10:20 GMT

పండంటి మగ బిడ్డకి జన్మనిచ్చిన సమంత.. కొడుకు పేరు ఏమిటంటే?

2026-11-20 09:21 GMT

సౌత్ ఇండ‌స్ట్రీపై రాజ‌మండ్రి బ్యూటీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!

2026-11-20 09:21 GMT

Allu Aravind Three Stars: చిరు, చరణ్, బన్నీ..!

2026-11-20 08:28 GMT

'ఓం' మూవీ రివ్యూ

2026-11-20 08:27 GMT

తెలిసిన వారినే ప్రశ్నించడానికి ఎందుకు వెనుకాడుతున్నాం?

2026-11-20 08:23 GMT

సూపర్‌స్టార్ పక్కన చిన్నపిల్లలా అందాల రాశీఖ‌న్నా!

2026-11-20 07:38 GMT

తొలుత అర్థం కాలేదు.. తెలిశాక వివరించే ప్రయత్నం చేశా!

2026-11-20 07:36 GMT

మృత్యువు అంచుల నుంచి కాజల్ అగర్వాల్‌కు తప్పిన ప్రమాదం..!

2026-11-20 06:45 GMT

'గాడ్జిల్లా'పై 'రామాయ‌ణం' ఇంపాక్ట్ ఎంత‌?

2026-11-20 06:43 GMT

సొంత థియేటర్‌పై ఫిర్యాదు.. అల్లు అరవింద్ రియాక్షన్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

2026-11-20 06:42 GMT

Copyright @2026

Powered by Blink CMS