దేవర.. అనిరుధ్ ఈ టైమ్ లో కొట్టాల్సిందే..

ఇలాంటి సమయంలో, అనిరుద్ "ఫియర్" పాటతో అద్భుతమైన సంగీతాన్ని అందించాలని తారక్ ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. పాట ఏమాత్రం క్లిక్కయినా కూడా మంచి బజ్ క్రియేట్ అవుతుంది.

Update: 2024-05-16 07:46 GMT

ప్రస్తుతం భారతీయ సినీ సంగీత ప్రపంచంలో కొత్త ట్రెండ్ సృష్టించిన వ్యక్తి అనిరుద్ రవిచందర్. తన ప్రతిభతో, ప్రత్యేకమైన సంగీతంతో యువతను ఆకట్టుకుంటున్న ఈ సంగీత దర్శకుడు ఇప్పుడు దేశంలో అత్యధిక పారితోషికం పొందుతున్న సంగీత దర్శకులలో ఒకరిగా ఉన్నాడు. అనిరుద్ మ్యూజిక్ తో మాత్రమే కాకుండా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా డిఫరెంట్ గా ఎట్రాక్ట్ చేస్తున్నాడు.

అతను సినిమా కోసం ఏ పని చేసినా సూపర్ హిట్ అవుతుండటంతో, నిర్మాతలు అతని భారీ పారితోషికాన్ని ఖర్చు చేయడానికి వెనుకాడడం లేదు. ప్రస్తుతం అనిరుధ్ పారితోషికం దాదాపు ₹12 కోట్లు ఉన్నట్లు టాక్ వస్తోంది. ఇక అనిరుద్ తన ప్రతిభను "దేవర" చిత్రంలో మరొకసారి చూపించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ చిత్రంలో ఆయన స్వరపరిచిన "ఫియర్" పాట త్వరలో విడుదల కానుంది.

ఈ పాటపై ఊహించని రేంజ్ లో అంచనాలున్నాయి, ఎందుకంటే ఇటీవల రామ్ చరణ్ "గేమ్ చేంజర్", అల్లు అర్జున్ "పుష్ప 2", తలపతి విజయ్ "GOAT" చిత్రాల నుండి విడుదలైన మొదటి సింగిల్స్ పెద్దగా ముద్ర వేయలేకపోయాయి. థమన్ స్వరపరిచిన "జరగండి జరగండి", దేవి శ్రీ ప్రసాద్ ట్యూన్ చేసిన "పుష్ప పుష్ప", యువన్ శంకర్ రాజా సంగీతం అందించిన "విసిల్ పోడు" పాటలు హీరోల ఫ్యాన్ బేస్ వల్ల వైరల్ అయినప్పటికీ, సంగీత చార్టుల్లో పెద్దగా ప్రాధాన్యత పొందలేదు.

Read more!

ఇలాంటి సమయంలో, అనిరుద్ "ఫియర్" పాటతో అద్భుతమైన సంగీతాన్ని అందించాలని తారక్ ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. పాట ఏమాత్రం క్లిక్కయినా కూడా మంచి బజ్ క్రియేట్ అవుతుంది. గతంలో అనిరుద్ ప్రతి సినిమా మొదటి సింగిల్‌తో సూపర్ హిట్ కొట్టిన అనుభవం ఉంది. "దేవర" చిత్రం పాట కూడా అదే స్థాయిలో హిట్ అయితే, అనిరుద్ బ్రాండ్ మరింత పవర్ఫుల్ గా మారుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. అనిరుద్ తన సంగీతంలో కొత్తదనాన్ని, వైవిధ్యాన్ని తీసుకువస్తూ, సంగీత ప్రియులను మంత్ర ముగ్ధులను చేస్తూ ముందుకు సాగుతున్నాడు.

ఇక దేవర సినిమాకు కూడా మంచి బజ్ అయితే అవసరం ఉంది. ఇప్పటివరకు వచ్చిన పోస్టర్లు టీజర్ కూడా పాన్ ఇండియా వరల్డ్ లో పెద్దగా ఇంపాక్ట్ క్రియేట్ చేయలేకపోయాయి. కాబట్టి అనిరుధ్ ఇవ్వబోయే మ్యూజిక్ పైనే మేకర్స్ ఆశలు పెట్టుకున్నారు. సినిమాకు ఇప్పుడు మంచి బజ్ క్రియేట్ కావాలి అంటే ఫస్ట్ సింగిల్ బిగ్ ఇంపాక్ట్ క్రియేట్ చేయాలి. మరి అనిరుధ్ ఇచ్చే ట్యూన్ ఏ రేంజ్ లో ఆకట్టుకుంటుందో చూడాలి.

Tags:    

Similar News