• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  పవన్ సినిమా.. బయ్యర్ల...

పవన్ సినిమా.. బయ్యర్ల బాధేమిటంటే..

| పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న మూవీ ఉస్తాద్ భగత్ సింగ్.

By - Tupaki Desk
Update: 2024-03-21 04:20 GMT

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న మూవీ ఉస్తాద్ భగత్ సింగ్. ప్యూర్ కమర్షియల్ యాక్షన్ ప్యాక్డ్ మూవీగా హరీష్ శంకర్ ఈ చిత్రాన్ని సిద్ధం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ రాజకీయ కార్యాచరణలో బిజీగా ఉండటం వలన ఈ మూవీ షూటింగ్ వాయిదా పడింది. తాజాగా ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ గ్లింప్స్ ని చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.

ఇందులో గాజు గ్లాస్ గురించి చెప్పిన డైలాగ్ పవర్ స్టార్ అభిమానులకి భాగా కనెక్ట్ అయ్యింది. అయితే వైసీపీ సపోర్టర్స్ మాత్రం ఎన్నికలు దృష్టిలో ఉంచుకొని మూవీలో గాజుగ్లాస్ డైలాగ్ పెట్టి సడెన్ గా గ్లింప్స్ వదిలారని అంటున్నారు. ఏది ఏమైనా గ్లింప్స్ కి అయితే అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ మూవీలో పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడు.

దీంతో హరీష్, పవన్ కాంబోలో వచ్చిన గబ్బర్ సింగ్ ని అందరూ గుర్తుచేసుకుంటున్నారు. తమిళ్ హిట్ మూవీ తెరికి రీమేక్ గా ఈ చిత్రం తెరకెక్కుతోంది. అయిన కూడా కథలో చాలా మార్పులు చేసి పవన్ కళ్యాణ్ ఇమేజ్ ని సరిపోయే విధంగా యాక్షన్, ఎలివేషన్ సీక్వెన్స్ ని హరీష్ శంకర్ ఉస్తాద్ లో బలంగా డిజైన్ చేశారంట. ఉస్తాద్ భగత్ సింగ్ గ్లింప్స్ తో మూవీపైన ఎక్స్ పెక్టేషన్స్ కూడా అమాంతం పెరిగిపోయాయి.

దీంతో ఈ చిత్రాన్ని దసరా లేదా దీపావళికి రిలీజ్ ప్లాన్ చేయాలని బయ్యర్లు మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలని కోరుతున్నారంట. ఎలక్షన్ అయ్యాక ఎలాగూ పవన్ కళ్యాణ్ షూటింగ్స్ మొదలు పెడతాడు కాబట్టి వీలైనంత వేగంగా ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రీకరణ పూర్తి చేసి రిలీజ్ కి సిద్ధం చేయాలని అడుగుతున్నారని టాక్ వినిపిస్తోంది. 30 నుంచి 35 రోజులు ఈ మూవీకి కాల్ షీట్స్ కేటాయిస్తే సినిమా కంప్లీట్ అయిపోయే అవకాశం ఉందంట.

మైత్రీ నిర్మాతలు కూడా ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. అయితే ఎన్నికలు పూర్తయిన తర్వాత పవన్ కళ్యాణ్ వెంటనే ఓజీ మూవీ షూటింగ్ స్టార్ట్ చేయనున్నాడని టాక్ వినిపిస్తోంది. ఆ సినిమా కంప్లీట్ చేసిన తర్వాత ఉస్తాద్ భగత్ సింగ్ ని సెట్స్ పైకి తీసుకొని వెళ్లే అవకాశం ఉంది. ఇక పవన్ కళ్యాణ్ నిర్ణయం మార్చుకొని ముందుగా ఉస్తాద్ కంప్లీట్ చేస్తాడా? లేదంటే ఓజీ సినిమాపై ఫోకస్ చేస్తాడా అనేది ? అనేది తెలియాలంటే ఎన్నికలు అయ్యేంత వరకు వేచి చూడాల్సిందే. మరోవైపు అతని లిస్టులో హరిహర వీరమల్లు సినిమా కూడా ఉంది. దీని షూటింగ్ కూడా చాలా వరకు బ్యాలెన్స్ ఉంది.

Tags:    
  • Pawankalyan 
  • Buyers 
  • Ustadbhagatsingh 
  • Mythrimoviemakers 
  • Devisriprasad 
  • Harishshankar 
  • Og 

Similar News

'సీన్' మూవీ రివ్యూ

2026-11-06 07:54 GMT

గార్జియస్ లుక్ లో అందరినీ తన వైపు తిప్పుకున్న శ్రీలీల.. ఔట్ఫిట్ తోనే మాయ చేస్తూ!

2026-11-06 07:51 GMT

రాజకీయాల నుంచి వెండితెరకు అసాధారణ ప్రయాణం!

2026-11-06 07:30 GMT

'సమ్మర్ హాలిడేస్' రివ్యూ

2026-11-06 07:23 GMT

ఫ్లాపుల తర్వాత రామ్ మాస్టర్ ప్లాన్.. 2027లో రెండు సినిమాల రిలీజ్‌కు రెడీ!

2026-11-06 06:30 GMT

సూర్యకు మళ్లీ 30 కోట్ల టార్గెట్

2026-11-06 05:49 GMT

కాజల్‌కు ఈ పార్ట్ 2 కష్టాలేంటి!

2026-11-06 05:49 GMT

కన్నుగీటుతూ కుర్రకారు గుండెల్లో గుబులు పుట్టిస్తున్న జాన్వీ కపూర్!

2026-11-06 05:45 GMT

భారీ బడ్జెట్ అంటే ఈ రెండు బ్యానర్లే గుర్తొస్తున్నాయా!

2026-11-06 05:06 GMT

రామాయణం కలెక్షన్స్.. ఓపెనింగ్స్ ఓకే కానీ!

2026-11-06 05:05 GMT

వారణాసి: ఇక స్ట్రాంగ్‌గా మొదలవ్వాలి!

2026-11-06 05:03 GMT

ఆదిపురుష్, రామాయణం.. తేడా అక్కడే కనిపించింది!

2026-11-06 04:06 GMT

Copyright @2026

Powered by Blink CMS