రూ.45 ల‌తో కెరీర్ ను మొద‌లుపెట్టి ఇప్పుడు బ‌డా నిర్మాతగా..

ఒక‌ప్పుడు రూ.45 ల‌తో జ‌ర్నీని మొదలుపెట్టిన బ‌న్నీ వాసు ఇప్పుడు వంద‌ల కోట్ల‌తో సినిమాలు తీయ‌డ‌మే కాకుండా వ‌రుస హిట్లు అందుకుంటున్నారు.;

Update: 2025-10-07 10:32 GMT

జీవితం ఎప్పుడు ఎలా మ‌లుపు తిరుగుతుందో ఎవ‌రూ చెప్ప‌లేం. సినీ ఇండ‌స్ట్రీలో అయితే ప్ర‌తీ శుక్ర‌వారం కొంద‌రి జీవితాలు మారుతూ ఉంటాయి. అప్ప‌టివ‌ర‌కు ఎవ‌రో కూడా తెలియ‌ని వారు స‌డెన్ గా స్టార్లు అయితే, అప్ప‌టివ‌ర‌కు స్టార్లుగా ఉన్న కొంద‌రు స‌డెన్ గా ఢీలా ప‌డిపోవాల్సి వ‌స్తుంది. అందుకే సినీ ప్ర‌పంచం చాలా వింత‌గా ఉంటుందని అంద‌రూ అంటుంటారు.

రూ.45 ల‌తో మొద‌లైన జ‌ర్నీ

టాలీవుడ్ నిర్మాత బ‌న్నీ వాసు జ‌ర్నీ చూస్తుంటే ఇండ‌స్ట్రీలో ఏమైనా జ‌ర‌గొచ్చు అని అర్థ‌మ‌వుతుంది. జేబులో రూ.45 మ‌రియు గుండెల్లో కొండంత ధైర్యంతో బ‌న్నీ వాసు జ‌ర్నీ మొద‌లైంది. అవును, నిజం. బ‌న్నీ వాసు జర్నీ రూ.45 ల‌తోనే మొద‌లైంది. ఆర్య సినిమాతో బ‌న్నీ వాసు త‌న కెరీర్ ను స్టార్ట్ చేశారు. త‌ర్వాత మెల్లిగా వాసు మెగా మ‌రియు అల్లు ఫ్యామిలీస్ కు చేరువయ్యారు.

అల్లు అర్జున్ తో ఫ్రెండ్‌షిప్

ఆ త‌ర్వాత అల్లు అర్జున్ తో ఫ్రెండ్‌షిప్ కుదిరి అత‌ని లైఫ్ మొత్తం మారిపోయింది. అయితే ఇదంతా బ‌న్నీ వాసు అదృష్టం మాత్ర‌మే అనుకోవ‌డానికి లేదు. అల్లు కుటుంబానికి వాసు ఎంతో న‌మ్మ‌కంగా ఉంటూ రావ‌డంతో త‌ర్వాత వాసు కు అల్లు అర్జున్ భారీగా స‌పోర్ట్ చేశారు. బ‌న్నీ స‌పోర్ట్ వ‌ల్ల వాసుకు ఎన్నో పెద్ద అవ‌కాశాలు రావ‌డం వ‌ల్ల త‌ర్వాత అత‌ను వెన‌క్కి తిరిగి చూసుకోవాల్సిన అవ‌స‌రం రాలేదు.

వంద‌ల కోట్ల‌తో సినిమాలు తీస్తున్న బ‌న్నీ వాసు

ఒక‌ప్పుడు రూ.45 ల‌తో జ‌ర్నీని మొదలుపెట్టిన బ‌న్నీ వాసు ఇప్పుడు వంద‌ల కోట్ల‌తో సినిమాలు తీయ‌డ‌మే కాకుండా వ‌రుస హిట్లు అందుకుంటున్నారు. లిటిల్ హార్ట్స్, మ‌హావ‌తార్ న‌ర‌సింహ‌, కాంతార చాప్ట‌ర్1 సినిమాలు అత‌నికి సినిమాల‌పై ఉన్న ప‌ట్టుని తెలియ‌చేస్తుంది. టాలీవుడ్ లో బ‌న్నీ వాసు పేరు ఇప్పుడు చాలా గ‌ట్టిగా వినిపిస్తోంది. స‌రైన టైమ్ లో స‌రైన నిర్ణ‌యాలు తీసుకోవ‌డం, ఒక్కోసారి రిస్క్ కూడా తీసుకుంటూ కెరీర్లో ముందుకెళ్తున్నారు బ‌న్నీ వాసు.

ఇప్పుడు బ‌న్నీ వాసు నుంచి మిత్ర మండ‌లి అనే కామెడీ ఎంట‌ర్టైన‌ర్ రాబోతుంది. అక్టోబ‌ర్ 16న ఈ సినిమా రిలీజ్ కానుంది. బ‌న్నీ వాసు నుంచి వ‌స్తున్న సినిమా కావ‌డంతో మిత్ర మండ‌లిపై అంద‌రికీ మంచి అంచ‌నాలే ఉన్నాయి. రీసెంట్ గా ఓ ఇంట‌ర్వ్యూలో బ‌న్నీ వాసు మాట్లాడుతూ, అల్లు అర్జున్ త‌న‌ను మొద‌ట్నుంచి న‌మ్మాడ‌ని, ఆర్య సినిమా రిలీజైన‌ప్పుడు పాల‌కొల్లు డిస్ట్రిబ్యూష‌న్ ను తీసుకోమ‌ని త‌న‌కు చెప్పి, దిల్ రాజుతో మాట్లాడాడ‌ని, కానీ అప్పుడు త‌న వ‌ద్ద రూ. 45 మాత్ర‌మే ఉన్నాయ‌ని దిల్ రాజుకు చెప్తే ఆయ‌న న‌వ్వి, మిగిలిన‌వి త‌ర్వాత ఇవ్వ‌మ‌న్నార‌ని కెరీర్ తొలినాళ్ల‌ను గుర్తు చేసుకున్నారు.

Tags:    

Similar News