మీ గర్ల్ ఫ్రెండ్ తో సినిమాకెళ్తే క్లైమాక్స్ లో జాగ్రత్త!
నేషనల్ క్రష్ రష్మిక మందన్న తాజాగా నటిస్తున్న చిత్రం 'ది గర్ల్ ఫ్రెండ్' . నవంబర్ 7వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.;
నేషనల్ క్రష్ రష్మిక మందన్న తాజాగా నటిస్తున్న చిత్రం 'ది గర్ల్ ఫ్రెండ్' . నవంబర్ 7వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ సినిమాకు సంబంధించి ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ను ఘనంగా నిర్వహించారు. ట్రైలర్ రిలీజ్ సందర్భంగా ఏర్పాటుచేసిన ఈ ఈవెంట్లో పలువురు నిర్మాతలు ఈ కార్యక్రమానికి గెస్ట్ గా విచ్చేశారు. అందులో భాగంగానే ఒక్కొక్కరు ఒక్కో విధంగా రష్మిక గురించి అలాగే ఈ చిత్రం గురించి కామెంట్ చేయడంతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి.
ఇక అందులో భాగంగానే ప్రముఖ నిర్మాత బన్నీ వాసు మాట్లాడుతూ.." మీ గర్ల్ ఫ్రెండ్ తో ఈ సినిమాకెళ్తే క్లైమాక్స్లో జాగ్రత్త" అంటూ చేసిన కామెంట్లు ఇప్పుడు మరింత వైరల్ గా మారాయి. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.
ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో భాగంగా నిర్మాత బన్నీ వాసు మాట్లాడుతూ.. "నిన్న రాత్రి నేను ఈ సినిమా చూశాను. క్లైమాక్స్ ఇప్పటికీ నా బ్రెయిన్ నుంచి వెళ్లడం లేదు. ఒకటే చెప్పగలను. థియేటర్లో కూర్చున్న 60% అమ్మాయిల కథ ఇది. ముఖ్యంగా ఇంట్రోవర్ట్ అమ్మాయిలకు ఈ సినిమా ఖచ్చితంగా సూట్ అవుతుంది. అబ్బాయిలు మీరు మాత్రం ఈ సినిమాకి మీ గర్ల్ ఫ్రెండ్ ని తీసుకెళ్తే మాత్రం క్లైమాక్స్ లో జాగ్రత్త. సినిమా అయిపోయిన తర్వాత మీరు లేచేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్త. ఎందుకంటే మిమ్మల్ని ఆ అమ్మాయి హగ్ చేసుకుందంటే మీరు చాలా మంచి బాయ్ ఫ్రెండ్.. మిమ్మల్ని ఏమీ అనకుండా సైలెంట్ గా ఫాలో అవుతుందంటే మాత్రం డబల్ చెక్ చేసుకోండి.. ఏ రియాక్షన్ లేదంటే మీరు కార్ ఎక్కిన తర్వాత లేదా ఇంటికి వెళ్ళిన తర్వాత మీ చెంపలు మాత్రం జాగ్రత్త.. అమ్మాయి థియేటర్లోకి వచ్చినప్పుడు ఎలా అయితే ఉంటుందో.. వెళ్లేటప్పుడు మాత్రం అలా ఉండదు.. అబ్బాయిలే కాదు భర్తల అందరూ కూడా జాగ్రత్త.. మీ భార్యలతో వస్తే " అంటూ తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చారు బన్నీ వాసు.
అలాగే బన్నీ వాసు మాట్లాడుతూ.. "రష్మిక మా గీత ఆర్ట్స్ గీత అలాగే ఇప్పుడు భూమా.. రష్మిక అనడం కంటే కూడా ఇండియన్ క్రష్మిక అనడం మేలేమో" అంటూ తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చారు.
కాంట్రవర్సీపై కూడా కామెంట్ చేస్తూ.. "కాంట్రవర్సీకి ఇక నేను చోటు ఇవ్వను. ఈరోజు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మరీ మాట్లాడతాను. ఆ కాంట్రవర్సీకి అల్లు అరవింద్ గారితో తిన్న అన్ని తిట్లు నేను మా ఫాదర్ తో కూడా తినలేదు. అందుకే ఈరోజు ఒళ్ళు చాలా జాగ్రత్తగా దగ్గర పెట్టుకొని మాట్లాడుతాను. వైరల్ ఇమ్మంటారు మళ్లీ ఆయనే వైరు పట్టుకొని కొడతారు" అంటూ అందరి చేత నవ్వులు పూయించారు.