గురువులో లేని ఆ ధైర్యం శిష్యుడిలో!
అతడే రాక్ స్టార్ దేవి శ్రీప్రసాద్. సుకుమార్ ఇప్పటి వరకూ దర్శకత్వం వహించిన తొమ్మిది సినిమాలకు సంగీతం అందించింది దేవీ ప్రసాదా్ ఒక్కడే.;
టాలీవుడ్ లో గొప్ప గురుశిష్యులెవరంటే నెటి జనరేషన్ కు గుర్తొచ్చేది సుకుమార్-బుచ్చిబాబు ద్వయమే. బుచ్చిబాబు సుకుమార్ స్టూడెంట్ కావడంతో సినిమాల్లోకి ఈజీగా రాగలిగాడు. ఎంట్రీ పరంగా పెద్దగా ఇబ్బంది పడలేదు. సుకుమార్ వద్ద శిష్యరికం చేసి `ఉప్పెన`తో డైరెక్టర్ గా బయటకు వచ్చేసాడు. ఇప్పుడు రామ్ చరణ్ తోనే సినిమా చేస్తున్నాడు. కానీ గురువు తీసుకోలేని కొన్ని డేరింగ్ నిర్ణయాలను శిష్యుడు బుచ్చిబాబు తీసుకుంటున్నాడు అన్నది కాదనలేని నిజం. మ్యూజిక్ డైరెక్టర్ల విషయంలో సుకుమార్ ఇప్పటికే ఒకే ఒక్కరితో పనిచేసారు.
సుకుమార్ -దేవి శ్రీ ప్రసాద్:
అతడే రాక్ స్టార్ దేవి శ్రీప్రసాద్. సుకుమార్ ఇప్పటి వరకూ దర్శకత్వం వహించిన తొమ్మిది సినిమాలకు సంగీతం అందించింది దేవీ ప్రసాదా్ ఒక్కడే. మార్కెట్ లో ఎంతో మంది సంగీత దర్శకులు ఉన్నా? సుకుమార్ మాత్రం దేవి శ్రీని తప్ప మరెవ్వర్నీ తీసుకోలేదు. ఎందుకంటే నమ్మకం. కొత్త వాళ్లతో రిస్క్ తీసుకోవడం కన్నా? దేవి అయితే సంగీత పరంగా టెన్షన్ పడాల్సిన పని ఉండదు. ది బెస్ట్ అందిస్తాడు అన్న నమ్మకంతో ఆయనతో తప్ప మరో సంగీత దర్శకుడి జోలికి వెళ్లలేదు. ఈ విషయంలో సుకుమార్ పూర్తిగా రాజమౌళినే ఫాలో అవుతున్నాడు.
రెహమాన్ తో తెలుగు డైరెక్టర్:
రాజమౌళి డైరెక్ట్ చేసిన సినిమాలన్నింటికీ కీరవాణి మాత్రమే సంగీతం అందించారు. ప్రస్తుత చిత్రానికి కూడా ఆయనే స్వరకర్త. ఆయన్ని పట్టుకుని ఏకంగా ఆస్కార్ అవార్డు కూడా తెలుగు సినిమాకు తెచ్చి పెట్టిన ఘనుడు జక్కన్న. ఆ సంగతి పక్కన బెడితే? బుచ్చిబాబు మాత్రం అలా కాదు. సంగీత పరంగా కొత్తదనం కోరుకుంటున్నాడు. అందుకే అతడి తొలి సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తే? రెండవ సినిమా `పెద్ది`కి ఏకంగా మ్యూజిక్ లెజెండ్ ఏ. ఆర్ . రెహమాన్ నే రంగంలోకి దించాడు. `పెద్ది` కోసం ఇద్దరు ఎంత అండర్ స్టాండింగ్ తో పనిచేస్తున్నారో తెలిసిందే.
తదుపరి సినిమాకి ఎవరు బుచ్చి?
రెహమాన్ కి బుచ్చిబాబు సిచ్వేషన్ చెప్పడం..రెహమాన్ ట్యూన్ కట్టడం ఇప్పటికే చూసారంతా. రెహమాన్ తో పని చేయడం అన్నది బుచ్చిబాబు చిన్నప్పటి కల. ఆ డ్రీమ్ ఇప్పుడు తీర్చుకుంటున్నాడు. ఈ విషయంలో బుచ్చిబాబును నిజంగా మెచ్చుకోవాలి. తెలుగు సినిమాకు రెహమాన్ ఎప్పుడు పనిచేస్తారని ఆయన అభిమా నులంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. బుచ్చిబాబు రూపంలో వారి కోరిక తీరుతుంది. అలా బుచ్చిబాబు-సుకుమార్ మధ్య సంగీత దర్శకుల పరంగా వ్యత్యాసం చూడొచ్చు. బుచ్చిబాబు తదుపరి సినిమా కూడా ఓ పెద్ద స్టార్ తోనే ఉంటుంది. మరి ఆ సినిమాకు హ్యారీస్ జయరాజ్ ని దించుతాడా? అనిరుద్ ని దించుతాడా? అన్నది చూడాలి.