వారణాసి తరువాత బుచ్చిబాబుతో అంటే..
అయితే ఇక్కడ అసలు ట్విస్ట్ వేరే ఉంది. మహేష్ బాబు ప్రస్తుతం ఎస్ఎస్ రాజమౌళితో చేస్తున్న వారణాసి సినిమా షూటింగ్ లో ఫుల్ బిజీగా ఉన్నాడు.
టాలీవుడ్ లో ఇప్పుడు మరో క్రేజీ కాంబినేషన్ వైరల్ అవుతోంది. రామ్ చరణ్ పెద్ది సినిమా తర్వాత దర్శకుడు బుచ్చిబాబు సనా తదుపరి టార్గెట్ సూపర్ స్టార్ మహేష్ బాబు అని ఒక టాక్ నడుస్తోంది. మహేష్ తో సినిమా చేయాలనేది ఈ యంగ్ డైరెక్టర్ కు ఎప్పటినుంచో ఉన్న కల. సుకుమార్ దగ్గర అసిస్టెంట్ గా ఉన్న టైమ్ లో వన్ నేనొక్కడినే సినిమాకి బుచ్చిబాబు పనిచేశాడు. అప్పటినుంచే మహేష్ తో మంచి పరిచయం ఉంది. అలాగే ఉప్పెన చూసి ఆ టైమ్ మహేష్ ప్రత్యేకంగా పిలిచి మెచ్చుకున్నాడు.
అయితే ఇక్కడ అసలు ట్విస్ట్ వేరే ఉంది. మహేష్ బాబు ప్రస్తుతం ఎస్ఎస్ రాజమౌళితో చేస్తున్న వారణాసి సినిమా షూటింగ్ లో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం ఈ మూవీ షూటింగ్ ఇప్పటికే సగానికి పైగా పూర్తయింది. సుమారు 1200 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్ట్ హాలీవుడ్ రేంజ్ లో రిలీజ్ కానుందని చెబుతున్నారు. బాక్సాఫీస్ దగ్గర ఏకంగా 5000 కోట్లకు పైగా మార్కెట్ ను టార్గెట్ చేస్తోందనే ప్రచారం గట్టిగా సాగుతోంది.
రాజమౌళితో సినిమా అంటే కచ్చితంగా బ్లాక్ బస్టర్ అనే నమ్మకం ఆడియన్స్ లో ఉంటుంది. కేవలం సక్సెస్ రేంజ్ ఎంత అనేది మాత్రమే తేలాల్సి ఉంటుంది. వారణాసి లాంటి గ్లోబల్ ప్రాజెక్ట్ తర్వాత మహేష్ క్రేజ్ ఊహించని స్థాయికి వెళ్లడం ఖాయం. అంత పెద్ద హిట్ పడ్డాక మహేష్ అడుగులు ఎలా ఉంటాయి, నెక్స్ట్ ఎలాంటి దర్శకుడికి ఛాన్స్ ఇస్తాడు అనేది ఇప్పుడు టాలీవుడ్ లో పెద్ద సస్పెన్స్. ఆ గ్లోబల్ ఇమేజ్ ను క్యారీ చేయగల దర్శకుడు దొరకడం అంత ఈజీ కాదు.
సరిగ్గా ఇక్కడే బుచ్చిబాబు ముందు ఒక అతిపెద్ద సవాల్ ఉంది. మహేష్ బాబు లాంటి స్టార్ హీరోను, అందులోనూ రాజమౌళి సినిమా తర్వాత డైరెక్ట్ చేయాలంటే ప్రెసెంట్ తీస్తున్న పెద్ది రిజల్ట్ చాలా కీలకం. చరణ్ తో చేస్తున్న ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ కనీసం 700 కోట్ల బాక్సాఫీస్ మార్క్ ను టచ్ చేయగలిగితేనే బుచ్చిబాబు పేరు ఆ రేస్ లోకి వెళుతుంది. అప్పుడే మహేష్ కు కథ వినిపించే అవకాశం దక్కుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
ఒకవేళ పెద్ది కనక అనుకున్న స్థాయిలో రికార్డులు క్రియేట్ చేసి, కమర్షియల్ గా టార్గెట్ ను రీచ్ అయితే పరిస్థితులు మారిపోతాయి. ముందే ఉన్న పరిచయం, ఉప్పెన టైమ్ లో ఏర్పడిన సానుకూల వాతావరణం వల్ల మహేష్ కూడా ఈ ప్రాజెక్ట్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. కానీ ఫలితం ఏమాత్రం తేడా కొట్టినా ఈ కాంబినేషన్ సెట్ అవ్వడం దాదాపు అసాధ్యం. బాక్సాఫీస్ లెక్కలు తగ్గితే స్టార్ హీరోల డేట్స్ దొరకడం కష్టమవుతుంది. మహేష్ తో సినిమా చేయాలన్న బుచ్చిబాబు ప్లానింగ్ కరెక్టే అయినా, అది కార్యరూపం దాల్చడం పూర్తిగా రామ్ చరణ్ సినిమా బాక్సాఫీస్ నంబర్స్ మీదే డిపెండ్ అయి ఉంది. మరి పెద్ది లెక్క ఎంతవరకు వెళుతుందో చూడాలి.