ఆ పదం పలకలేక ఎగతాళికి గురయ్యాను: బుచ్చిబాబు ఎమోషనల్
రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న రూరల్ స్పోర్ట్స్ డ్రామా పెద్ది ప్రమోషన్స్ ఇప్పుడు దేశవ్యాప్తంగా జోరుగా సాగుతున్నాయి. ఈ ప్రమోషన్స్ లో భాగంగా ఇటీవల చెన్నైలో ప్రెస్ మీట్ నిర్వహించారు.
రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న రూరల్ స్పోర్ట్స్ డ్రామా పెద్ది ప్రమోషన్స్ ఇప్పుడు దేశవ్యాప్తంగా జోరుగా సాగుతున్నాయి. ఈ ప్రమోషన్స్ లో భాగంగా ఇటీవల చెన్నైలో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ వేదికపై చిత్ర దర్శకుడు బుచ్చిబాబు సన ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ గురించి చాలా ఆసక్తికరమైన విషయాలు మీడియాతో పంచుకున్నాడు. తన అభిమాన సంగీత దర్శకుడితో కలిసి పనిచేయడం తనకెంత సంతోషంగా ఉందో ఈ వేదికపై చాలా ఎమోషనల్ గా వివరించాడు.
ఈ సందర్భంగా బుచ్చిబాబు మాట్లాడుతూ ఏఆర్ రెహమాన్ గారికి తాను ఎంత పెద్ద అభిమానినో చెప్పడానికి తన దగ్గర మాటలు చాలవని అన్నాడు. ఆయన గొప్పదనం గురించి ఆయన సంగీతం మీద తనకున్న ఇష్టం గురించి ఏకంగా ఒక పుస్తకమే రాయొచ్చని చెప్పాడు. తన జీవితంలో రెహమాన్ స్థానం ఏంటో అంతకంటే బాగా తాను వర్ణించలేనని ఆయన స్పష్టం చేశాడు. అంత ఇష్టం కాబట్టే ఆయనతో కలిసి పనిచేయడం ఒక కల నిజమైనట్లుగా భావిస్తున్నానని ఆనందంగా తెలిపాడు.
రెహమాన్ మ్యూజిక్ కు తాను ఒక వీరాభిమానిని అని బుచ్చిబాబు చాలా గర్వంగా చెప్పుకున్నాడు. రేహమాన్ గారు చేసిన ఆర్ ఆర్ అంటే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ విన్నప్పుడు కానీ పాటలు విన్నప్పుడు కానీ చాలా అద్భుతంగా ఉంటాయని ఆయన కొనియాడాడు. చిన్నప్పటి నుంచే ఏఆర్ రెహమాన్ పాటలు వింటూ పెరిగానని ఆయన మ్యూజిక్ కు తాను ఎప్పుడూ పెద్ద ఫ్యాన్ అని మళ్లీ మళ్లీ ఆడియన్స్ కు గుర్తు చేసుకున్నాడు.
ఇదే ప్రెస్ మీట్ లో తన చిన్ననాటి ముచ్చట్లను గుర్తుచేసుకుంటూ అప్పట్లో ఊర్లో ఉన్నప్పుడు తాను మ్యూజిక్ అనే పదాన్ని సరిగ్గా పలకలేక మూజిక్ అనేవాడినని బుచ్చిబాబు చెప్పాడు. ఆ పదం పలకడం రాక అలా అంటుంటే తన స్నేహితులందరూ తనను బాగా ఎగతాళి చేసేవారని ఆయన అన్నాడు. నీకు కనీసం మ్యూజిక్ అనడం కూడా రావడం లేదు నువ్వేం సినిమాలు తీస్తావ్ అంటూ అప్పట్లో తనను హేళన చేశారని ఆయన ఒకప్పటి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నాడు.
తనను చూసి నవ్విన ఆ రోజుల్లో నుంచి ఈరోజు వరకు సాగిన తన ప్రయాణాన్ని తలచుకుంటూ బుచ్చిబాబు ఉద్వేగానికి లోనయ్యాడు. ఇప్పుడు ఏకంగా ఏఆర్ రేహమాన్ గారితో కలిసి పనిచేస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉందని అన్నారు. రెహమాన్ లాంటి లెజెండ్ తో కలిసి పనిచేసే అవకాశం వస్తుందని తాను కలలో కూడా ఊహించలేదని బుచ్చిబాబు సంతోషం వ్యక్తం చేశాడు.
తన అభిమాన సంగీత దర్శకుడితో సినిమా చేయడం తన జీవితంలో మర్చిపోలేని అనుభూతి అని ఆయన అన్నాడు.
తన ఈ కల నెరవేరడానికి కారణమైన ప్రతి ఒక్కరికీ ముఖ్యంగా ఈ అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చిన దేవుడికి బుచ్చిబాబు ఈ సందర్భంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపాడు. పెద్ది సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతం హైలెట్ గా నిలుస్తుందని ఆయనతో కలిసి చేస్తున్న ఈ ప్రయాణం తనకు ఎంతో సంతృప్తిని ఇస్తుందని ఆయన చెప్పాడు. ఇక జూన్ 4న ఈ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నామని ఆ రోజు కోసం అందరం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నామని అన్నారు