అఖండ 2: బయ్యర్లకు బోయపాటి హామీ ఇచ్చారా?
ఈ నేపథ్యంలో బయ్యర్లు తమ నష్టాల వివరాలు దర్శకుడు బోయపాటి శ్రీనుకు వివరించినట్లు సమాచారం. ఏ ప్రాంతంలో ఎంత పెట్టుబడి పెట్టారు, ఎంత మొత్తం తిరిగి వచ్చింది;
టాలీవుడ్ మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను తెరకెక్కించిన అఖండ 2: తాండవం రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ లీడ్ రోల్ లో నటించిన ఆ సినిమా.. డిసెంబర్ 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బ్లాక్ బస్టర్ హిట్ మూవీ అఖండకు సీక్వెల్ గా రూపొందింది.
దీంతో భారీ అంచనాల మధ్య సినిమా రిలీజ్ అయినా.. వాటిని అందుకోలేదని చెప్పాలి. బాలయ్య అభిమానులను మూవీ మెప్పించినా.. కామన్ ఆడియన్స్ కు అంతగా ఆకట్టుకోలేదు. వసూళ్లు మొదట్లో కాస్త స్ట్రాంగ్ గా వచ్చినా.. ఆ తర్వాత డౌన్ అయిపోయాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లోని అనేక చోట్ల సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను అందుకోలేదు.
కొన్ని చోట్ల 50 శాతం కూడా రికవరీ కూడా అవ్వలేదని సమాచారం. దీంతో అనేక బయ్యర్లు ఇప్పుడు లాస్ జోన్ లో ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు వారంతా బోయపాటి శ్రీను తాజాగా కలిసినట్లు సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. అఫీషియల్ గా ఆ విషయం తెలియక పోయినా.. కలవడం మాత్రం నిజమేనని ఇప్పుడు ప్రచారం జరుగుతోంది.
ఈ నేపథ్యంలో బయ్యర్లు తమ నష్టాల వివరాలు దర్శకుడు బోయపాటి శ్రీనుకు వివరించినట్లు సమాచారం. ఏ ప్రాంతంలో ఎంత పెట్టుబడి పెట్టారు, ఎంత మొత్తం తిరిగి వచ్చింది, ఎంత నష్టం మిగిలిందన్న అంశాలను ఆయన దృష్టికి తీసుకెళ్లారని ప్రచారం జరుగుతోంది. దీనిపై బోయపాటి శ్రీను సానుకూలంగా స్పందించారట.
తాను చేయగలిగినంత సహాయం చేస్తానని హామీ ఇచ్చినట్లు సినీ వర్గాల సమాచారం. అంతేకాదు, సినిమా విడుదలకు మద్దతుగా నిలిచిన మ్యాంగో రామ్ తో మాట్లాడాలని బయ్యర్లను కోరినట్లు తెలుస్తోంది. మరికొద్ది రోజుల్లో జీఎస్టీ భాగాన్ని ఇప్పిస్తానని చెప్పారట. బిజినెస్ పరంగా ఆశించిన స్థాయిలో వసూళ్లు రాకపోవడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని చెప్పాలి.
అయితే కొంతమంది బయ్యర్లు కలిసి ఇప్పుడు మ్యాంగో రామ్ ను కలిసే అవకాశం ఉందని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. అయితే ఆ మీట్.. కచ్చితంగా జరుగుతుందా లేదా అన్న విషయంపై అధికారిక సమాచారం మాత్రం లేదు. మ్యంగో రామ్ ఆ అంశంపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది కూడా ఎవరూ చెప్పలేం.
నిజానికి.. అఖండ 2 రిలీజ్ కు ముందు ఆర్థిక ఇబ్బందులు తలెత్తాయి. ఆ సమయంలో మ్యాంగో రామ్ రంగంలోకి దిగి సహాయం చేశారు. దీంతో ఆయనకు సినిమా ఆర్థిక వ్యవహారాలపై పూర్తి అవగాహన ఉందన్న ప్రచారంలో ఉంది. ఏ ఏ ప్రాంతాల్లో హక్కులు ఎంతకు అమ్మారో, ఎంత మొత్తాన్ని రికవర్ చేసుకున్నారో, ఎంత నష్టం వాటిల్లిందన్న వివరాలన్నీ ఆయనకు తెలిసి ఉండవచ్చు. అందుకే బయ్యర్లను బోయపాటి ఆయనను సంప్రదించమని సూచించారని సమాచారం.