సూపర్ స్మార్ట్ హీరోలా మారిన బోనీకపూర్

ఇటీవల కుమార్తె అన్షులా కపూర్ వివాహ వేడుకల్లో బోనీకపూర్ సరికొత్త లుక్‌తో అందరి దృష్టిని ఆకర్షించారు. పెళ్లికి వచ్చిన బంధుమిత్రులు, కెమెరా కళ్లన్నీ వధూవరులతో పాటు బోనీకపూర్ పైనే నిలిచాయి.

Update: 2026-07-14 17:31 GMT

బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ బోనీకపూర్ లుక్ పరంగా సంచలనం సృష్టిస్తున్నారు. వయసుతో నిమిత్తం లేకుండా... ఇటీవల ఆయన తన రూపాన్ని మార్చుకున్న తీరు నెటిజన్లను విస్మయానికి గురిచేస్తోంది. గతంలో బట్టతలతో కనిపించిన బోనీ ఉన్న‌ట్టుండి ఇలా ఎలా మారారు? అంటూ నెటిజ‌నుల్లో గుస‌గుస మొద‌లైంది. ఇప్పుడు బాల్డ్ భాగంలో పూర్తి హెయిర్ స్టైల్‌తో ట్రెండీ లుక్‌లోకి మారిపోయారు. స్టైలింగ్ - హెయిర్ ట్రాన్స్‌ఫార్మేషన్ పరంగా చూస్తే, ఆయన `చియాన్`లాగా ఎంతో యంగ్‌గా, ఒక ఇస్మార్ట్ హీరోలా కనిపిస్తున్నారంటూ సోషల్ మీడియాలో ప్ర‌శంస‌లు కురుస్తున్నాయి.

 

ఇటీవల కుమార్తె అన్షులా కపూర్ వివాహ వేడుకల్లో బోనీకపూర్ సరికొత్త లుక్‌తో అందరి దృష్టిని ఆకర్షించారు. పెళ్లికి వచ్చిన బంధుమిత్రులు, కెమెరా కళ్లన్నీ వధూవరులతో పాటు బోనీకపూర్ పైనే నిలిచాయి. తన హెయిర్ విషయంలో ఆయన సాధించిన ఈ అద్భుతమైన రికవరీ- ట్రాన్స్‌ఫార్మేషన్ లుక్ ఇన్‌స్టాగ్రామ్‌తో పాటు ఇతర సామాజిక మాధ్యమాలలో విపరీతంగా వైరల్ అవుతోంది. 70 ఏళ్లకు చేరువవుతున్నా.. ఒక యంగ్ హీరోకి తీసిపోని విధంగా ఇంతటి స్మార్ట్ అండ్ స్టైలిష్ మేకోవర్‌తో కనిపించడం నిజంగా ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది.

 

బాలీవుడ్ సీనియర్ ప్రొడ్యూసర్ బోనీకపూర్ బట్టతల సమస్యను కేవలం తన వ్యక్తిగత మేకోవర్ కోసమే కాకుండా...ఒక అద్భుతమైన బిజినెస్ అవకాశంగా మలుచుకోవ‌డం చ‌ర్చ‌గా మారింది. వయసు పైబడటం వల్ల వచ్చిన బట్టతలను చూసి బాధపడిపోకుండా.. ఆయన ఒక ప్రముఖ అంతర్జాతీయ హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ సెలూన్‌తో బిజినెస్ టైఅప్ పెట్టుకున్నారు. తన హెయిర్ ట్రాన్స్‌ఫార్మేషన్‌ను స్వయంగా చూపిస్తూ ఆ బ్రాండ్‌కు పెద్ద ఎత్తున ప్రచారం చేసినందుకు గాను సెలబ్రిటీ హోదాలో ఆయన భారీ పారితోషికాన్ని అందుకున్నట్లు సమాచారం. తన వైపు వచ్చిన ఎలాంటి అవకాశాన్ని వదిలిపెట్టకుండా... స్మార్ట్ బిజినెస్ ఐడియాతో దానిని సద్వినియోగం చేసుకోవడంలో బోనీకపూర్ రూటే వేరని దీని ద్వారా ప్రూవైంది.

మరోవైపు.. బోనీకపూర్ తన ముగ్గురు పిల్లల సినీ కెరీర్లను చక్కదిద్దే పనిలో అత్యంత బిజీగా గడుపుతున్నారు. ఒకవైపు పెద్ద కుమార్తె జాన్వీ కపూర్ సౌత్ సినీ కెరీర్‌ను స్టార్ హీరోల సరసన భారీ ప్రాజెక్టులతో సెట్ చేస్తూనే, మరోవైపు చిన్న కుమార్తె ఖుషీ కపూర్‌ను కూడా నటిగా పరిశ్రమలో బలంగా ఎస్టాబ్లిష్ చేయడానికి ప్రణాళికలు రచిస్తున్నారు. వీరితో పాటు సరైన సక్సెస్ లేక ఇబ్బంది పడుతున్న తన కుమారుడు అర్జున్ కపూర్ కెరీర్‌ను మళ్లీ ట్రాక్‌లోకి తీసుకురావడం ఎలా అనే విషయంపై బోనీ తీవ్రంగా ఆలోచిస్తూ.. స‌రైన‌ ప్రాజెక్ట్‌లను సెట్ చేసే పనిలో ఉన్నారు. ఒకవైపు బిజినెస్ మైండ్‌తో తన లుక్‌ను మార్చుకుంటూనే.. మరోవైపు తండ్రిగా పిల్లల భవిష్యత్తు కోసం ఆయన పడుతున్న తపన ప్రశంసనీయం. ఒక‌ కుమార్తె అన్షులాకు పెళ్ల‌యింది.. త‌ర్వాత జాన్వీకపూర్, ఖుషి క‌పూర్ కూడా క్యూలోనే ఉన్నారు.

Tags:    

Similar News