గృహ హింస కేసు - హన్సిక పిటిషన్ ను కొట్టేసిన ముంబై హైకోర్టు
నటి హన్సికకు ముంబై హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. గృహహింస కేసుకు సంబంధించి ఆమె దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ ను కోర్టు కొట్టివేసింది.;
నటి హన్సికకు ముంబై హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. గృహహింస కేసుకు సంబంధించి ఆమె దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ ను కోర్టు కొట్టివేసింది. తనకు దూరమైన వ్యక్తి దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ ను కొట్టివేయాలని కోరుతూ హన్సిక మోత్వానీ పిటిషన్ ను దాఖలు చేయగా బాంబే హైకోర్టు కొట్టివేసిన తర్వాత ఆమె కొత్త చట్టపరమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.
హన్సిక సోదరుడు ప్రశాంత్ మోత్వానీ, బుల్లితెర నటి ముస్కాన్ నాన్సీ జేమ్స్ ను 2021లో పెళ్లి చేసుకున్నారు. పెళ్లైనప్పటి నుంచే వారి జీవితం ఒడిదుడుకులు ఎదుర్కొంది. ఒక సంవత్సరం తర్వాత ఇద్దరూ విడివిడిగా జీవించడం మొదలుపెట్టారు. కాగా గతేడాది డిసెంబర్ లో నాన్సీ.. హన్సిక మరియు ఆమె తల్లిపై గృహ హింస చట్టం కింద వివిధ సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు.
గృహ హింస కారణంగానే బెల్స్ పాల్సీ బారినపడ్డా
నాన్సీ పెట్టిన ఎఫ్ఐఆర్ లో 498A (కట్నం సంబంధిత క్రూరత్వం), 323 (స్వచ్ఛందంగా బాధ కలిగించడం), 352 (క్రిమినల్ బెదిరింపు మరియు శాంతికి భంగం కలిగించే ఉద్దేశ్యంతో ఉద్దేశపూర్వకంగా అవమానించడం) సెక్షన్లు ఉన్నాయి. గృహ హింస కారణంగానే తాను బెల్స్ పాల్సీ బారిన పడ్డానని తన ఫిర్యాదులో పేర్కొన్న నాన్సీ, తన అత్తమామల నుంచి భారీగా డబ్బును డిమాండ్ చేశారు.
ప్రశాంత్ తో పెళ్లయ్యాక హన్సిక మరియు అతని తల్లి జ్యోతి అనవసరంగా జోక్యం చేసుకోవడం వల్లే తమ మధ్య వైవాహిక విభేదాలకు దారి తీసిందని నాన్సీ ఫిర్యాదు చేశారు. మోత్వానీలు తన ఫ్లాట్ ను అమ్మమని ప్రెజర్ కు గురి చేశారని కూడా నాన్సీ చెప్పారు. ఫిబ్రవరిలో హన్సిక, జ్యోతికి ముంబై సెషన్స్ కోర్టు ముందస్తు బెయిల్ ను మంజూరు చేయగా, ఏప్రిల్ లో వారు ఎఫ్ఐఆర్ ను రద్దు చేయాలని హై కోర్టును ఆశ్రయించారు. ఎఫ్ఐఆర్ లో తన పేరు చూసి షాకయ్యానని హన్సిక తన పిటిషన్ లో పేర్కొనగా, మంగళవారం కోర్టు వారి పిటిషన్ ను తోసిపుచ్చి హన్సికపై విచారణ కొనసాగడానికి ఉత్తర్వులు జారీ చేశారు.