కోట్లల్లో ఒక్కరు ప్రభాస్..
అంత పెద్ద స్టార్ అయ్యుండి కూడా సాదాసీదా మనిషిలాగే బ్రతుకుతూ ఎంతోమందికి ఆదర్శంగా నిలిచారు అంటూ ప్రభాస్ పై ప్రశంసలు కురిపించారు.;
రెబల్ స్టార్ ప్రభాస్.. పాన్ ఇండియా స్టార్ గా కొనసాగుతున్న ప్రభాస్ గురించి ఎవరు ఎప్పుడు ఏం మాట్లాడినా సరే చాలా పాజిటివ్ గా మాట్లాడుతూ ఆయనను అందలం ఎక్కిస్తున్నారు. టాలీవుడ్ మొదలుకొని బాలీవుడ్ వరకు చాలామంది సెలబ్రిటీలు ప్రభాస్ తో గడిపిన అనుభవాలను పంచుకుంటూ ఆయన వ్యక్తిత్వాన్ని ఎప్పటికప్పుడు అభిమానులతో కూడా పంచుకుంటున్నారు..ఈ క్రమంలోనే ప్రభాస్ కోట్లల్లో ఒక్కరు అని, ఆయన లాంటి వ్యక్తిని ఇప్పటివరకు చూడలేదని సూపర్ స్టార్ అనే అహం ఆయనలో కొంచెం కూడా కనిపించదు అని, ఆయనపై ప్రశంసలు కురిపిస్తున్నారు ప్రముఖ బాలీవుడ్ నటుడు బోమన్ ఇరానీ.
ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్న ఈయన తాజాగా ఈ సినిమా నుండి 'నాచేనాచే' అనే పాటను విడుదల చేశారు. ఈ పాట విడుదల సందర్భంగా ప్రెస్ మీట్ లో పాల్గొన్న బోమన్ ఇరానీ ప్రభాస్ వినయం, ఆయన అమాయకత్వాన్ని ప్రశంసిస్తూ కామెంట్లు చేశారు. సూపర్ స్టార్లు తరచుగా తమ స్టేటస్ ను చూపిస్తూ ఉంటారు. కానీ ప్రభాస్ మాత్రం తన నిజ జీవితంలో దీనికి పూర్తి విరుద్ధంగా ఉంటారు. ముఖ్యంగా ప్రభాస్ సూపర్ స్టార్ అయినప్పటికీ ఎప్పుడూ కూడా అలా ప్రవర్తించాడు. ఇక తన టీం తోనే కాదు ఇతర నటులతో, ఆఖరికి చిన్న చిన్న నటీనటులతో , సాంకేతిక నిపుణులతో, ప్రతి ఒక్కరితో కూడా చిన్న పిల్లవాడిలా మాట్లాడుతూ.. బిగ్గరగా నవ్వుతూ.. తానొక సూపర్ స్టార్ అనే విషయాన్ని కూడా పట్టించుకోడు.
అంత పెద్ద స్టార్ అయ్యుండి కూడా సాదాసీదా మనిషిలాగే బ్రతుకుతూ ఎంతోమందికి ఆదర్శంగా నిలిచారు అంటూ ప్రభాస్ పై ప్రశంసలు కురిపించారు. అలాగే ప్రభాస్ గురించి మాట్లాడుతూ.. ఆయనకు 40 సంవత్సరాలు దాటినా ఆయన ఇంకా చిన్నవాడే. ఆయన చాలా అమాయకుడు. ముఖ్యంగా అతడు సూపర్ స్టార్ అయినా ఎవరూ తనను అలా చూడాలని కోరుకోడు. ముఖ్యంగా ఎవరైనా ఒక జోక్ చెప్పారంటే చాలు మొదట బిగ్గరగా నవ్వేది ప్రభాస్ మాత్రమే. ఆయన ఇంకా టీనేజర్" అంటూ చెప్పుకొచ్చారు.
ఇకపోతే ఈ సినిమాలో తనకు అవకాశం లభించడం పై మాట్లాడుతూ.." ఈ సినిమాలో నాకు అవకాశం లభించింది. అయితే ఇందులో ప్రభాస్ హీరోగా నటిస్తున్నారు అని చెప్పగానే కథ కూడా నేను వినకుండానే ఆయన కోసం ఒకే చెప్పాను" అంటూ తెలిపారు. మొత్తానికైతే ప్రభాస్ వ్యక్తిత్వం గురించి కామెంట్లు చేయడమే కాకుండా ప్రభాస్ పై ప్రశంసలు కురిపించారు బోమన్ ఇరానీ.
ది రాజాసాబ్ సినిమా విషయానికి వస్తే.. మారుతీ దర్శకత్వం లో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, ఐవీవై ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై ఈ చిత్రాన్ని టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు.మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్దీ కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. సంజయ్ దత్ , బోమన్ ఇరానీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. తెలుగుతోపాటు తమిళ్, కన్నడ , హిందీ, మలయాళం భాషల్లో జనవరి 9న సంక్రాంతి సందర్భంగా ఈ సినిమా విడుదల కాబోతోంది.