స‌రిగా నిదుర పోని తిండి తిన‌ని క్ర‌మ‌శిక్ష‌ణ లేని హీరో

ఆ ఇద్ద‌రు హీరోల‌ను పోలుస్తూ విశ్లేషించాడు ప్ర‌ముఖ ఎంట‌ర్ టైన్ మెంట్ జ‌ర్న‌లిస్ట్ ఫ‌రీదూన్. అత‌డితో స‌ల్మాన్ అభిమానులు ఏకీభ‌వించ‌డం కొస‌మెరుపు.;

Update: 2025-09-04 03:00 GMT

అవును .. మీరు వింటున్న‌ది నిజ‌మే.. ఈ స్టార్ హీరో స‌రిగా తిండి తిన‌డు..స‌రిప‌డినంత‌ నిదుర పోడు. రోజుకు రెండు గంట‌లే నిదురపోతాడు. సెట్లో రెగ్యుల‌ర్ గా గాయ‌ప‌డతాడు.. స్నేహితుల కోసం స‌మ‌యం ఎక్కువ కేటాయిస్తాడు. కార‌ణం ఏదైనా అత‌డు క్ర‌మ‌శిక్ష‌ణ‌తో కూడుకున్న దిన‌చ‌ర్య‌ను పాటించ‌డం లేదు. దానివ‌ల్ల‌ అత‌డు షేప‌వుట్ అవుతున్నాడు. సినిమాల‌తో ఆశించిన విజ‌యాలు కూడా అత‌డికి ద‌క్క‌డం లేదు. దీనికి తోడు త‌న‌ను వెంటాడుతున్న‌ గ్యాంగ్ స్ట‌ర్ టెన్ష‌న్స్ కూడా అద‌న‌పు ఒత్తిడిని పెంచుతున్నాయి.

దీనికి భిన్నంగా షారూఖ్ ఖాన్ లాంటి 60 ప్ల‌స్ హీరో ఇప్ప‌టికీ పూర్తి ఫిట్ నెస్ తో ఎంతో ఎన‌ర్జిటిక్ గా ప‌ని చేస్తున్నాడు. స‌రైన స‌మ‌యానికి తిండి నిదుర‌, వ్యాయామం వంటి వాటిని షారూఖ్ విడిచిపెట్ట‌డు. తెర‌పై అత‌డు చాలా ఎన‌ర్జిటిక్ గా క‌నిపించ‌డానికి అత‌డి క్ర‌మ‌శిక్ష‌ణ కార‌ణం.

ఆ ఇద్ద‌రు హీరోల‌ను పోలుస్తూ విశ్లేషించాడు ప్ర‌ముఖ ఎంట‌ర్ టైన్ మెంట్ జ‌ర్న‌లిస్ట్ ఫ‌రీదూన్. అత‌డితో స‌ల్మాన్ అభిమానులు ఏకీభ‌వించ‌డం కొస‌మెరుపు. స‌ల్మాన్ ఇప్ప‌టికీ నూత‌నోత్సాహంతో ఉన్నాడు. విజ‌యాల కోసం ఆరాట ప‌డుతున్నాడు. కానీ అత‌డు త‌న ప‌ద్ధ‌తుల్ని మార్చుకోవాల‌ని సూచిస్తున్నారు అభిమానులు. అత‌డి గ్రేట్ కంబ్యాక్ కోసం చాలా ఎగ్జ‌యిటింగ్ గా వేచి చూస్తున్నారు.

స‌ల్మాన్ ఇంకా చాలా త‌ప్పులు చేస్తున్నాడు. త‌న చుట్టూ ఉన్న మంది మార్బ‌లం సూచించిన చెత్త‌ స్క్రిప్టుల్ని ఎంపిక చేసుకోవ‌డం వ‌ల్ల కూడా త‌ప్పు దారి ప‌ట్టాడ‌ని కొంద‌రు వ్యాఖ్యానిస్తున్నారు. అయితే వీట‌న్నిటి నుంచి అత‌డు బ‌య‌ట‌ప‌డాలి. నెమ్మ‌దిగా కంబ్యాక్ అవ్వాలి. ప్ర‌స్తుతం స‌ల్మాన్ న‌టిస్తున్న గ‌ల్వాన్ లోయ యుద్ధం కాన్సెప్ట్ చాలా ఆస‌క్తిక‌ర‌మైన‌ది. దీంతో అత‌డు బ్లాక్ బ‌స్ట‌ర్ కొట్టాల‌ని అభిమానులు కోరుకుంటున్నారు. పాత త‌రం ఆలోచ‌న‌లు, వీక్ స్క్రిప్టుల‌ను స‌ల్మాన్ వ‌దిలేయాల‌ని సూచిస్తున్నారు.

Tags:    

Similar News