ఆ ముగ్గురు స్టార్ల మధ్య గొడవలు సినిమాను మించేలా!
ఐశ్వర్యారాయ్ - సల్మాన్ ఖాన్ మధ్య ప్రేమ, బ్రేకప్ ఎల్లపుడూ చర్చనీయాంశమే. సల్మాన్- ఐశ్వర్యారాయ్ ప్రేమకథ, బ్రేకప్ స్టోరిలో షారూఖ్ పేరు కూడా వినిపించింది.;
బాలీవుడ్ లో ముగ్గురు స్టార్ల మధ్య గొడవలు ఆ ముగ్గురినే కాదు, మొత్తం ఇండస్ట్రీనే ప్రభావితం చేసాయి. ఏళ్ల తరబడి కథలు కథలుగా చెప్పుకున్నారు. అసలు ఆ ముగ్గురు స్టార్లు ఎవరు? ఏమా వింత కథలు? అంటే వివరాల్లోకి వెళ్లాలి.
ఐశ్వర్యారాయ్ - సల్మాన్ ఖాన్ మధ్య ప్రేమ, బ్రేకప్ ఎల్లపుడూ చర్చనీయాంశమే. సల్మాన్- ఐశ్వర్యారాయ్ ప్రేమకథ, బ్రేకప్ స్టోరిలో షారూఖ్ పేరు కూడా వినిపించింది. ఒకానొక సమయలో షారూఖ్ - ఐశ్వర్యారాయ్ జంటగా నటిస్తున్న `చల్తే చల్తే` సెట్స్ లో సల్మాన్ ఖాన్ నానా రభస సృష్టించాడు. అప్పటికి ఐష్ తో ప్రేమలో ఉన్న సల్మాన్ పిచ్చిగా ప్రవర్తించడం చర్చనీయాంశమైంది. తనను చాలా అనుమానించి, అవమానించి వేధించాడని ఐశ్వర్యారాయ్ బహిరంగంగా ఆరోపించారు. తిట్టాడు కొట్టాడు అంటూ సల్మాన్ గురించి ఐష్ మీడియా ఎదుట మాట్లాడారు. ఓ ఇంటర్వ్యూలో సల్మాన్ తనను అనుమానిస్తాడని, తన సహనటులతో సంబంధాలు అంటగడతాడని బహిరంగంగా వ్యాఖ్యానించి షాకిచ్చారు ఐశ్వర్యారాయ్. అభిషేక్ బచ్చన్, షారూఖ్ తోను సంబంధం అంటగట్టి తనను వేధించాడని కూడా ఐష్ ఓ ఇంటర్వ్యూలో అన్నారు. అంతేకాదు... షారూఖ్ సరసన వీర్ జారా, చల్తే చల్తే వంటి చిత్రాలతో పాటు మరో ఐదు సినిమాల్లో అవకాశాలు కోల్పోవడానికి కారణం సల్మాన్ తో జరిగిన గొడవలేనని ఐశ్వర్యారాయ్ అంగీకరించారు.
చల్తే చల్తే సెట్స్ లో సల్మాన్ నానా యాగీ చేసిన తర్వాత తనను తొలగించి రాణీ ముఖర్జీతో ఆ పాత్రను రీప్లేస్ చేసారు షారూఖ్. అతడి నిర్మాణ సంస్థలో ఐశ్వర్యారాయ్ పర్మినెంట్ గా అవకాశాల్ని కోల్పోయింది. ఈ విషయాన్ని ఐష్ స్వయంగా ఇంటర్వ్యూలో అంగీకరించారు. గొడవ తర్వాత సల్మాన్ ఖాన్, ఐశ్వర్యారాయ్ నేరుగా షారూఖ్ కి క్షమాపణలు చెప్పారు. కానీ షారూఖ్ చాలా ఆలోచించి ఐష్ తో తన సంబంధాన్ని కట్ చేసాడు. మొత్తానికి ఆ గొడవల కారణంగానే సల్మాన్ - షారూఖ్ ఖాన్ మధ్య కూడా విభేధాలు తలెత్తాయి. శత్రుత్వం పెరిగింది. కారణం ఏదైనా ఐష్ తో సల్మాన్ ఎపిసోడ్స్ ఇండస్ట్రీలో అగ్లీ వివాదాలుగా ముగిసాయి.
ఆ తర్వాత ఐశ్వర్యారాయ్ నటుడిగా అంతగా రాణించని అభిషేక్ బచ్చన్ ని పెళ్లాడి లైఫ్ లో సెటిలవ్వగా, సల్మాన్ ఖాన్ తన విదేశీ స్నేహితురాలు లులియా వాంటూర్ తో డేటింగ్ చేసాడని కథనాలొచ్చాయి. సల్మాన్ తో ముడిపెడుతూ చాలామంది బాలీవుడ్ హీరోయిన్ల పేర్లు వినిపించాయి. ఐశ్వర్యారాయ్ నుంచి విడిపోయాక సల్మాన్ ఖాన్ సుదీర్ఘ కాలం కత్రిన కైఫ్ తోను రిలేషన్ లో ఉన్నాడు. ఐశ్వర్యారాయ్ లా ఉండే స్నేహా ఉల్లాల్ ని కూడా వెండితెరకు పరిచయం చేసాడు. సల్మాన్ 60 ఏళ్ల వయసులో పెళ్లి ఊసెత్తడం లేదు. అతడు ఒంటరి బ్యాచిలర్ గా మిగిలిపోయాడు. కలిసిరాని పెళ్లి గురించి ఆలోచించడం మానేసాడు. ఇక షారూఖ్ తో విభేధాలను ముగించి సల్మాన్ ఇప్పుడు కింగ్ ఖాన్ తో కలిసి భారీ మల్టీస్టారర్లలో నటిస్తున్నాడు.