బాలీవుడ్+కోలీవుడ్ కలుస్తోందా?
పాన్ ఇండియా మార్కెట్ కోసం బాలీవుడ్, కోలీవుడ్ పరిశ్రమలు ఎంతగా పరి తపిస్తున్నాయో చెప్పాల్సిన పనిలేదు.;
పాన్ ఇండియా మార్కెట్ కోసం బాలీవుడ్, కోలీవుడ్ పరిశ్రమలు ఎంతగా పరి తపిస్తున్నాయో చెప్పాల్సిన పనిలేదు. రెండు పరిశ్రమలకు చెందిన నటులు టాలీవుడ్ కి వచ్చి పాన్ ఇండియాలో ఫేమస్ అవ్వాలని చూస్తున్నారు. కోలీవుడ్ నుంచి డైరెక్టర్ల వెల్లువ...బాలీవుడ్ నుంచి హీరోల వెల్లువ కనిపిస్తుంది. సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్, హృతిక్ రోషన్ , అక్షయ్ కుమార్, అమితాబచ్చన్ లాంటి నటులు తెలుగు నటులతో కలిసి పనిచేయాలని ఎంతో ఉత్సాహాన్ని చూపిస్తున్నారు.
కోలీవుడ్ నుంచి డైరెక్టర్లే టాలీవుడ్ కి వచ్చి పని చేయా లన్న ఆసక్తి చూపిస్తున్నారు. ఆ రకంగా లాంచ్ అవ్వాలనుకున్న వాళ్లు ఇప్పటికే లాంచ్ అయ్యారు. అలాంటి ప్రయత్నం చేయని వారంతా సరికొత్త స్ట్రాటజీని అమలు చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. బాలీవుడ్-కోలీవుడ్ కలిసి పనిచేసేలా ఒప్పందం చేసుకుంటున్నట్లు కొన్ని కాంబినేషన్లను చూస్తుంటే అర్దమవుతుంది. బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ కోలీవుడ్ కి చెందిన సంచలన డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ తో ఓ సినిమాకి ఒప్పందం చేసుకున్న సంగతి తెలిసిందే.
అమీర్ తాజా సినిమా `సితారే మే జమీన్` రిలీజ్ అనంతరం ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కే దిశగా అడుగులు వేస్తున్నారు. వాస్తవానికి లోకేష్ కంటే ముందే అమీర్ కి మరికొంత మంది బాలీవుడ్ డైరెక్టర్లతో కమిట్ మెంట్ ఉంది. కానీ వాటన్నింటిని పక్కనబెట్టి మరీ లోకేష ని అమీర్ ఖాన్ తెరపైకి తెచ్చారు. అంతకు ముందు సల్మాన్ ఖాన్ మురగదాస్ తో భారీ సినిమా చేసాడు అదే `సికిందర్`. కానీ ఆ ప్రయత్నం బెడిసి కొట్టింది.
అలాగే అట్లీ జవాన్ తో షారుక్ ఖాన్ కి సంచలన విజయాన్ని అందించిన సంగతి తెలిసిందే. ఇద్దరు కూడా మరోసారి కలిసి పనిచేయడానికి సిద్దంగా ఉన్నారు. అలాగే విశ్వ నటుడు కమల్ హాసన్ కూడా తదుపరి బాలీవుడ్ డైరెక్టర్లతో సినిమాలు చేసే దిశగా అడుగులు వేస్తున్నట్లు వినిపిస్తుంది. మిస్కిన్, హెచ్ . వినోధ్ , నెల్సన్ దిలీప్ కుమార్ లాంటి సక్సెస్ ఫుల్ మేకర్స్ బాలీవుడ్ హీరోలకు టచ్ లో ఉన్నట్లు వార్తలొ స్తున్నా యి. కోలీవుడ్ హీరోలతో కలిసి నటించడానికి బాలీవుడ్ హీరోలు కూడా సిద్దంగా ఉన్నారనే ప్రచారం ఊపం దుకుంటుంది. ఇదంతా చూస్తుంటే రెండు పరిశ్రమలు కలిసి టాలీవుడ్ ని టార్గెట్ చేసాయా? అన్న సందేహం వ్యక్తమవుతోంది.