బాలీవుడ్ లో ఖాన్ త్రయం వీకవుతోందా?
బాలీవుడ్ లో ఖాన్ త్రయం బలహీన పడుతోందా? ఖాన్ ల హీరోలకు ఓపెనింగ్స్ కూడా కష్టమవు తున్నాయా? అంటే సన్నివేశం అలాగే కనిపిస్తోంది.;
బాలీవుడ్ లో ఖాన్ త్రయం బలహీన పడుతోందా? ఖాన్ ల హీరోలకు ఓపెనింగ్స్ కూడా కష్టమవు తున్నాయా? అంటే సన్నివేశం అలాగే కనిపిస్తోంది. ఇటీవలే మిస్టర్ పర్పెక్ట్ నిస్ట్ అమీర్ ఖాన్ నటించిన `సితార జమీన్ పర్` రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఇదొక డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీ కావడంతో ఈ సినిమా ఎలాంటి అంచనాలు లేకుండానే రిలీజ్ అయింది. ఈ సినిమా విషయంలో అమీర్ ఖాన్ డబ్బు కోసం కాకుండా ప్రజలకు ఈ సినిమా చేరాలి అన్న కాన్సెప్ట్ తో ఓటీటీకి రైట్స్ ఇవ్వకుండా థియేటర్ అనంతరం నేరుగా యూట్యూబ్ లోనే రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేసుకుని రిలీజ్ చేసారు.
అయితే ఈ సినిమాకు ఆశించిన స్థాయిలో ఓపెనింగ్స్ దక్కలేదు. సినిమాకు మాత్రం మంచి రివ్యూలు ..పాజిటివ్ టాక్ వచ్చింది. అంతకు మందు టెక్ దిగ్గజం సతీమణి సుధాకృష్ణమూర్తి కూడా తన రివ్యూ ఇవ్వడంతో అంచనాలు కనిపించాయి. కానీ ఓపెనింగ్స్ రూపంలో అదెక్కడా ప్రభావం చూపలేదు. ఓపెనింగ్ డే పది కోట్లు కూడా రావడం కష్టంగా మారింది. అమీర్ సినిమా అంటే ఒక్క రోజులోనే 100 కోట్లకు పైగా వసూళ్లు తేగల స్టార్ డమ్ ఉన్న నటుడు.
అయితే ఇదొక సందేశాత్మక చిత్రం. మానిసిక దివ్యాంగుల నేపథ్యంలో తెరకెక్కించారు. ఇలాంటి సినిమా లకు ఆదరణ అంతంత మాత్రమే. అమీర్ కూడా డబ్బు కోసం చేసిన చిత్రం కాదు. తనద్వారా సమాజానికి ఓ సందేశం వెళ్లాలని చేసారు. అంతకు ముందు రిలీజ్ అయిన `లాల్ సింగ్ చడ్డా` కూడా పూర్ ఓపెనింగ్స్ నే సాధించింది. సల్మాన ఖాన్ గత చిత్రం `సికిందర్` కూడా ఆశించిన స్థాయిలో ఓపెనింగ్స్ సాధించ లేదు.
మురగదాస్ దర్శకత్వం వహించిన ఈ సినిమా భారీ అంచనాల మధ్య రిలీజ్ అనుకున్నా? ప్రచార చిత్రా లతోనే హైప్ పడిపోయింది. దీంతో ఆ ప్రభావం ఓపెనింగ్స్ పై పడింది. షారుక్ ఖాన్ `డంకీ `చిత్రంతో ఇలాంటి సమస్యను ఎదుర్కున్నవాడే. `పఠాన్`, `జవాన్` సక్సెస్ లతో ఉన్న సమయంలో రిలీజ్ అయిన డంకీ ఆ రేంజ్ వసూళ్లను మాత్రం తేలేకపోయింది. దీంతో ఇప్పుడీ హీరోలు పుంజుకోవాల్సిన అవసరం ఏర్పడింది.