సూపర్‌ హిట్ రీమేక్‌.. విడుదల ముందు బజ్ ఏది?

మొత్తానికి హర్రర్‌ థ్రిల్లర్‌ సినిమాలు బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాలను నమోదు చేస్తున్న నేపథ్యంలో బాలీవుడ్‌ నుంచి 'కప్కాపి' అనే హర్రర్‌ సినిమా విడుదలకు సిద్ధం అవుతోంది. మే 23న విడుదల కాబోతున్న ఈ సినిమా ఫలితంపై ఉత్కంఠ నెలకొంది.;

Update: 2025-05-16 07:30 GMT

అన్ని భాషల్లోనూ ఈ మధ్య హర్రర్‌, థ్రిల్లర్‌ సినిమాలకు మంచి డిమాండ్ ఉంది. మంచి కాన్సెప్ట్‌తో థ్రిల్లర్ సినిమాలు వస్తే వందల కోట్ల వసూళ్లు నమోదు అవుతున్నాయి. అందుకే హర్రర్‌ సినిమాలను ఎక్కువగా రూపొందించేందుకు గాను మేకర్స్ ఆసక్తి చూపిస్తున్నారు. గతంలో వచ్చిన హర్రర్‌ సినిమాలకు సీక్వెల్‌ను రూపొందించడం లేదా వేరే భాషల్లో రీమేక్ చేయడం వంటివి కూడా చేస్తున్నారు. మొత్తానికి హర్రర్‌ థ్రిల్లర్‌ సినిమాలు బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాలను నమోదు చేస్తున్న నేపథ్యంలో బాలీవుడ్‌ నుంచి 'కప్కాపి' అనే హర్రర్‌ సినిమా విడుదలకు సిద్ధం అవుతోంది. మే 23న విడుదల కాబోతున్న ఈ సినిమా ఫలితంపై ఉత్కంఠ నెలకొంది.

రెండేళ్ల క్రితం వచ్చిన మలయాళం మూవీ రోమాంచం ను హిందీలో కప్కాపి టైటిల్‌తో రీమేక్ చేసిన విషయం తెల్సిందే. రీమేక్‌ చివరి దశలో ఉన్న సమయంలో దర్శకుడు సంగీత్‌ శివన్‌ మృతి చెందారు. దాంతో సినిమా విడుదల ఆలస్యం అయింది. తుషార్‌ కపూర్‌, శ్రేయాస్‌ తల్పాడే ముఖ్య పాత్రల్లో నటించిన ఈ థ్రిల్లర్‌ సినిమా ట్రైలర్‌ అందరి దృష్టిని ఆకర్షించింది. ఒరిజినల్‌ వర్షన్‌కి ఏమాత్రం తగ్గకుండా ఈ సినిమా ఉంటుంది అనే నమ్మకం బాలీవుడ్‌ వర్గాల్లో కలిగించడంలో ట్రైలర్ సక్సెస్ అయింది అంటూ మీడియాలో కథనాలు వచ్చాయి. హిందీ ట్రైలర్‌కి మంచి స్పందన వచ్చినప్పటికీ ప్రమోషన్స్‌ విషయంలో మేకర్స్ అలసత్వం చూపిస్తున్న కారణంగా ఆశించిన స్థాయిలో బజ్‌ క్రియేట్‌ కావడం లేదు.

ఈమధ్య కాలంలో బాలీవుడ్‌ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్న విషయం తెల్సిందే. ఇలాంటి సమయంలో రాబోతున్న ఈ సినిమాను జనాల్లోకి తీసుకు వెళ్లేందుకు ఎక్కువగా ప్రచారం చేయాల్సిన అవసరం ఉంటుంది. కానీ మేకర్స్‌ మాత్రం పెద్దగా హడావుడి చేయడం లేదు అనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. హర్రర్‌ థ్రిల్లర్‌ జోనర్‌లో వచ్చిన స్త్రీ 2 తో పాటు పలు సినిమాలు భారీ విజయాన్ని సొంతం చేసుకోగా, అదే జోనర్‌లో వచ్చిన కొన్ని సినిమాలు డిజాస్టర్‌గా నిలిచాయి. కనుక ప్రేక్షకులు ఈ సినిమాపై నమ్మకం కనబర్చేందుకు పబ్లిసిటీ సాధ్యం అయినంత వరకు ఎక్కువగా చేస్తే బాగుంటుంది అనే అభిప్రాయంను సినీ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు.

బాలీవుడ్‌లో పాజిటివ్‌ రెస్పాన్స్ దక్కించుకున్న సినిమాలు కూడా అంతంత మాత్రంగానే వసూళ్లు రాబడుతున్న ఈ సమయంలో కప్కాపి సినిమా ఫలితంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మరో వారం రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాకు పెద్దగా బజ్‌ క్రియేట్‌ కాలేదు. కనుక ఓపెనింగ్‌ విషయంలో నిరుత్సాహం తప్పదేమో అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. సినిమాకు సూపర్‌ హిట్‌ టాక్‌ వస్తే అప్పుడు క్రౌడ్‌ పుల్లింగ్‌ ఉండే అవకాశం ఉంటుంది. మరి కప్కాపి సినిమాకు ఆ స్థాయిలో హిట్‌ టాక్‌ వచ్చేనా అనేది చూడాలి. ఈ సినిమాలో వీఎఫ్‌ఎక్స్ వర్క్ గురించి ప్రముఖంగా చర్చ జరుగుతోంది. తప్పకుండా కంటెంట్‌ ప్రేక్షకులను మెప్పిస్తుందనే విశ్వాసంను వ్యక్తం చేస్తున్నారు. బాలీవుడ్‌లో ప్రస్తుతం ఉన్న గడ్డు పరిస్థితులను ఈ సినిమా ఎదుర్కొని నిలిచేనా చూడాలి.

Tags:    

Similar News