ఏఐ మోషన్ పోస్టర్.. నష్టం తప్పేలా లేదే!
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడకం బాగా పెరిగిపోయింది. ప్రస్తుత రోజుల్లో ఏఐ కూడా మన జీవితాల్లో ఓ భాగమైపోయింది.;
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడకం బాగా పెరిగిపోయింది. ప్రస్తుత రోజుల్లో ఏఐ కూడా మన జీవితాల్లో ఓ భాగమైపోయింది. ఏఐ మనల్ని ఎన్నో విధాలుగా ప్రభావితం చేస్తుంది. అందుకే ఇప్పుడు ఏఐను బాలీవుడ్ కూడా ఫిల్మ్ మేకింగ్ మరియు మార్కెటింగ్ కోసం వాడుకోవాలని చూస్తోంది. ధర్మ ప్రొడక్షన్ లో క్రిస్మస్ కానుకగా రిలీజ్ కానున్న తు మేరీ మై తేరా, మై తేరా తు మేరీ సినిమాను మేకర్స్ ఎంతో భారీగా ప్రమోట్ చేస్తున్నారు.
ఏఐ సాయంతో మోషన్ పోస్టర్
ప్రమోషన్స్ లో భాగంగా మేకర్స్ ముందు ఓ స్టాటిక్ పోస్టర్ ను రిలీజ్ చేయగా, తాజాగా ఏఐతో రూపొందించిన ఓ మోషన్ పోస్టర్ ను క్రియేట్ చేసి రిలీజ్ చేశారు. బాలీవుడ్ లో ఏఐ సాయంతో రూపొందించబడిన మొదటి మోషన్ పోస్టర్ గా ఇది నిలవగా, ఈ స్ట్రాటజీ అందరి దృష్టినీ ఎంతగానో ఎట్రాక్ట్ చేసింది. చాలా మంది ఆడియన్స్ ఈ కొత్త స్ట్రాటజీని అభినందిస్తూ, దీన్నొక బోల్డ్ మార్కెటింగ్ మూవ్ గా భావిస్తున్నారు.
ఒరిజినాలిటీ సమస్యను ఎదుర్కొంటున్న బాలీవుడ్
నార్మల్ గా చేసే ప్రమోషన్స్ కంటే ఈ తరహా ప్రమోషన్స్ కాస్త రీఫ్రెషింగ్ గా ఉందని భావిస్తూ ఈ మోషన్ పోస్టర్ ను సోషల్ మీడియాలో వైరల్ గా చేస్తున్నారు. బాలీవుడ్ గతంలో ఇలాంటిది ఎప్పుడూ ట్రై చేయలేదని, మొదటి సారి ముందడుగేసి ఇలా చేయడాన్ని ప్రశంసిస్తున్నారు. కానీ మరికొందరు మాత్రం ఈ ట్రెండ్ చాలా ఆందోళనకరంగా ఉందని, ఇప్పటికే బాలీవుడ్ ఒరిజినాలిటీతో సమస్యలను ఎదుర్కొంటుందని, ఇలాంటి టైమ్ లో మార్కెటింగ్ కోసం కూడా ఏఐని స్వీకరించడం కాస్త ప్రమాదకరమేనని భావిస్తున్నారు.
పునాదిని స్ట్రాంగ్ చేసుకోవాల్సిందే!
అయితే బాలీవుడ్ ముందుగా దాని క్రియేటివ్ స్ట్రెంగ్త్ ను తిరిగి నిర్మించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఒకప్పుడు మోషన్ పోస్టర్లకు హ్యూమన్ టచ్ ఉండేదని, దాంతో పాటూ ఏఐ జనరేటెడ్ పోస్టర్లు ఒకవేళ కాలక్రమేణా రొటీన్ అయితే, చాలా మందికి కనీసం ఉద్యోగాలు కూడా ఉండవని అంటున్నారు. ఈ విషయంలో క్రిటిక్స్ కూడా టెక్నాలజీ ఎంత పెరిగినా ఏఐ, మనిషి చేసే వర్క్ ను క్రియేట్ చేయలేదని, ఆల్రెడీ ఆన్ లైన్ లో ఉన్న వాటిని కలెక్ట్ చేసి వాటిని ఒకదానితో మరొకటి కలుపుతుంది తప్పించి కొత్తగా క్రియేట్ చేయలేదని అంటున్నారు. ఇప్పటికే బాలీవుడ్ సీక్వెల్, రీమేక్, కాపీలపై ఎక్కువగా ఆధారపడిన నేపథ్యంలో మార్కెటింగ్ కూడా హ్యూమన్ క్రియేటివిటినీని కోల్పేతే, ఒరిజినాలిటీ, దాని సారాంశం దెబ్బతింటుందని, ప్రస్తుతం ఏఐ సరదాగా కనిపిస్తున్నప్పటికీ బాలీవుడ్ ముందు తన పునాదిని స్ట్రాంగ్ చేసుకోకపోతే భారీ నష్టం జరిగే అవకాశముందని చాలా మంది భయపడుతున్నారు.