చీరకట్టులో సమంత సోయగాలు..

సమంత.. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా భారీ పాపులారిటీ అందుకున్న ఈ ముద్దుగుమ్మ.. ఇటీవల రెండవ వివాహం చేసుకొని కొత్త జీవితాన్ని మొదలుపెట్టింది.;

Update: 2026-01-10 11:10 GMT

సమంత.. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా భారీ పాపులారిటీ అందుకున్న ఈ ముద్దుగుమ్మ.. ఇటీవల రెండవ వివాహం చేసుకొని కొత్త జీవితాన్ని మొదలుపెట్టింది. గత ఏడాది డిసెంబర్ 1న ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ నిడిమోరుతో ఈషా యోగ ఫౌండేషన్ సమీపంలో ఉన్న లింగ భైరవి సన్నిధిలో ఏడు అడుగులు వేసింది. వివాహం అనంతరం సినిమాలపై ఫోటోస్ పెట్టింది ఈ ముద్దుగుమ్మ. అందులో భాగంగానే ఈమె తెలుగులో నటిస్తున్న చిత్రం మా ఇంటి బంగారం. ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్ పై సహ నిర్మాతగా వ్యవహరిస్తూ ఉండగా.. ఈ చిత్రానికి సమంత భర్త రాజ్ నిడిమోరు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.




 


సమంతతో ఇదివరకే ఓ బేబీ సినిమా చేసిన డైరెక్టర్ నందిని రెడ్డి మరోసారి మా ఇంటి బంగారం అనే సినిమాకు దర్శకత్వం వహిస్తోంది. ఇక భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాకు సంబంధించి జనవరి 9వ తేదీన ఈ సినిమా నుంచి టీజర్ ట్రైలర్ ను విడుదల చేశారు. ఇందులో సమంత ఒకవైపు కోడలిగా అత్తవారి మెప్పు పొందడానికి ప్రయత్నం చేస్తూనే.. మరొకవైపు యాక్షన్ పర్ఫామెన్స్ తో ఆకట్టుకుంది. ఈ టీజర్ ట్రైలర్ లాంచ్ లో భాగంగా థియేటర్లో సందడి చేసిన ఈమె తాజాగా అందుకు సంబంధించిన ఫోటోలను ఇంస్టాగ్రామ్ వేదికగా పంచుకుంది.




 


తెలుపు రంగు చీరకు గులాబీ వర్ణం కలిగిన బ్లౌజ్ ధరించి తన అందంతో మరింత ఆకట్టుకుంది. సింపుల్ జువెలరీతో తన మేకోవర్ ను ఫుల్ ఫిల్ చేసిన ఈమె మరింత సింపుల్గా అభిమానుల హృదయాలను దోచుకుంది. సమంతాను చాలా రోజుల తర్వాత ఇలా సంతోషంగా ఉండడం చూసి మనసుకు హాయిగా ఉంది అంటూ అభిమానులు కూడా కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా సమంత మోములో స్వచ్ఛత అభిమానులనే కాదు నెటిజన్లను కూడా ఆకర్షిస్తోంది.ప్రస్తుతం సమంత షేర్ చేసిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.


 



సమంత విషయానికి వస్తే.. ఒకప్పుడు టాలీవుడ్ లో మహేష్ బాబు , అల్లు అర్జున్, రామ్ చరణ్, ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోలతో సినిమాలు చేసి ప్రేక్షకులను ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ. కెరియర్ పీక్స్ లో ఉండగానే నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకుంది. కానీ ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో పెళ్లైన నాలుగేళ్లకే విడిపోయి అందరిని ఆశ్చర్యపరిచారు. ఆ తర్వాత కాలంలో మయోసైటీస్ వ్యాధి బారిన పడి కొంతకాలం ఇండస్ట్రీకి కూడా దూరమయింది సమంత. ఇక తర్వాత తన ఆరోగ్యాన్ని చక్కబెట్టుకొని ఇప్పుడు మళ్ళీ వెబ్ సిరీస్ లు సినిమాలు చేస్తూ బిజీగా మారిపోయింది. ఇకపోతే శుభం సినిమాతో తెలుగులో సినిమా తీసి నిర్మాతగా సక్సెస్ అందుకున్న ఈమె.. ఇలాగే ఒక వైపు హీరోయిన్గా మరొకవైపు నిర్మాతగా మరింత సక్సెస్ అవ్వాలని అభిమానులు కోరుకుంటున్నారు.

Tags:    

Similar News