ఫోటో స్టోరి: ప్రియాంక మైండ్ బ్లోయింగ్ లుక్

ఎస్ఎస్ఎంబి 29 చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో ఉండ‌గానే ప్రియాంక చోప్రా రెగ్యుల‌ర్ ఫోటోషూట్లు గుబులు రేపుతున్నాయి.;

Update: 2025-07-11 03:47 GMT

అందం, ఆక‌ర్ష‌ణ‌లో గ్లోబ‌ల్ ఐకన్ ప్ర‌యాంక చోప్రా రేంజే వేరు. అందుకే అమెరిక‌న్ గాయ‌కుడు నిక్ జోనాస్ పీసీతో పిచ్చి ప్రేమ‌లో ప‌డ్డాడు. ఆస‌క్తిక‌రంగా హాలీవుడ్ లో తాను ఏ సినిమాలో న‌టించినా ఆ సినిమాకి పీసీనే ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌. అందుకే ఇప్పుడు మ‌హేష్‌- రాజ‌మౌళి సినిమాలో ప్రియాంక చోప్రా చేర‌డంతో ఫ్యాన్స్ చాలా ఎగ్జ‌యిట్ అయ్యారు.


ఎస్ఎస్ఎంబి 29 చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో ఉండ‌గానే ప్రియాంక చోప్రా రెగ్యుల‌ర్ ఫోటోషూట్లు గుబులు రేపుతున్నాయి. తాజాగా పీసీ ఓ మ్యాగ‌జైన్ కవ‌ర్ పేజీపై గుబులు రేపే ఫోజుల‌తో రెచ్చిపోయింది. ప్ర‌ఖ్యాత ఎస్ ప్రైర్ మ్యాగ‌జైన్ క‌వ‌ర్ పేజీపై పీసీ ర‌క‌ర‌కాల డిజైన‌ర్ దుస్తుల‌తో చెల‌రేగిపోయింది. బ్లాక్ అండ్ బ్లాక్.. వైట్ అండ్ వైట్ డిజైన‌ర్ లుక్స్ తో పాటు, ర‌క‌ర‌కాల భంగిమ‌ల్ల పీసీ క‌నిపించింది.


ప్రియాంక ఇటీవల అమెజాన్ ప్రైమ్ `హెడ్స్ ఆఫ్ స్టేట్` చిత్రంలో ఇద్రిస్ ఎల్బా , జాన్ సెనాల‌తో కలిసి కనిపించింది. ఈ చిత్రానికి ఇలియా నైషుల్లర్ దర్శకత్వం వహించారు. యాక్షన్ ప్యాక్డ్ కామెడీలో అమెరికా అధ్యక్షుడిగా జాన్ సెనా న‌టించ‌గా,యుకె ప్రధాన మంత్రి గా ఇద్రిస్ ఎల్బా క‌నిపించారు. ప్ర‌పంచంపై కుట్ర‌ను ఆపేందుకు స్నేహం చేసేవారిగా ఈ ఇద్ద‌రూ క‌నిపించారు. పీసీ యాక్ష‌న్ ప్యాక్డ్ పాత్ర‌తో ర‌క్తి క‌ట్టించింది. మహేష్ బాబుతో కలిసి ఎస్ఎస్ రాజమౌళి సినిమా చిత్రీక‌ర‌ణ‌లోను ప్రియాంక న‌టిస్తోంది. ది బ్లఫ్‌లో 19వ శతాబ్దపు కరేబియన్ పైరేట్‌గా కూడా కనిపిస్తుంది.


Tags:    

Similar News