పిక్‌టాక్ : బేబీ బంప్‌తో చరణ్‌ హీరోయిన్‌

కియారా అద్వానీ తాజా ఫోటో షూట్‌ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. విభిన్నమైన డిజైనర్‌ డ్రెస్‌లో కియారా అద్వానీ లుక్‌ అదిరి పోయింది అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.;

Update: 2025-05-06 04:42 GMT

ఒకప్పుడు హీరోయిన్స్ ప్రెగ్నెంట్‌ విషయాన్ని ముందే రివీల్‌ చేసేవారు కాదు. కానీ ఇప్పుడు హీరోయిన్స్‌ ప్రెగ్నెన్సీ విషయాన్ని వెంటనే ఓపెన్‌గా చెబుతున్నారు. సోషల్ మీడియా ద్వారా తమ ఆనందాన్ని షేర్‌ చేసుకుంటూ ఉన్నారు. అంతే కాకుండా హీరోయిన్స్ సోషల్ మీడియాలో ఎప్పటిలాగే రెగ్యులర్‌ ఫోటో షూట్స్‌ను షేర్‌ చేస్తూ ఉన్నారు. అంతే కాకుండా బేబీ బంప్‌ ఫోటో షూట్స్‌ను కూడా వదలకుండా షేర్‌ చేస్తున్న హీరోయిన్స్ ఈ మధ్య కాలంలో చాలా మంది ఉన్నారు. హీరోయిన్స్‌గా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు దక్కించుకున్న ముద్దుగుమ్మలు పెళ్లి, పిల్లల తర్వాత కూడా సోషల్‌ మీడియా ద్వారా ప్రేక్షకులకు చేరువగా ఉంటున్నారు. ఇండస్ట్రీలో ఆఫర్లు లేకున్నా సోషల్‌ మీడియా ద్వారా వారు జనాల్లోనే ఉంటున్నారు.


తాజాగా రామ్‌ చరణ్‌తో కలిసి ఇటీవల గేమ్‌ ఛేంజర్‌ సినిమాలో నటించి ప్రేక్షకుల ముందుకు వచ్చిన బాలీవుడ్‌ హీరోయిన్ కియారా అద్వానీ బేబీ బంప్ ఫోటోలను షేర్ చేసింది. కియారా అద్వానీ ప్రెగ్నెంట్‌ అనే విషయం ఇప్పటికే అందరికీ తెలిసిందే. ఇటీవల ఫోటోలను షేర్‌ చేస్తూనే ఉంది. కానీ బేబీ బంప్ కనిపించకుండా కాస్త జాగ్రత్తగా ఫోటో షూట్స్ ఇస్తూ వచ్చింది. ఈసారి ఆమె తన బేబీ బంప్‌ను హైలైట్‌ చేస్తూ మరీ ఫోటో షూట్‌కి ఫోజ్‌ లు ఇచ్చింది. రెగ్యులర్‌గా స్కిన్‌ షో ఫోటోలు షేర్‌ చేయడం ద్వారా వార్తల్లో నిలిచి, వైరల్‌ అవుతూ ఉండే కియారా అద్వానీ ఈసారి బేబీ బంప్ ఫోటోలతోనూ వార్తల్లో నిలవడం మాత్రమే కాకుండా వైరల్‌ అవుతోంది.


కియారా అద్వానీ తాజా ఫోటో షూట్‌ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. విభిన్నమైన డిజైనర్‌ డ్రెస్‌లో కియారా అద్వానీ లుక్‌ అదిరి పోయింది అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఆకట్టుకునే అందంతో పాటు, అందమైన ఎక్స్‌ప్రెషన్స్ ఇచ్చే కియారా అద్వానీ బేబీ బంప్ తో కూడా చాలా అందంగా ఉందంటూ నెటిజన్స్‌ కామెంట్స్ చేస్తున్నారు. తల్లి కాబోతున్న కారణంగా కియారా అద్వానీ గత కొన్ని నెలలుగా షూటింగ్స్కు దూరంగా ఉంది. వార్ 2 సినిమాలో ఈమె నటిస్తున్న విషయం తెలిసిందే. ఆ సినిమా కి సంబంధించిన షూటింగ్ ఇంకాస్త బ్యాలెన్స్ ఉందని తెలుస్తోంది. ఆ షూటింగ్‌కి కియారా ఎప్పుడు హాజరు అయ్యేది తెలియాల్సి ఉంది. హీరోయిన్‌గా కియారా అద్వానీ ముందు ముందు మరిన్ని సినిమాలు చేసే అవకాశాలు ఉన్నాయి.


బాలీవుడ్‌ హీరో సిద్దార్థ్‌ మల్హోత్ర తో ప్రేమలో పడ్డ కియారా అద్వానీ 2023 లో వివాహం చేసుకున్న విషయం తెల్సిందే. వీరి పెళ్లి వైభవంగా జరిగింది. పెళ్లి తర్వాత కొన్నాళ్ల తర్వాత పిల్లల ప్లాన్‌ ఉంటుందని అంతా భావించారు. కానీ రెండేళ్లు తిరగకుండానే కియారా అద్వానీ ప్రెగ్నెంట్‌ అంటూ వార్తలు వచ్చాయి. త్వరలోనే కియారా అద్వానీ డెలివరీ ఉంటుందని, ఆ తర్వాత కేవలం రెండు నెలల్లోనే షూటింగ్‌కి కియారా అద్వానీ హాజరు అయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ప్రస్తుతం కియారా అద్వానీ చేతిలో చాలా సినిమాలే ఉన్నాయి. కనుక త్వరలోనే ఆమె కెమెరా ముందుకు రీ ఎంట్రీ ఇచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.

Tags:    

Similar News