చీటా అవతారంలో బెబో కరీనా సర్‌ప్రైజ్
మెడలో భారీ నెక్లెస్, చెవులకు నీలి రంగు జూకాలు సంథింగ్ స్పెషల్ గా ఆకట్టుకున్నాయి.;
బెబో కరీనా కపూర్ ఖాన్ ఫ్యాషన్ సెన్స్, స్టైల్ కంటెంట్ గురించి పరిచయం అవసరం లేదు. వేదిక ఏదైనా కరీనా కనిపిస్తే చాలు ఫ్యాషన్ వేవ్స్ యువహృదయాల్లోకి దూసుకెళతాయి. బాలీవుడ్ కి జీరో సైజ్ ని పరిచయం చేసిన రాణిగా కరీనా పేరు వినిపించింది. ఇండస్ట్రీలోకి సరికొత్త ట్రెండ్స్ ని పరిచయం చేసిన మేటి కథానాయికగాను కరీనా గుర్తింపు పొందింది. ఇప్పుడు చిరుతపులి ప్రింట్ సబ్యసాచి చీరలో ర్యాంప్ పై మెరిసింది.
కరీనా సరికొత్త డిజైనర్ చీరలో సంథింగ్ స్పెషల్ గా కనిపించింది. ముఖ్యంగా బెబో కరీనా ఇద్దరు కిడ్స్ కి మామ్ అయినా కానీ తనలోని గ్లామ్ కంటెంట్ ఎక్కడా తగ్గలేదని నిరూపిస్తోంది. 45 ఏళ్ల వయసులోను కరీనా దేవతా సుందరి అందంతో మెరిసిపోతోంది. వి-నెక్ బ్లౌజ్, ప్లీటెడ్ లుక్ లో కరీనా సంథింగ్ స్పెషల్ గా తనను తాను ఎలివేట్ చేసుకుంది.
మెడలో భారీ నెక్లెస్, చెవులకు నీలి రంగు జూకాలు సంథింగ్ స్పెషల్ గా ఆకట్టుకున్నాయి. రియా కపూర్ డిజైనింగ్ చేసిన ఉంగరాలను తన చేతి వేలికి కరీనా ధరించింది. కరీనా తాజా పోస్ట్ నెటిజనులు, సినీ ప్రియులను కూడా ఆకట్టుకుంది. శిబానీ అక్తర్, రియా కపూర్ సహా పలువురు బెబో కొత్త లుక్ పై ప్రశంసలు కురిపించారు. వయసు ఒక నంబర్ మాత్రమే.. ఎప్పటికీ కరీనా ఏజ్ లెస్ బ్యూటీగా వెలిగిపోతోందంటూ అభిమానులు కితాబిచ్చేస్తున్నారు.
ఇటీవల `క్రూ`లో గ్లామరస్ పాత్రలో నటించి మెప్పించిన కరీనా తదుపరి క్రైమ్ థ్రిల్లర్ `దయ్రా`లో నటిస్తోంది. మేఘనా గుల్జార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. పృథ్వీరాజ్ సుకుమారన్ ఇందులో మరో కీలక పాత్రధారి. దయ్రా తర్వాతా కరీనా పలు భారీ చిత్రాలకు సంతకం చేసేందుకు సిద్ధమవుతోందని సమాచారం. బెబో త్వరలోనే టాలీవుడ్ కి కూడా పరిచయం అవుతుందని కూడా అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.