గ్లామర్ లుక్ లో జాన్వీ కపూర్.. ఆ ఫోజ్ చూశారా?
అలా తల్లి ఇమేజ్.. తండ్రి ప్రోత్సాహంతో ఇండస్ట్రీలో మరింతగా నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తున్న ఈ ముద్దుగుమ్మ.. అటు బాలీవుడ్ లోనే కాకుండా ఇక్కడ టాలీవుడ్ లో కూడా వరుస సినిమాలు ప్రకటిస్తూ దూసుకుపోతోంది.;
బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ అతిలోకసుందరి అందాల తార దివంగత నటీమణి శ్రీదేవి కూతురుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది.'ధడక్ 2' సినిమాతో తనకంటూ ఒక ఇమేజ్ సొంతం చేసుకున్న ఈమె.. ఒకవైపు హీరోయిన్ గా నటిస్తూనే మరొకవైపు పలు ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తూ మరింత పాపులారిటీ సొంతం చేసుకుంది.
నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ అభిమానులను ఆకట్టుకునే ప్రయత్నం చేసిన ఈ చిన్నది.. అతి తక్కువ సమయంలోనే బాలీవుడ్లో అత్యధిక పారితోషకం తీసుకునే నటీమణిగా ఎదిగింది. ఒకవైపు తల్లి స్టార్డంను అనుభవిస్తూనే.. మరొకవైపు తన తండ్రి పలుకుబడిని కూడా ఈమె బాగా ఉపయోగించుకుంటుందనే వార్తలు కూడా వినిపిస్తూ ఉంటాయి. అటు బోనీకపూర్ బడా నిర్మాతగా ఇండస్ట్రీలో పలు చిత్రాలు నిర్మిస్తూ భారీ సక్సెస్ అయ్యారు. కూతురు విషయంలో ఆమెకు అండగా ఉంటూ మరింత ప్రోత్సహిస్తున్న విషయం తెలిసిందే.
అలా తల్లి ఇమేజ్.. తండ్రి ప్రోత్సాహంతో ఇండస్ట్రీలో మరింతగా నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తున్న ఈ ముద్దుగుమ్మ.. అటు బాలీవుడ్ లోనే కాకుండా ఇక్కడ టాలీవుడ్ లో కూడా వరుస సినిమాలు ప్రకటిస్తూ దూసుకుపోతోంది. అందులో భాగంగానే తన తల్లి కోరిక మేరకు తన తొలి తెలుగు చిత్రాన్ని సీనియర్ ఎన్టీఆర్ వారసుడు జూనియర్ ఎన్టీఆర్ తో సినిమా చేసి తన తల్లి కలను నెరవేర్చింది. అలా కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా వచ్చిన 'దేవర' సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది జాన్వీ కపూర్. మొదటి సినిమాతోనే అందరి దృష్టిని ఆకట్టుకుంది. ఇందులో గ్రామీణ ప్రాంత అమ్మాయిగా నటించి మరింతగా మెస్మరైజ్ చేసింది.
ఈ సినిమా తర్వాత ప్రముఖ డైరెక్టర్ బుచ్చిబాబు సన దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న 'పెద్ది' సినిమాలో కూడా అవకాశాన్ని అందుకుంది ఈ ముద్దుగుమ్మ. అంతేకాదు నాని సినిమాలో కూడా జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తున్నట్లు సమాచారం. ఇటీవలే బాలీవుడ్లో 'పరమ్ సుందరి' అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈమె ఇప్పుడు 'సన్నీ సర్కారీకి తులసి కుమారి' అనే సినిమాలో నటిస్తోంది. నిన్న ఈ సినిమా నుండి ట్రైలర్ విడుదల చేయగా దీనికి కూడా విశేష స్పందన లభించింది.
మరొకవైపు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ గ్లామర్ వలకబోస్తూ అభిమానులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగానే తాజాగా పింక్ కలర్ వన్ పీస్ డ్రెస్ ధరించిన ఈమె ఎద అందాలను అలాగే థైస్ అందాలను హైలైట్ చేస్తూ ఫోటోలు షేర్ చేసింది. అందులో వయ్యారంగా సెల్ఫీ తీసుకుంటూ ఈమె ఇచ్చిన ఫోజులు మరింత హైలెట్గా నిలిచాయి అని చెప్పవచ్చు. ఇకపోతే గ్లిటర్ ను తలపించేలా డ్రెస్ ధరించిన ఈమె దాని అందంతో తన శరీర ఛాయను మరింత రెట్టింపు చేసుకుందని చెప్పవచ్చు. మొత్తానికి ఈమె షేర్ చేసిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.