వీరమల్లులో బాబీ రోల్.. జ్యోతి కృష్ణ ఏం చేశారో తెలుసా?

నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటించగా.. సినిమాలో బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ కీలక పాత్రలో కనిపించనున్న విషయం తెలిసిందే.;

Update: 2025-06-30 05:31 GMT

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లీడ్ రోల్ లో రూపొందిన హరిహర వీరమల్లు రిలీజ్ కు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. పీరియాడిక్ యాక్షన్ జోనర్ లో తెరకెక్కిన ఆ సినిమాకు క్రిష్ జాగర్లమూడి, జ్యోతి కృష్ణ దర్శకత్వం వహించారు. మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఏ ఎం రత్నం భారీ బడ్జెట్ తో సమర్పించగా.. ఏ. దయాకర్ రావు నిర్మించారు.


నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటించగా.. సినిమాలో బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ కీలక పాత్రలో కనిపించనున్న విషయం తెలిసిందే. మొఘల్ చక్రవర్తి ఔరంగజేబుగా ఆయన కనిపించనుండగా.. ఇప్పటికే లుక్ రిలీజ్ అయ్యి ఆకట్టుకుంది. అయితే ఇప్పుడు ఆ రోల్ అండ్ క్యారెక్టరైజేషన్ కోసం జ్యోతి కృష్ణ కీలక విషయాలు రివీల్ చేశారు.


చిత్రీకరణలో భాగంగా బాబీ డియోల్ పై కొన్ని సీన్స్ షూట్ అయ్యాక.. యానిమల్ మూవీలో ఆయన యాక్టింగ్ ను జ్యోతి కృష్ణ చూశారట. ఆ తర్వాత వీరమల్లులోని బాబీ డియోల్ రోల్ ను పూర్తి గా రీరైట్ చేయాలని ఫిక్స్ అయ్యారు. వెంటనే రీడిజైన్ చేయాలని నిర్ణయించుకున్నారు. ఆ విషయాన్ని రీసెంట్ గా క్లియర్ గా వివరించారు జ్యోతి కృష్ణ.


"యానిమల్‌ మూవీలో బాబీ డియోల్ నటన అద్భుతం. పాత్రకు సంభాషణలు లేకపోయినా, వ్యక్తీకరణల ద్వారా మాత్రమే భావోద్వేగాలను వ్యక్తపరచగల ఆయన టాలెంట్ చూసి షాకయ్యా. అందుకే హరిహర వీరమల్లులో కూడా ఆయన రోల్ ను పూర్తిగా మర్చాలని ఫిక్స్ అయ్యా. ఫుల్ మేకోవర్ చేయాలని నిర్ణయించుకున్నా" అని తెలిపారు.

బాబీ డియోల్ స్టార్‌ డమ్‌ కు న్యాయం చేయడానికి, ఆయన రోల్ పై అంచనాలకు అనుగుణంగా ఔరంగజేబ్ పాత్రకు ఆకర్షణీయమైన వర్క్ అవసరమని తాను భావించినట్లు జ్యోతి కృష్ణ తెలిపారు. సవరించిన స్క్రిప్ట్‌ ను చెప్పినప్పుడు, బాబీ చాలా ఉత్సాహంగా ఉన్నారని చెప్పారు. వీరమల్లులో పవర్ ఫుల్ రోల్ లో బాబీ కనిపిస్తారని వెల్లడించారు.

బాబీ డియోల్ ఎల్లప్పుడూ భిన్న అవకాశాలను అన్వేషించడానికి, ప్రేక్షకులకు తన కొత్త వెర్షన్‌ను అందించడానికి ఇష్టపడే నటుడని చెప్పారు. బాబీ డియోల్ పవర్ ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్, కళ్ళతో వ్యక్తీకరించే విధానం చాలా బాగుంటుందని తెలిపారు. ఆయనతో వర్క్ చేయడం బెస్ట్ ఎక్స్పీరియన్స్ అని జ్యోతి కృష్ణ వెల్లడించారు. మరి బాబీ డియోల్ రోల్.. ఆడియన్స్ ను ఎంతలా మెప్పిస్తుందో వేచి చూడాలి.

Tags:    

Similar News