బింబిసార-2.. వశిష్ట చేయకపోవడానికి కారణమిదే..

కాగా, అనిల్ పాడురికి బింబిసార సీక్వెల్ డెబ్యూ అని తెలుస్తోంది. ఆయన బింబిసార మూవీకి వీఎఫ్ఎక్స్ పనులు చూసుకున్నారని సమాచారం.;

Update: 2025-07-18 10:30 GMT

టాలీవుడ్ హీరో నందమూరి కళ్యాణ్ రామ్.. బింబిసారతో ఎలాంటి హిట్ అందుకున్నారో అందరికీ తెలిసిందే. టైమ్ ట్రావెల్ పీరియాడికల్ సోషియో ఫాంటసీ డ్రామాగా రూపొందిన ఆ సినిమాతో కెరీర్ లోనే బిగ్గెస్ట్ విజయాన్ని సొంతం చేసుకున్నారు. వరుస ప్లాఫులు ఎదుర్కొన్న ఆయన.. ఆ మూవీతో భారీ కమ్ బ్యాక్ ఇచ్చారు.

అయితే అదే సినిమాతో డైరెక్టర్ వశిష్ట కూడా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. తన మేకింగ్ అండ్ టేకింగ్ తో అందరి దృష్టిని ఆకర్షించారు. తన టాలెంట్ తో ఫిదా చేశారు. రెండో సినిమానే మెగాస్టార్ చిరంజీవితో తీసేందుకు ఛాన్స్ అందుకున్నారు. ఇప్పుడు ఆయన విశ్వంభర మూవీ తీస్తూ ఆ వర్క్స్ తో బిజీగా ఉన్నారు.

అదే సమయంలో బింబిసార చిత్రానికి సీక్వెల్ తెరకెక్కనున్న విషయం తెలిసిందే. బింబిసార రిలీజ్ టైమ్ లోనే మేకర్స్ సీక్వెల్ ను కన్ఫర్మ్ చేశారు. ఆ తర్వాత బింబిసార భారీ విజయాన్ని అందుకోవడంతో సీక్వెల్ పై అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. సీక్వెల్ కోసం నందమూరి అభిమానులు, సినీ ప్రియులు ఎదురుచూస్తున్నారు.

అయితే ఫస్ట్ పార్ట్ తీసిన వశిష్ట.. సీక్వెల్ కు మాత్రం వర్క్ చేయడం లేదు. ఇప్పటికే ఆ విషయంపై ఓసారి ఆయన మాట్లాడారు. బింబిసారతో కళ్యాణ్ రామ్ అవకాశం ఇవ్వడం వల్ల తాను ఇక్కడ ఉన్నానని తెలిపారు. కాకపోతే సీక్వెల్ తాను చేయడం లేదని, బింబిసార 2 విషయానికి వచ్చేసరికి తన ఐడియాలజీ వేరేగా ఉందని చెప్పారు.

ఇప్పుడు మరో ఇంటర్వ్యూలో మళ్లీ క్లారిటీ ఇచ్చారు. పార్ట్ 2ను డైరెక్టర్ అనిల్ పాడురి తెరకెక్కిస్తున్నారని తెలిపారు. ఆ సినిమాకు తనకంటే అనిల్ పాడురినే బెటర్ అని చెప్పారు. ఆయనే సినిమా కోసం బెటర్ గా మంచి ఐడియా క్రాక్ చేశారని, కాబట్టి తనతో పాటు కళ్యాణ్ రామ్ కూడా అనిల్ బెస్ట్ అని ఫిక్స్ అయ్యామని తెలిపారు.

కాగా, అనిల్ పాడురికి బింబిసార సీక్వెల్ డెబ్యూ అని తెలుస్తోంది. ఆయన బింబిసార మూవీకి వీఎఫ్ఎక్స్ పనులు చూసుకున్నారని సమాచారం. ఇప్పుడు బింబిసార 2 స్క్రిప్ట్ పై ఓ టీమ్ తో కలిసి పనిచేస్తున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. దీనిపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. అతి త్వరలో సినిమా కూడా మొదలు కానుంది. మరి ఎప్పుడు రిలీజ్ అవుతుందో వేచి చూడాలి.

Tags:    

Similar News