బిగ్ బాస్ సీజన్9.. ఈసారి రూల్స్ మారాయి
బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ తిరిగి వచ్చేస్తుంది. ఇప్పటికే ఈ షో 8 సీజన్లు పూర్తి చేసుకోగా 9వ సీజన్ కు రంగం సిద్ధమవుతుంది.;
బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ తిరిగి వచ్చేస్తుంది. ఇప్పటికే ఈ షో 8 సీజన్లు పూర్తి చేసుకోగా 9వ సీజన్ కు రంగం సిద్ధమవుతుంది. అయితే ఈసారి సీజన్ మునుపటిలా ఉండదని హోస్ట్ నాగార్జున ఇప్పటికే ప్రోమో ద్వారా క్లారిటీ ఇచ్చారు. ఈ సీజన్ లో సీక్రెట్ రూమ్స్, వైల్ కార్డ్ ఎంట్రీలు, రీఎంట్రీలు ఉండవని, సీజన్ 9 మొత్తం మైండ్ గేమ్స్, ఎమోషనల్ టెన్షన్స్ పైనే నడుస్తుందని చెప్పారు.
బిగ్ బాస్ సీజన్8 టైమ్ లో కంటెస్టెంట్స్ ఫిజికల్ టాస్క్ లతో అలసిపోయారని, కొందరు అందులో చాలా ప్రెజర్ ఉందని కూడా ఆందోళన వ్యక్తం చేయడంతో ఈసారి బిగ్ బాస్ టీమ్ ఫిజికల్ టాస్క్ లను తగ్గించి సోషల్ బిహేవియర్, పర్సనాలిటీ, ప్రెజర్ లో ఉన్నప్పుడు ఎలాంటి డెసిషన్స్ తీసుకుంటారనే వాటిపై ఎక్కువ ఫోకస్ చేస్తున్నారని తెలుస్తోంది. దాంతో పాటూ ప్రతీ వారం ఇంటి నుంచి ఒక పార్టిసిపేట్ ను ఎలిమినేట్ చేయడానికి కూడా కొత్త పద్ధతిని అవలంభిస్తున్నట్టు తెలుస్తోంది.
ఇవన్నీ బిగ్ బాస్ సీజన్9పై ఆసక్తిని పెంచేస్తున్నాయి. వీటితో పాటూ కంటెస్టెంట్ల లిస్ట్ ఆ ఇంట్రెస్ట్ ను ఇంకాస్త పెంచుతుంది. ఇప్పటికే నవ్య స్వామి, రీతూ చౌదరి, సుమంత్ అశ్విన్ పేర్లు బాగా వినిపిస్తున్నాయి. వీరితో పాటూ పలువురు సెలబ్రిటీలు, కామన్ పీపుల్ కూడా ఈసారి కొత్త సీజన్ లో భాగం కానున్నారు. ఓ రకంగా చెప్పాలంటే కామన్ పీపుల్ ను షో లో భాగం చేయడం కాస్త కష్టమే అయినా ఆ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే సీజన్ 9కు మంచి బజ్ తీసుకురావచ్చు.
ఎప్పటికప్పుడు బిగ్ బాస్ టీమ్ కొత్త సీజన్ ను మరింత కష్టంగా మారుస్తూ ఉంటుందనే సంగతి తెలిసిందే. ఈసారి సీజన్ ను ముందు సీజన్ కంటే మరింత కష్టతరంగా మార్చడానికి టీమ్ ప్రయత్నాలు చేస్తున్నారు. గత ఆరు సీజన్లుగా సక్సెస్‌ఫుల్ గా బిగ్ బాస్ ను హోస్ట్ చేస్తూ వస్తున్న నాగార్జునే ఈ సారి కూడా హోస్ట్ చేస్తుండగా, సెప్టెంబర్ నుంచి సీజన్9 మొదలయ్యే అవకాశాలున్నట్టు తెలుస్తోంది.