బిగ్ బాస్ 9.. ఇమ్మాన్యుయేల్ వర్సెస్ తనూజ పోటీ గట్టిగానే ఉంది..!
బిగ్ బాస్ సీజన్ 9లో దాదాపు టైటిల్ రేసులో ఉంది ఎవరు అంటే అందరు కూడా తనూజా, ఇమ్మాన్యుయెల్ అనే చెబుతున్నారు.;
బిగ్ బాస్ సీజన్ 9లో దాదాపు టైటిల్ రేసులో ఉంది ఎవరు అంటే అందరు కూడా తనూజా, ఇమ్మాన్యుయెల్ అనే చెబుతున్నారు. శనివారం లీడర్ బోర్డ్ అది కూడా ఆడియన్స్ ఇచ్చిన హిట్టు ఫ్లాపుల్లో కూడా టాప్ 3లో వీరిద్దరు ఉన్నారు. ఇక హౌస్ లో ఆదివారం విన్నింగ్ కి దగ్గరగా ఎవరు ఉన్నారు.. ఎగ్జిట్ కి ఎవరు దగ్గర ఉన్నారని హోస్ట్ నాగార్జున ఒక టాస్క్ పెట్టారు. దానిలో కూడా హౌస్ లో ఉన్న వారు విన్నింగ్ కి దగ్గరగా ఇమ్మాన్యుయెల్, తనూజ ఇద్దరికి చెరో ఐదు ఓట్స్ పడ్డాయి. ఎగ్జ్ట్ కి దగ్గరగా ఐదు ఓట్లు పడిన సాయి శ్రీనివాస్ ఆల్రెడీ ఆదివారం ఎలిమినేట్ అయ్యాడు.
ఇమ్మాన్యుయెల్, తనూజ ఇద్దరికి చెరో ఐదు ఓట్స్..
ఐతే ఇమ్మాన్యుయెల్, తనూజ ఇద్దరికి చెరో ఐదు ఓట్స్ వచ్చాయి. భరణి, దివ్య, డీమాన్ పవన్, సుమన్ శెట్టి, తనూజ.. ఈ ఐదుగురు ఇమ్మాన్యుయెల్ విన్నింగ్ కి దగ్గరగా ఉన్నాడని ఓట్ చేసింది. ఇమ్మాన్యుయెల్ మాత్రం కళ్యాణ్ కి విన్నింగ్ కి దగ్గరగా ఉంటాడని వేయగా.. కళ్యాణ్, సాయి, నిఖిల్, గౌరవ్, రీతు వీళ్లంతా కూడా తనూజకి ఓట్ వేశారు. సంజన ఒక్కతే డీమాన్ పవన్ కి ఓట్ వేసింది. అలా ఇమ్మాన్యుయెల్ వర్సెస్ తనూజ ఇద్దరి మధ్య బయట ఆడియన్స్ లో మాత్రమే కాదు హౌస్ మేట్స్ లో కూడా ఇద్దరికీ సమాన బలం ఉందని ప్రూవ్ అయ్యింది.
ఇక ఆడియన్స్ హిట్, ఫ్లాపుల్లో 100 శాతం ఓటింగ్ తో సుమన్ శెట్టి మొదటిస్థానంలో ఉన్నాడు. ఈ సీజన్ టాప్ 5లో ఇమ్మాన్యుయెల్, తనూజతో పాటు కళ్యాణ్ కూడా దాదాపు కన్ ఫర్మ్ అనిపిస్తుండగా మిగిలిన రెండు లేదా మూడు స్థానాల్లో ఎవరు ఉంటారు అన్నది ఆసక్తికరంగా మారింది. డీమాన్ పవన్, సుమన్, రీతు, సంజన ఇలా స్ట్రాంగ్ ప్లేయర్స్ వారి ఆటలో దూసుకెళ్తే మాత్రం ఈ ఆర్డర్ అటు ఇటు అయ్యే ఛాన్స్ ఉంటుంది.
ఎవరు ముందుకెళ్తారు.. ఎవరు మరింత స్ట్రాంగ్ అవుతారు..
ఏది ఏమైనా సీజన్ విన్నర్ గా ఇమ్మాన్యుయెల్, తనూజ మధ్య టఫ్ ఫైట్ ఏర్పడేలా ఉంది. మధ్యలో కళ్యాణ్ కి కూడా సోషల్ మీడియాలో మంచి సపోర్ట్ ఉంది. అతను కూడా విన్నర్ రేసులో ఉన్నాడని అనిపిస్తుంది. సీజన్ 9 ఇప్పటివరకు 9 వారాలు పూర్తైంది. మరో నాలుగైదు వారాలు మాత్రమే ఉంది. మరో రెండు వారాలు మాత్రమే హౌస్ లో కెప్టెన్సీ టాస్క్ లు ఉంటాయి. మరి ఈ లోగా ఎవరు ముందుకెళ్తారు.. ఎవరు మరింత స్ట్రాంగ్ అవుతారు.. ఎవరు వెనకపడి ఎలిమినేట్ అవుతారన్నది చూడాలి.
ప్రతి సీజన్ లో విన్నర్ ఎవరన్నది దాదాపు వన్ సైడ్ అవుతూ వచ్చింది. కానీ ఈసారి టాప్ 3లో ఎవరు విన్ అవుతారన్నది చెప్పడం కష్టం అనిపించేలా ఉంది. ప్రతి ఒక్కరిలో పాజిటివ్స్, నెగిటివ్స్ ఉన్నట్టుగా ఇప్పుడు టాప్ 3లో కూడా ఉన్నాయి. ఐతే సమయానుకూలంగా వారు ఆడే ఆటని బట్టి విన్నర్ డిసైడ్ అవుతుంది.