Bigg Boss Telugu 10: డేంజర్ జోన్లో ఉన్న ఇద్దరు ఎవరంటే..
బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10 ఏడో వారంలో నామినేషన్లు, సీక్రెట్ రూమ్ ట్విస్ట్‌లు, వైల్డ్ కార్డ్ ఎంట్రీల హడావిడితో హౌస్‌లో వాతావరణం వేడెక్కింది.
బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10 ఏడో వారంలో నామినేషన్లు, సీక్రెట్ రూమ్ ట్విస్ట్‌లు, వైల్డ్ కార్డ్ ఎంట్రీల హడావిడితో హౌస్‌లో వాతావరణం వేడెక్కింది. ఈ వారం ఏకంగా 12 మంది కంటెస్టెంట్లు నామినేషన్ల బరిలో నిలవడంతో, ఎవరు సేఫ్ అవుతారు, ఎవరి ప్రయాణం ముగుస్తుంది అనే దానిపై ప్రేక్షకుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
ప్రస్తుత అనధికారిక ఓటింగ్ పోల్స్ మరియు ట్రెండ్స్ ప్రకారం.. వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చిన కంటెస్టెంట్లు ఆశించిన స్థాయిలో ఆడియన్స్ నుంచి మద్దతు పొందడంలో వెనుకబడ్డారు. ముఖ్యంగా దక్షి గుత్తికొండ ఓటింగ్‌లో లీస్ట్ పొజిషన్లో కొనసాగుతూ డేంజర్ జోన్లో నిలిచారు.
ఇకపోతే షాలిని సీక్రెట్ రూమ్ ఎపిసోడ్, రీ-ఎంట్రీ తర్వాతి పరిణామాలు రోహిత్ ఓటింగ్ పై కొంత ప్రభావం చూపించాయి. గత వారాలతో పోలిస్తే ఈసారి త్రిగుణ్ నుంచి అతనికి గట్టి పోటీ ఎదురవుతోంది. అయినప్పటికీ టాప్ రేసులో ఉన్నవారు సేఫ్ అయ్యే అవకాశాలున్నాయి.
గ్రాండ్ ఫినాలే నాటికి హౌస్‌లో సభ్యుల సంఖ్యను తగ్గించాల్సి ఉండటంతో, ఈ ఏడో వారంలో డబుల్ ఎలిమినేషన్ ఉండే అవకాశాలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఒకవేళ డబుల్ ఎలిమినేషన్ కనుక జరిగితే, ప్రస్తుతం లీస్ట్ ఓటింగ్‌లో ఉన్న షాలిని మరియు దక్షిలు హౌస్ నుంచి వెలుపలికి వెళ్లే అవకాశాలు అత్యధికంగా కనిపిస్తున్నాయి.
మరోవైపు, బిగ్‌బాస్ నిర్వహించిన ఫిజికల్ అండ్ వెయిట్-లిఫ్టింగ్ టాస్క్‌లలో అద్భుతమైన ప్రతిభ కనబరిచి గ్రీన్ జోన్లోకి వెళ్లిన అమన్, దెబ్జానీ మరియు నీతు మాస్టర్ మినహా మిగిలిన కంటెస్టెంట్ల భవితవ్యం పూర్తిగా వారాంతపు ఓటింగ్ ఫలితాలపైనే ఆధారపడి ఉంది. శని, ఆదివారాల్లో హోస్ట్ నాగార్జున ఎవరిని సేఫ్ చేస్తారు, ఎవరికి ఎగ్జిట్ డోర్ చూపిస్తారు అనేది వేచి చూడాలి!
అయితే అమన్, దేబ్జానీ మరియు నీతు ఈ వారం మాత్రమే కాకుండా వచ్చే వారం కూడా ఇమ్యూనిటీ సాధించి సేఫ్ జోన్ లోకి రావడంతో టాప్ ప్లేయర్స్ స్తనాలకి పెద్ద ప్రమాదం లేదు. ఏదేమైనా కానీ ఈ వారం ఆట సరిగా ఆడకపోతే మాత్రం, వీక్ ప్లేయర్స్ ఇద్దరు కచ్చితంగా ఎలిమినేట్ అవుతారు.