బిగ్ బాస్ 9.. ఎలిమినేషన్ ట్విస్ట్ ఆడియన్స్ షాక్ అవుతారా..?
బిగ్ బాస్ సీజన్ 9 ఏడవ వారం ఎలిమినేషన్ ఎవరన్నది ఇంట్రెస్టింగ్ డిస్కషన్ నడుస్తుంది.;
బిగ్ బాస్ సీజన్ 9 ఏడవ వారం ఎలిమినేషన్ ఎవరన్నది ఇంట్రెస్టింగ్ డిస్కషన్ నడుస్తుంది. ఈ సీజన్ లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చాక ఆటలో పెద్దగా మార్పు రాలేదు కానీ పొజిషన్స్ అయితే కచ్చితంగా మారాయి. ఎవరు ఆటలో ముందుకు వెళ్తున్నారు.. ఎవరు ఆటని మరింత టఫ్ చేస్తారు అన్నది ఒక క్లారిటీ వచ్చింది. వైల్డ్ కార్డ్ గా వచ్చిన వారిలో గౌరవ్ మిగతా అందరికీ టఫ్ ఫైట్ ఇచ్చేలా ఉన్నాడు. నిఖిల్ కూడా ఫిట్ గా కనబడుతున్నా ఇంకాస్త ఇన్వాల్వ్ మెంట్ చూపించాల్సి ఉంది.
టాస్కుల్లో ఎవరు కరెక్ట్ ఎవరు రాంగ్..
ఐతే శని, ఆదివారాలు వస్తే వీకెండ్ నాగార్జున చేసే హంగామా తెలిసిందే. ఈ క్రమంలో ఈ వారం జరిగిన టాస్కుల్లో ఎవరు కరెక్ట్ ఎవరు రాంగ్.. ఇంకా ఎవరు కాస్త అతి చేశారు.. ఎవరు ఆట సరిగా ఆడారన్నది చెబుతారు. ఈ వారం నామినేషన్స్ లో ఎనిమిది మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. వారిలో ఎవరు ఈ వీకెండ్ హౌస్ కి గుడ్ బై చెబుతారన్నది సస్పెన్స్ గా ఉంది.
ఈ వారం ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంట్ దాదాపు కన్ ఫర్మ్ అని అంటున్నారు. నామినేషన్స్ లోకి వచ్చిన ఎనిమిది మందిలో శ్రీనివాస్ సాయి, రాము, దివ్య మాత్రమే డేంజర్ జోన్ లో ఉన్నట్టు తెలుస్తుంది. రమ్య మోక్ష కూడా ఈ ముగ్గురితో యాడ్ అయ్యి లీస్ట్ ఫోర్ గా ఈ నలుగురు ఉన్నారని తెలుస్తుంది. వీరిలో ఎవరు హౌస్ నుంచి ఎగ్జిట్ అవుతారన్నది ఆదివారం తెలుస్తుంది.
నాగార్జున ఇన్ పుట్స్ తీసుకుని మాధురి..
ఈలోగా బిగ్ బాస్ లీక్స్ నుంచి ఎవరు ఎలిమినేట్ అవుతారన్నది మరికొద్ది గంటల్లో తెలుస్తుంది. బిగ్ బాస్ సీజన్ 9లో ఆట కన్నా మిగతా విషయాలు ఎక్కువ ఇంపాక్ట్ చూపిస్తున్నాయి. లాస్ట్ వీక్ మాధురి కాస్త ఫైర్ మీద ఉండగా నాగార్జున ఇన్ పుట్స్ తీసుకుని ఆమె చాలా సైలెంట్ అయ్యారు. సంజన మాత్రం ఎప్పటిలానే తన మాటలతో హౌస్ మెట్స్ ని టార్గెట్ చేస్తుంది. ముఖ్యంగా కెప్టెన్ గా ఉన్న సుమ్నన్, గౌరవ్ లను ఒక విషయంలో ఆమె చాలా ఇన్ సల్ట్ చేసింది. నాగార్జున ఈ విషయంలో సంజన మీద ఫైర్ అవుతారని ఆడియన్స్ ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు.
సంజన ఆమె సరదాగా ఉన్నప్పుడు ఒకలా.. సీరియస్ గా ఉన్నప్పుడు మరోలా ప్రవర్తిస్తుంది. ఆమె సీరియస్ గా ఉన్నప్పుడు ఎవరేం చెప్పినా వినిపించుకోవట్లేదు. అలా మాటలు వదిలేస్తూ అనవసరంగా బ్యాడ్ అవుతుంది. ఆమె ఫన్ సైడ్ కి ఇంప్రెస్ అవుతున్న ఆడియన్స్ ఆమెలోని ఈ నెగిటివ్ యాంగిల్ మాత్రం బాగాలేదని అంటున్నారు.