బిగ్ బాస్ 9.. బాబోయ్ భరణి మళ్లీ అదే మిస్టేక్స్..!

బిగ్ బాస్ సీజన్ 9లో ఆల్రెడీ ఎలిమినేట్ అయిన వారికి హౌస్ లోకి రీ ఎంట్రీ అన్నది ఆడియన్స్ ని సర్ ప్రైజ్ చేసింది.;

Update: 2025-11-01 04:48 GMT

బిగ్ బాస్ సీజన్ 9లో ఆల్రెడీ ఎలిమినేట్ అయిన వారికి హౌస్ లోకి రీ ఎంట్రీ అన్నది ఆడియన్స్ ని సర్ ప్రైజ్ చేసింది. అన్ ఫెయిర్ ఎలిమినేషన్ అనుకుంటూ ఈ సీజన్ లో భరణి, శ్రీజ లను మళ్లీ హౌస్ లోకి రీ ఎంట్రీ ఇప్పించారు బిగ్ బాస్. ఐతే హౌస్ లో వారు ఉండాలంటే మళ్లీ ఆడియన్స్ ఓటింగ్ ద్వారానే నిర్ణయిస్తామని మెలిక పెట్టాడు. ఐతే భరణికి సపోర్ట్ గా ఓ పక్క హౌస్ లో టాస్క్ లు గెలిచాడు. జరిగిన నాలుగు టాస్క్ లల్లో ఒకటి క్యాన్సిల్ అయితే రెండు భరణి, ఒకటి శ్రీజ గెలిచింది. మరోపక్క శ్రీజని ఆడియన్స్ కూడా హౌస్ లో కొనసాగించాలని అనుకోలేదు.

తనూజ, దివ్యల బాండింగ్ లో ఇరుక్కున్న భరణి..

భరణి, శ్రీజ ఇద్దరిలో ఎవరు హౌస్ లో కొనసాగాలని ఆడియన్స్ ఓటింగ్ ద్వారా తమ మద్ధతు తెలపాలని కోరగా ఫైనల్ గా భరణినే హౌస్ లో కొనసాగించాలన్న తీర్పు ఇచ్చారు. దాంతో శ్రీజ హౌస్ వదిలి వెళ్లక తప్పలేదు. ఐతే భరణి రీ ఎంట్రీ ఇవ్వడం ఇప్పుడు పర్మినెంట్ కంటెస్టంట్ అవ్వడంతో కెప్టెన్సీ టాస్క్ లో ఎవరు ఉండాలన్నది అతన్ని చేతుల్లో పెట్టాడు బిగ్ బాస్. భరణి తనతో పాటు తనూజ, దివ్య, సాయి, నిఖిల్ పేర్లు తీసుకున్నాడు.

ఫైనల్ గా జరిగిన కెప్టెన్సీ టాస్క్ లో దివ్య గెలిచి ఇంటి కెప్టెన్ అయ్యింది. ఐతే ఈ టాస్క్ లో కూడా భరణి తనకు క్లోజ్ అయిన ఇద్దరికి ఎవరికి సపోర్ట్ చేయాలో తెలియక సైలెంట్ అయిపోయాడు. దివ్య గెలిచిన లాస్ట్ రౌండ్ లో అటు దివ్యా పోడియం మీద, ఇటు తనూజ పోడియం మీదకు వెళ్లకుండా అలా సెంటర్ లో నిలుచుని ఉన్నాడు భరణి. సీజన్ 9లో స్ట్రాంగ్ కంటెస్టెంట్ అనుకున్న భరణి తనూజ, దివ్యల బాండింగ్ లో ఇరుక్కుపోయాడు. ఈ బాండింగ్స్ అతన్ని ఆటలో వెనకపడేలా చేశాయి.

ఇద్దరు వ్యక్తులు రాంగ్ గైడ్ చేస్తున్నారని..

దానికి తోడు ఏదైనా ఫిజికల్ టాస్క్ ఆడితే చాలు భరణికి హెత్ ఇష్యూస్ వస్తున్నాయి. అందుకే భరణి ఫిజికల్ టాస్క్ లో కూడా పెద్దగా పర్ఫార్మ్ చేయట్లేదు. ఐతే రీ ఎంట్రీ అన్నది గొప్ప అవకాశం అలాంటి టైం లో కూడా భరణి ఇంకా తనూజ, దివ్యల బాండింగ్ లోనే ఉండి ఆటని ఆడకపోవడం మళ్లీ అదే తప్పు చేస్తున్నట్టు ఉంది.

కెప్టెన్ గా తనూజ అవ్వనందుకు బాధపడుతుంటే ఆమెను ఇద్దరు వ్యక్తులు రాంగ్ గైడ్ చేస్తున్నారని మాధురి, రీతుల గురించి భరణి నైట్ బెడ్ మీద తనూజ, ఇమ్మాన్యుయెల్ తో అన్నాడు. భరణి అదే విషయం తనూజకి డైరెక్ట్ గా చెబితే బాగుండేదని ఆడియన్స్ కి అనిపించింది. సో భరణి ఇప్పటికీ సేఫ్ గేం ఆడుతూ హౌస్ లో మళ్లీ అదే తప్పులు చేస్తున్నాడని చెప్పొచ్చు. మరి మళ్లీ భరణి నామినేషన్స్ లోకి వస్తే మాత్రం ఈసారి కూడా బయటకు వచ్చే ఛాన్స్ లేకపోలేదు. లేదు బలంగా చివరి వారం వరకు ఉండాలంటే ఒక మాట మీద స్టాండ్ తీసుకుని దాని మీద భరణి ఫైట్ చేయాల్సి ఉంటుంది.

Tags:    

Similar News