బిగ్ బాస్ 9.. సంజనాని జైల్లో వేసిన బిగ్ బాస్ ఎందుకంటే..?

బిగ్ బాస్ సీజన్ 9లో కేవలం ఈ వారం తర్వాత ఫైనల్ వీక్ మాత్రమే ఉండగా ఈ వారం రోజులు కూడా హౌస్ మేట్స్ మధ్య టాస్క్ లు పెట్టి వారి మధ్య గొడవలు జరిగేలా చూస్తున్నాడు బిగ్ బాస్.;

Update: 2025-12-09 05:40 GMT

బిగ్ బాస్ సీజన్ 9లో కేవలం ఈ వారం తర్వాత ఫైనల్ వీక్ మాత్రమే ఉండగా ఈ వారం రోజులు కూడా హౌస్ మేట్స్ మధ్య టాస్క్ లు పెట్టి వారి మధ్య గొడవలు జరిగేలా చూస్తున్నాడు బిగ్ బాస్. మామూలుగా అయితే ప్రతి మండే నామినేషన్స్ జరుగుతాయి. కానీ ఈసారి నామినేషన్స్ లో అందరు ఉంటారని చెప్పాడు బిగ్ బాస్. కళ్యాణ్ ఎలాగు ఫైనలిస్ట్ అయ్యాడు కాబట్టి అతను కాకుండా మిగిలిన హౌస్ మేట్స్ అంతా నామినేషన్స్ లో ఉంటారని చెప్పాడు. అంతేకాదు భరణి కెప్టెన్ అవ్వలేదు కాబట్టి ఈ వారం కెప్టెన్ గా భరణిని నియమించాడు బిగ్ బాస్.

తనూజకి 2 లక్షల బాక్స్..

ఐతే నెక్స్ట్ బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టెంట్స్ పాయింట్స్ గేం పెట్టాడు. లీడర్ బోర్డ్ లో ప్రతి టాస్క్ కి సంబందించి కొన్ని పాయింట్స్ ఉంటాయి. దానికి అందరు టాస్క్ లు ఆడాల్సి ఉంటుందని చెప్పాడు బిగ్ బాస్. మొదటి టాస్క్ లో భాగంగా ఆరు బాక్సులు ఇచ్చాడు. అందులో 2, 50,000, 2,00,000 ఇంకా లక్షన్నర, లక్ష, యాభై వేలు, చివరి బాక్స్ లో జీరో అని రాశారు. ఈ టాస్క్ లో ఎవరికి ఏ బాక్స్ ఇవ్వాలి అన్నది బాల్ అందుకుని ఆ బాల్ అందుకున్న వారు ఎవరికి ఏ బాక్స్ ఇవ్వాలో చెబుతారు. దానికి మిగతా హౌస్ మేట్స్ లో ఇద్దరు ఆమోదించాలి.

ఫస్ట్ లక్ష రూపాయలను డీమాన్ పవన్ బాల్ అందుకుని సుమన్ శెట్టికి ఇచ్చాడు. నెక్స్ట్ భరణి బాల్ అందుకుని 2 లక్షల బాక్స్ తనూజకి అనగా అందరు ఓకే అన్నారు. నెక్స్ట్ ఇమ్మాన్యుయెల్ కి రెండున్నర లక్షల బాక్స్ ఇచ్చారు. డీమాన్ పవన్ కోసం సుమన్ బాల్ అందుకుని లక్షన్నర బాక్స్ ఇచ్చాడు.

భరణికి ఓటు వేసి సంజనాకి జీరో బాక్స్..

ఐతే మిగిలింది భరణి, సంజన మాత్రమే వారిలో ఒకరికి 50 వేలు, మరొకరికి జీరో ఇవ్వాలి. ఐతే ఇమ్మాన్యుయెల్, డీమాన్ పవన్ సంజనాకి 50 వేలు అని చెప్పగా.. తనూజ, సుమన్ భరణి కోసం ఓట్ వేశారు. ఐతే విన్నింగ్ ఓట్ కళ్యాణ్ చేయాల్సి ఉంది. అతను కూడా భరణికి ఓటు వేసి సంజనాకి జీరో బాక్స్ ఇచ్చాడు.

ఐతే ఈ టాస్క్ లో జీరో బాక్స్ వచ్చిన కారణంగా సంజనానిని బిగ్ బాస్ జైల్లో వేశాడు. భరణి కెప్టెన్ కావడంతో అతను కీస్ తెచ్చి సంజనాని జైల్లో పెట్టాడు. సంజనా తనకు జీతో వచ్చినందుకు చాలా ఎమోషనల్ అయ్యింది. ఇమ్మాన్యుయెల్, డీమాన్ పవన్ ఆమెను నచ్చచెప్పే ప్రయత్నం చేశారు.

ఇక నెక్స్ట్ బాల్ టాస్క్ ఇవ్వగా అందులో ఇమ్మాన్యుయెల్ విన్ అయ్యి 50 పాయింట్స్ గెలుచుకోగా సెకండ్ డీమాన్ పవన్, థర్డ్ ప్లేస్ లో భరణి, నాల్గొవ ప్లేస్ లో తనూజ, చివరి స్థానంలో సుమన్ శెట్టి నిలిచారు.

Tags:    

Similar News