బిగ్ బాస్ అగ్నిపరీక్ష.. నవదీప్ ఓకే వాళ్లిద్దరు మాత్రం..?
బిగ్ బాస్ అగ్నిపరీక్ష షోలో జడ్జిలుగా చేస్తున్న ముగ్గురిలో కూడా నవదీప్ కాస్త కంటెస్టెంట్స్ కి సరిగా పాయింట్స్ అర్థమయ్యేలా.. వాళ్లు ఎక్కడ డౌన్ ఫీల్ అవ్వకుండా చేస్తున్నాడు.;
బిగ్ బాస్ అగ్నిపరీక్ష షోలో జడ్జిలుగా చేస్తున్న ముగ్గురిలో కూడా నవదీప్ కాస్త కంటెస్టెంట్స్ కి సరిగా పాయింట్స్ అర్థమయ్యేలా.. వాళ్లు ఎక్కడ డౌన్ ఫీల్ అవ్వకుండా చేస్తున్నాడు. మరో ఇద్దరు జ్యూరీ మెంబర్స్ అభిజిత్, బిందు మాధవి మాత్రం ఆశించిన విధంగా కంటెస్టెంట్స్ ని సరిగా హ్యాండిల్ చేయలేకపోతున్నారు. ఎవరో ఒకరిద్దరితో తప్ప మిగతా వాళ్లతో అభిజిత్, బిందు మాధవి అంత ఎంగేజ్ అయినట్టు అనిపించట్లేదు. ఐతే ఈ విషయంలో నవదీప్ మాత్రం ఇంప్రెస్ చేస్తున్నాడు.
నవదీప్ చాలా కూల్ గా..
నవదీప్ మొన్న షాకీబ్, కల్కి టాస్క్ విషయంలో శ్రీజని ఊరు నుంచి ఊపుకుంటూ వచ్చేస్తారని కాస్త స్లిప్ అయ్యాడు. అసలు నవదీప్ చాలా కూల్ గా ఉంటాడు. అతను ఎందుకు అలా అన్నాడా అని డిస్కషన్ పెట్టారు. కట్ చేస్తే అదే నవదీప్ మళ్లీ షకీబ్ ని టాప్ 15కి ఛాన్స్ ఇచ్చి మార్కులు కొట్టేశాడు. సో బిగ్ బాస్ అగ్నిపరీక్ష షోలో నవదీప్ అందరి మనసులు గెలుస్తున్నాడు.
మిస్టర్ కూల్ అయిన నవదీప్ బిగ్ బాస్ సీజన్ 1 లో టాప్ 3 గా నిలిచాడు. ఆ సీజన్ లో అతను వైల్డ్ కార్డ్ గా వచ్చి కూడా సూపర్ ఎంటర్టైన్మెంట్ అందించాడు. ఐతే ఏ విషయాన్ని పెద్దగా సీరియస్ గా తీసుకోడు నవదీప్. బిగ్ బాస్ అగ్నిపరీక్ష కోసం నవదీప్ పర్ఫెక్ట్ ఛాయిస్ అనిపించుకుంటున్నాడు. ఐతే అభిజిత్, బిందు మాధవి కూడా ఇంకాస్త కంటెస్టెంట్స్ ని ఎంగేజ్ చేసేలా చేస్తే బాగుంటుందని అంటున్నారు.
టాప్ 15 మధ్యలో గొడవ..
ఇక ఈరోజు ఎపిసోడ్ లో టాప్ 15 మధ్యలో గొడవ పెట్టేశారు. 1 టూ 15 ప్లేసెస్ అంటూ హౌస్ లో మొదలయ్యే హంగామా బిగ్ బాస్ అగ్నిపరీక్షలోనే పెట్టారు. కొన్ని నాటకీయ పరిణామాల తర్వాత 1 టూ 15 ఫైనల్ గా పొజిషన్స్ ఇచ్చారు. అంతేకాదు 1 టూ 7 పొజిషన్స్ లో ఉన్న వాళ్లని రెడ్ టీం.. 8 టూ 14 ఉన్న వారిని బ్లూ టీం చేశారు. 15 వ క్యాండిడేట్ గా మారిన డాలియా రేసు నుంచి బయటకు వచ్చినట్టే అని శ్రీముఖి చెప్పింది. ఐతే జరుగుతున్న టాస్కుల్లో ఆమెను సంచాలక్ గా ఉంచారు.
బిగ్ బాస్ అగ్నిపరీక్ష షోలో నవదీప్ తో పాటు అభిజిత్, బిందు మాధవి కూడా ఇంకాస యాక్టివ్ గా ఉంటూ కంటెస్టెంట్స్ టాస్క్ ల టైం లో ఎంకరేజ్ చేస్తే బాగుంటుందని అంటున్నారు.