ఏంటిది బిగ్ బాస్.. తనూజని విన్నర్ చేయాలని డిసైడ్ అయ్యారా..?
బిగ్ బాస్ సీజన్ 9లో స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా కొనసాగుతున్న తనూజ టాప్ 5కి వెళ్లడం పక్కా అన్నట్టే ఉంది.;
బిగ్ బాస్ సీజన్ 9లో స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా కొనసాగుతున్న తనూజ టాప్ 5కి వెళ్లడం పక్కా అన్నట్టే ఉంది. హౌస్ లో ఆమె ఆడుతున్న తీరు ఇప్పటికే ఆడియన్స్ కి నచ్చేస్తుంది. ఐతే హౌస్ లో తనూజ ఏం చేసినా అదొక పెద్ద ఇష్యూ అవుతుంది. మిగతా వారంతా కూడా ఆమెను సెంటర్ చేసి వాదన జరపడం వల్ల ఆమెకు ఆడియన్స్ లో సింపతీ పెరుగుతుంది. మరోపక్క సీరియల్ యాక్టర్ గా తనూజకి ఆల్రెడీ మంచి పాపులారిటీ ఉంది కాబట్టి అమ్మడు ఈ సీజన్ లో ఒక మార్క్ చూపిస్తుంది.
బిగ్ బాస్ టీం కూడా తనూజకి పాజిటివ్ అయ్యేలా..
ఐతే శనివారం వీకెండ్ ఎపిసోడ్ లో హోస్ట్ నాగార్జున కూడా అదే బిగ్ బాస్ టీం కూడా తనూజకి పాజిటివ్ అయ్యేలా స్క్రిప్ట్ రాస్తున్నట్టు ఉన్నారు. అలా ఎందుకు అంటే.. శనివారం ఎపిసోడ్ లో నాగార్జున ఇమ్మాన్యుయెల్ ని లేపి నీకు మెమరీ లాస్ ఏమైనా ఉందా అని అన్నాడు. ఎందుకు సార్ అంటే నామినేషన్స్ టైం లో తనూజ రాముని పర్మినెంట్ ఎంప్లాయ్ గా చేసే టైం లో తన ఇష్టం తెలుసుకోకుండా చేసిందని వాధించాడు ఇమ్మాన్యుయెల్. ఐతే నాగార్జున వీడియో చూపించి మరీ తనూజ కు సపోర్ట్ గా ప్రొజెక్ట్ చేశారు.
సో నామినేషన్స్ లో తనూజపై ఇమ్మాన్యుయెల్ చేసిన కామెంట్స్ అన్నీ రాంగ్ ఆమె మీద అనవసరంగా ఆర్గ్యుమెంట్ చేశాడు అన్నట్టుగా ఆడియన్స్ కి తెలిసేలా ఈ క్లారిటీ ఉంది. సో ఇది చూసిన కొందరు ఆడియన్స్ స్టార్ మా, బిగ్ బాస్ టీం తనూజని విన్నర్ చేయాలని ఫిక్స్ అయ్యారు. అందుకే ఇమ్మాన్యుయెల్ ఎప్పటి వీడియోనో తెచ్చి తనూజకి సపోర్ట్ గా చూపించారని అనుకుంటున్నారు. ఐతే ఇమ్మాన్యుయెల్ అది మామూలు టైంలో చెప్పి ఉంటే ఏమో కానీ నామినేషన్స్ టైం లో చెప్పాడు కాబట్టే ఆ వీడియో చూపించారని కొందరు అంటున్నారు.
స్టార్ మా ఇంకా బిగ్ బాస్ టీం పార్షియాలిటీ..
ఏది ఏమైనా తనూజ విషయంలో స్టార్ మా ఇంకా బిగ్ బాస్ టీం కొంత పార్షియాలిటీగా ఉన్నారు అన్నట్టు తెలుస్తుంది. ఓటింగ్ ప్రకారమే ఎలిమినేషన్ అన్నది జరుగుతున్నా బిగ్ బాస్ టీం ప్రొజెక్ట్ చేసే దాని మీదే ఆడియన్స్ మైండ్ సెట్ మారుతుంది. తనూజకి ఇప్పటివరకు పాజిటివ్ గానే ఈ అంశాలు ఉన్నాయి. బిగ్ బాస్ సీజన్ 9లో తన మాటతో ముందుకు వస్తున్న తనూజ టాస్క్ లు కూడా ఆడితే మాత్రం ఆమె విన్నర్ అయినా కావొచ్చని అంటున్నారు.
ఈ సీజన్ లో తనూజతో పాటు ఇమ్మాన్యుయెల్ కూడా మంచి ఆట ఆడుతూ టాప్ ప్లేస్ కి దూసుకెళ్తున్నాడు. నిన్న ఎపిసోడ్ తో డీమాన్ పవన్ కూడా టాప్ 5 దాకా వెళ్లే ఛాన్స్ ఉందనిపిస్తుంది