బిగ్ బాస్ 9.. ఆ కంటెస్టెంట్ హౌస్ లో ఉండాలని అనుకోవట్లేదా..?
బిగ్ బాస్ సీజన్ 9లో ఒక కంటెస్టెంట్ అదేదో పిక్ నిక్ స్పాట్ కి వచ్చినట్టుగా ఫీల్ అవుతున్నట్టు కనిపిస్తున్నాడు.;
బిగ్ బాస్ సీజన్ 9లో ఒక కంటెస్టెంట్ అదేదో పిక్ నిక్ స్పాట్ కి వచ్చినట్టుగా ఫీల్ అవుతున్నట్టు కనిపిస్తున్నాడు. హౌస్ లో జరిగే ఏ విషయంలో కూడా అతని ఇన్వాల్వ్ మెంట్ అసలు కనిపించట్లేదు. ముఖ్యంగా టాస్క్ లల్లో కూడా అతను ఆసక్తి చూపించట్లేదు. అసలు అతను హౌస్ లో ఉండి ఏం చేయాలని అనుకుంటున్నాడో అర్ధం కావట్లేదు. ఇంతకీ ఎవరా కంటెస్టెంట్ అంటే రాము రాథోడ్ అని తెలుస్తుంది. హౌస్ లో అందరు అన్ని విధాలుగా తమ బెస్ట్ ఇస్తున్నారు. రాము ఒక్కడే ఎందుకో ఎక్కడో వెనకపడ్డాడు అనిపిస్తుంది.
గ్రీన్ సేఫ్ కార్డ్ ఇమ్మాన్యుయెల్ తీసుకున్నాడు..
అందరి కన్నా చిన్నోడు.. మంచి యాక్టివ్ నెస్ కనబరించే ఛాన్స్ ఉంది. అసలు అతను ఆట ఆడాలనుకుంటే చాలా బాగా ఉంటుంది. కానీ నాకెందుకులే అన్నట్టు ఉంటున్నాడు. లాస్ట్ వీక్ నాగార్జున కూడా రాము గురించి ఒక వీడియో వేసి మరీ చూపించారు. పోనీ తర్వాత అయినా ఏమన్నా మారుతాడా అంటే అసలేం లేదు. ఈ వారం నామినేషన్స్ లో కూడా రాము ఉన్నాడు. అతను హోమ్ సిక్ గా ఫీల్ అవుతున్నాడు కావొచ్చని అనిపిస్తుంది. అదీగాక ఈ వారం నామినేషన్స్ లో ఉన్నాడు కాబట్టే ఈసారి తన ఎలిమినేషన్ పక్కా అనే ఫీలింగ్ లో ఉన్నట్టు ఉన్నాడు.
ప్రస్తుతం హౌస్ లో జరుగుతున్న కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ లో రాము మొదటి రౌండ్ ఆట ఆడాడు అతను ఇమ్మాన్యుయెల్ తో కలిసి గెలిచాడు. ఆ ఆట గెలిచినందుకు గ్రీన్ సేఫ్ కార్డ్ ఇవ్వగా అది ఇమ్మాన్యుయెల్ తీసుకున్నాడు. ఇక నెక్స్ట్ టాస్క్ గెలిచాక గౌరవ్ గొడవ పడి మరీ అతను గ్రీన్ సేఫ్ కార్డ్ పొందాడు. ఆ టైంలో రాము సైలెంట్ గానే ఉన్నాడు.
రాము మాత్రం హౌస్ లో కొనసాగాలనే ఇష్టం లేదన్నట్టుగా..
మరోపక్క కెప్టెన్సీ రేసులో మిగిలిన వారి నుంచి నలుగురు రావాలని చెప్పగా భరణి, రీతు, ఇమ్మాన్యుయెల్, తనూజ, రాము మధ్య చర్చ జరిగింది. అక్కడ కూడా రాము సాక్రిఫైజ్ చేసి ఇమ్మాన్యుయెల్ కి కెప్టెన్సీ కంటెండర్ ఛాన్స్ ఇచ్చాడు. ఇదంతా చూస్తుంటే రాముకి హౌస్ లో ఇక కొనసాగాలన్న ఆలోచన లేదన్నట్టుగా అనిపిస్తుంది. రాము ఎఫర్ట్ పెడితే చాలు బయట ఉన్న తన ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్ అతన్ని కాపాడేందుకు చూస్తున్నారు. కానీ రాము మాత్రం హౌస్ లో కొనసాగాలనే ఇష్టం లేదన్నట్టుగా ప్రవర్తిస్తున్నాడు. మరి ఈ వారం కూడా రాము సేఫ్ అయితే మాత్రం అతని ఆట తప్పకుండా మార్చుకోవాల్సిందే.
అని చెప్పొచ్చు. బిగ్ బాస్ సీజన్ 9లో 9 వారం ఎవరు హౌస్ నుంచి ఎలిమినేట్ అవుతారని ఇంట్రెస్టింగ్ గా మారింది. ఈ వారం ఏడుగురు కంటెస్టెంట్స్ నామినేషన్స్ లో ఉన్నారు. వారిలో తనూజ, రాము, భరణి, సుమన్, సంజమ, శ్రీనివాస్ సాయి, కళ్యాణ్ ఉన్నారు. వీరిలో ఎవరు హౌస్ నుంచి ఈ వారం బయటకు వెళ్తారన్నది చూడాలి.