బిగ్ బాస్ 9.. ముగ్గురికి నాగార్జున రెడ్ కార్డ్..!

బిగ్ బాస్ సీజన్ 9లో ఈ వీకెండ్ ఎపిసోడ్ నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతుందని టాక్. ముఖ్యంగా హోస్ట్ నాగార్జున ఈ శనివారం ఎపిసోడ్ లో ముగ్గురు కంటెస్టెంట్స్ కి రెడ్ కార్డ్ చూపిస్తారని చెబుతున్నారు.;

Update: 2025-11-29 04:48 GMT

బిగ్ బాస్ సీజన్ 9లో ఈ వీకెండ్ ఎపిసోడ్ నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతుందని టాక్. ముఖ్యంగా హోస్ట్ నాగార్జున ఈ శనివారం ఎపిసోడ్ లో ముగ్గురు కంటెస్టెంట్స్ కి రెడ్ కార్డ్ చూపిస్తారని చెబుతున్నారు. నామినేషన్స్ టైంలో రీతు, డీమాన్ పవన్ గురించి సంజన అభ్యంతరకరంగా మాట్లాడారు. ఆ టైంలోనే ఆమె కామెంట్స్ ని మిగతా హౌస్ మేట్స్ తప్పుబట్టారు. అయినా కూడా సంజనా వారం మొత్తం దాన్ని కొనసాగిస్తూనే వచ్చారు. అంతేకాదు చివరి కెప్టెన్సీ ఫైట్ లో కంటెండర్స్ గా నిలిచిన టైం లో కూడా రీతు సంజనని తీసేస్తున్న టైం లో కూడా ఆమె డీమాన్ పవన్, రీతు మ్యాటర్ నే మెయిన్ గా ట్రిగర్ చేసింది.

సంజన మీద నాగార్జున సీరియస్..

హౌస్ లో ప్రతి ఒక్కటి ఆటే.. రీతు, డీమాన్ పవన్ తో అలా ఉండటం తనకు నచ్చలేదన్నది సంజన పాయింట్. అయితే ఈ విషయాన్ని ఆమె ఏదో వాళ్లు లిమిట్స్ క్రాస్ అయ్యారన్న రేంజ్ లో ఆమె ప్రొజెక్ట్ చేస్తుంది. సంజన మాట్లాడుతున్న తీరుపై మిగిలిన హౌస్ మేట్స్ అంతా కూడా వద్దని వారిస్తున్నా సరే ఆమె వెనక్కి తగ్గట్లేదు. ఈ విషయంపై హోస్ట్ నాగార్జున సంజన మీద సీరియస్ అవుతారని తెలుస్తుంది. అంతేకాదు ఆమెకు రెడ్ కార్డ్ చూపిస్తారని టాక్.

బిగ్ బాస్ హౌస్ లో రెడ్ కార్డ్ అసలైతే హౌస్ నుంచి తక్షణమే ఎవరికైతే హోస్ట్ రెడ్ కార్డ్ చూపిస్తారో వాళ్లు హౌస్ నుంచి వెళ్లిపోవాలి. ఈ వారం ఒకరిద్దరు కాదు ముగ్గురికి నాగార్జున రెడ్ కార్డ్ చూపిస్తారట. రెండోది కెప్టెన్ అయిన కళ్యాణ్ కి రెడ్ కార్డ్ చూపిస్తారట నాగార్జున. ఈ వారం నామినేషన్స్ లో రీతు తో వాదన చేస్తూ ఆమె మీద మీదకు వెళ్లాడు కళ్యాణ్. అంతేకాదు రెండుసార్లు బిగ్ బాస్ ప్రాపర్టీ అయిన చెయిర్ ని కాలితో తన్నాడు. ఇది తప్పకుండా బిగ్ బాస్ రూల్స్ ని అతిక్రమించినట్టే అవుతుంది.

డీమాన్ పవన్, కళ్యాణ్ ని కంట్రోల్ చేయడం కోసం మెడ పట్టుకుంటాడు..

ఈ కారణం వల్ల కళ్యాణ్ కి నాగార్జున రెడ్ కార్డ్ చూపిస్తారట. అంతేకాదు ఈ వారం కష్టపడి గెలిచిన కళ్యాణ్ కెప్టెన్సీ ని కూడా రివోక్ చేస్తారని టాక్. ఇక మూడో రెడ్ కార్డ్ డీమాన్ పవన్ కి ఇస్తారట హోస్ట్ నాగార్జున. ఎందుకంటే ఈ వారం నామినేషన్స్ లో కళ్యాణ్, రీతు డిస్కషన్స్ లో డీమాన్ పవన్, కళ్యాణ్ ని కంట్రోల్ చేయడం కోసం అతని మెడ పట్టుకుంటాడు. ఐతే ఆ టైం లో కళ్యాణ్ తిరిగి రేజ్ అవ్వలేదు కాబట్టి అక్కడ గొడవ పెద్దది కాలేదు. కానీ డీమాన్ పవన్ అలా కళ్యాణ్ మెడ పట్టుకోవడం మాత్రం తప్పు. అందుకే డీమాన్ పవన్ కి నాగార్జున రెడ్ కార్డ్ చూపిస్తారట.

ఐతే ఈ ముగ్గురికి రెడ్ కార్డ్స్ ఇచ్చి నాగార్జున నెక్స్ట్ ఏం చేస్తారన్నది ఈరోజు ఎపిసోడ్ లో చూడాలి. మొత్తానికి ఈ సీజన్ లోనే క్రేజీ ఎపిసోడ్ గా ఈ శని, ఆదివారాలు ఎపిసోడ్స్ ఉండబోతున్నాయని తెలుస్తుంది. నాగార్జున ఈ ముగ్గురికి రెడ్ కార్డ్స్ ఇస్తే మాత్రం కచ్చితంగా ఆడియన్స్ కూడా షాక్ అయ్యే ఛాన్స్ ఉందని చెప్పొచ్చు.

Tags:    

Similar News