• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  బిచ్చగాడు రాంగ్ టైం...

బిచ్చగాడు రాంగ్ టైం రిలీజ్..!

| అందుకే బిచ్చగాడు సినిమా రీ రిలీజ్ థియేటర్ లు చాలా వరకు ఖాళీగా ఉన్నాయట.

By - Tupaki Desk
Update: 2023-09-17 02:30 GMT

ఓ సినిమా రీ రిలీజ్ చేస్తున్నారు అంటే ఆ సినిమా కోసం ఫ్యాన్స్ అంతా కూడా ఎంతో ఎగ్జైట్ అయ్యేలా ఉంటారు. ఈమధ్య స్టార్ సినిమాల సూపర్ హిట్ సినిమాలు 4K వెర్షన్ అంటూ రీ రిలీజ్ హంగామా జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో కొన్ని సినిమాలు రీ రిలీజ్ లో రికార్డులు సృష్టిస్తుంటే కొన్ని సినిమాలు మాత్రం ఆ సినిమాల ఇదివరకు తెచ్చుకున్న పేరుని చెడగొడుతున్నాయి. అసలు విషయంలోకి వెళ్తే రీసెంట్ గా విజయ్ ఆంటోని నటించిన బిచ్చగాడు సినిమాను రీ రిలీజ్ చేశారు. తెలుగులో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న బిచ్చగాడు సినిమా రీ రిలీజ్ లో అసలేమాత్రం ఆకట్టుకోలేకపోయింది.

రీ రిలీజ్ సినిమా అంటే స్టార్ క్రేజ్.. సినిమాలో ఒక మంచి కల్ట్ సబ్జెక్ట్ ఉండాలి. కానీ మదర్ సెంటిమెంట్ తో తెరకెక్కించే బిచ్చగాడు కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమా.. అప్పుడంటే ఆ సినిమాకు విపరీతంగా కనెక్ట్ అయ్యి సినిమాను బ్లాక్ బస్టర్ చేశారు కానీ రీ రిలీజ్ లో ఆడియన్స్ కు హై ఇచ్చే మూమెంట్స్ లేకపోవడంతో సినిమాను చూసేందుకు ఆసక్తి చూపించట్లేదు. అందుకే బిచ్చగాడు సినిమా రీ రిలీజ్ థియేటర్ లు చాలా వరకు ఖాళీగా ఉన్నాయట.

కొన్నిచోట్ల షోలు క్యాన్సిల్ కూడా చేశారని తెలుస్తుంది. అయినా ఓటీటీలో, యూట్యూబ్ లో ఫ్రీగా దొరికే సినిమాను మళ్లీ అదనంగా ఖర్చు పెట్టి చూడాలని ఎవరు అనుకోరు. ఏదైనా స్టార్ హీరో సినిమా కల్ట్ మూవీ అయితే ఆ సినిమా రీ రిలీజ్ అంటే ఫ్యాన్స్ అంతా సినిమాను చూసేందుకు ఆసక్తి చూపించే అవకాశం ఉంది తప్పా సెంటిమెంట్ ఎమోషనల్ సినిమాలు రీ రిలీజ్ చేస్తే రిజల్ట్ ఇలానే ఉంటుందని చెప్పొచ్చు.

అదీగాక విజయ్ ఆంటోని బిచ్చగాడు తర్వాత చేసిన సినిమాలన్నీ కూడా ఆశించిన స్థాయిలో ఫలితాలు ఇవ్వలేదు. రీసెంట్ గా వచ్చిన బిచ్చగాడు 2 హిట్ అయ్యింది. సో బిచ్చగాడు రీ రిలీజ్ విజయ్ కి ఉన్న పేరు ని కూడా డ్యామేజ్ చేసే పరిస్థితి తెచ్చింది. విజయ్ ఆంటోనీ నెక్స్ట్ సినిమాకు కూడా తెలుగులో పెద్దగా బజ్ లేదు. బిచ్చగాడు రీ రిలీజ్ విజయ్ ఆంటోనికి కూడా చేదు అనుభవాన్ని మిగిల్చిందని చెప్పొచ్చు. సినిమా రీ రిలీజ్ తో క్యాష్ చేసుకోవాలనుకున్న మేకర్స్ ఆలోచన రివర్స్ కొట్టేసిందని కూడా తెలుస్తుంది.

Tags:    
  • Bichagadu 
  • Bichagadumovie 
  • Rerelease 
  • Vijayantony 
  • Theatricalrelease 

Similar News

విడుదలకు ముందే కేక పెట్టిస్తున్న కాకా..!

2026-11-05 08:06 GMT

నేచుర‌ల్ అందంతో జెన్ Zని క‌వ్విస్తున్న డెబ్యూ న‌టి

2026-11-05 08:06 GMT

అన్ని పుకార్ల‌కు చెక్.. 'దాదా' ఫిక్స‌యితే ద‌బిడి దిబిడే!

2026-11-05 07:53 GMT

ఇదేమి కన్ఫ్యూజన్ నాని.. అది ఇది కాదు.. అదే ఇది..!

2026-11-05 07:53 GMT

'రామాయణం' మూవీ రివ్యూ

2026-11-05 07:40 GMT

బాకీలు ఎగ్గొట్టిన మ్యూజిక్ డైరెక్టర్.. దేవుడికి కంప్లైంట్!

2026-11-05 07:36 GMT

మళ్లీ వోగ్ కవర్‌పై కత్రినా.. ఫ్యాన్స్‌కు స్పెషల్ ట్రీట్!

2026-11-05 07:35 GMT

ఈ దీపావళికి పెద్దగా సౌండ్ చేయలేకపోయిన టాలీవుడ్!

2026-11-05 07:27 GMT

కీర్తి సురేష్.. మరోసారి లెక్క తప్పిందా..

2026-11-05 07:23 GMT

సంక్రాంతి బాక్సాఫీస్ రేసు - 1000 కోట్ల బిజినెస్ అంచనా!

2026-11-05 07:21 GMT

తరుణ్ భాస్కర్.. నెక్స్ట్ ఆ హీరో దగ్గరికేనా!

2026-11-05 07:17 GMT

రహస్యం బయటపెట్టిన భాగ్యశ్రీ.. ఆ టాలెంట్ కూడా ఉందా?

2026-11-05 07:03 GMT

Copyright @2026

Powered by Blink CMS