నేరుగా ఓటీటీలోకి వామికా గ‌బ్బి మూవీ.. రీజ‌న్ ఏంటంటే

కానీ ఇప్పుడు స‌డెన్ గా ఆ సినిమాను నేరుగా ప్రైమ్ వీడియోలో రిలీజ్ చేస్తున్న‌ట్టు వెల్ల‌డిస్తూ మేక‌ర్స్ అనౌన్స్ చేయ‌డంతో పాటూ దానికి గ‌ల‌ కార‌ణాన్ని కూడా వెల్ల‌డించారు.;

Update: 2025-05-08 09:56 GMT

దేశంలో జ‌రుగుతున్న ప‌రిస్థితుల వ‌ల్ల ప‌లు ఈవెంట్లు క్యాన్సిల్ అవుతున్నాయి. ఎవ‌రూ అంత త్వ‌ర‌గా ప‌బ్లిక్ లోకి వెళ్లే సాహ‌సం చేయ‌డం లేదు. దేశంలోని ప‌రిస్థితుల‌ను దృష్టిలో ఉంచుకుని రేపు థియేట‌ర్ల‌లో రిలీజ్ అవాల్సిన ఓ సినిమా ఇప్పుడు నేరుగా ఓటీటీలోకి వ‌స్తుంది. ఈ విష‌యం అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రుస్తున్న‌ప్ప‌టికీ ఇదే నిజం.

వామికా గ‌బ్బి తాజా సినిమా భూల్ చుక్ మాఫ్ మే 9న థియేట‌ర్ల‌లో రిలీజ్ కానున్న‌ట్టు మేక‌ర్స్ ఎప్పుడో ప్ర‌క‌టించారు. కానీ ఇప్పుడు స‌డెన్ గా ఆ సినిమాను నేరుగా ప్రైమ్ వీడియోలో రిలీజ్ చేస్తున్న‌ట్టు వెల్ల‌డిస్తూ మేక‌ర్స్ అనౌన్స్ చేయ‌డంతో పాటూ దానికి గ‌ల‌ కార‌ణాన్ని కూడా వెల్ల‌డించారు. రీసెంట్ గా దేశంలోని సంఘ‌టన‌లు, పెరిగిన భ‌ద్ర‌త దృష్ట్యా తాము ఓటీటీ మార్గాన్ని ఎంచుకున్న‌ట్టు మేక‌ర్స్ తెలిపారు.

ప్ర‌జ‌ల భ‌ద్ర‌త, అవ‌స‌రాల‌ను దృష్టిలో ఉంచుకునే తాము త‌మ సినిమాను థియేట‌ర్ల‌లో కాకుండా ఓటీటీలో రిలీజ్ చేయాల‌ని నిర్ణయించుకున్న‌ట్టు మ‌డాక్ ఫిల్మ్స్ అధినేత దినేష్ విజ‌న్ క్లారిటీ ఇచ్చారు. ఈ సిట్యుయేష‌న్ పాండ‌మిక్ ను గుర్తు చేస్తున్న‌ప్ప‌టికీ అది, ఇది పూర్తిగా వేరు. నిర్మాత‌లు తీసుకున్న డెసిష‌న్ ను చూసి ఇది మ‌రో ఐసోలేష‌న్ టైమ్ అని కామెంట్స్ చేస్తున్నారు.

క‌ర‌ణ్ శ‌ర్మ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమా ప్రైమ్ వీడియోలో మే 16న రిలీజ్ కానుంది. రాజ్‌కుమార్ రావు నటించిన ఈ సినిమాలో సీమా ప‌హ్వా, ర‌ఘుబీర్ యాద‌వ్, సంజ‌య్ మిశ్రా, జాకీర్ హుస్సేన్ కీల‌క పాత్ర‌ల్లో న‌టించ‌గా ఈ సినిమాకు త‌నిష్క్ బాగ్చి సంగీతం, కేత‌న్ సోధా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించారు.

Tags:    

Similar News