ఎయిర్పోర్టులో చీరకట్టులో హుందాగా కనిపించిన బ్యూటీ.. ఎవరీ జూనియర్ రష్మిక?
మరి రష్మికను తలపించేలా అందంతో మాయ చేస్తున్న ఈ అమ్మాయి ఎవరో ఇప్పుడు చూద్దాం.
ఐశ్వర్యరాయ్ పోలికలతో ఆకట్టుకుంటూ కళ్లతో మాయ చేస్తూ జూనియర్ ఐశ్వర్యరాయ్ గా స్నేహ ఉల్లాల్ ఎలా అయితే పేరు దక్కించుకుందో.. ఇటీవల కాలంలో తన అద్భుతమైన నటనతో అందరి దృష్టిని ఆకట్టుకుంటూ జూనియర్ అనుష్కగా పేరు సొంతం చేసుకుంది కామాక్షి చౌదరి. ఇక ఇప్పుడు తన అందంతో రష్మికను తలపిస్తూ ఎవరీ జూనియర్ రష్మిక అని అందరిలో ప్రశ్నను చిగురించేలా చేసింది ఈ ముద్దుగుమ్మ. ఇదిలా ఉండగా తాజాగా ఎయిర్ పోర్ట్ లో చీరకట్టులో హుందాగా నడుచుకుంటూ కనిపిస్తూ వచ్చి, అందరిలో అటెన్షన్ క్రియేట్ చేసింది. ప్రతి ఒక్కరు రష్మిక లాగా ఉందే.. ఎవరు ఈ జూనియర్ రష్మిక అంటూ తెగ చర్చించుకుంటున్నారు. మరి రష్మికను తలపించేలా అందంతో మాయ చేస్తున్న ఈ అమ్మాయి ఎవరో ఇప్పుడు చూద్దాం.
జూనియర్ రష్మిక అని అందరి చేత పిలిపించుకుంటున్న ఈ అమ్మాయి పేరు భైరవి ఆర్ధ్య. అందం, అభినయంతో ఆకట్టుకుంటూ అందరి దృష్టిని ఆకట్టుకున్న ఈ చిన్నది చీర కట్టులో ఎయిర్ పోర్ట్ లో కారు వైపు నడుచుకుంటూ వచ్చి కుర్ర కారు హృదయాలను దోచుకుంది. మొత్తానికి అయితే భైరవి లేటెస్ట్ లుక్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటుంది.
భైరవి విషయానికి వస్తే.. ఈమె అస్సాం కి చెందిన అమ్మాయి. ప్రముఖ సింగర్ సునీత కొడుకు ఆకాష్ తన రెండవ చిత్రం 'కొత్త మలుపు' చిత్రంతో హీరోయిన్గా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. శివ వరప్రసాద్ దర్శకత్వంలో.. తాటి బాలకృష్ణ నిర్మించిన ఈ చిత్రంతో ఈమె తెలుగు ఇండస్ట్రీలోకి అరంగేట్రం చేసింది. ఇకపోతే ఈ సినిమా జూన్ 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న ఈమె ఎన్నో విషయాలను పంచుకుంది.
నేను అస్సాంకు చెందిన అమ్మాయిని. నా తల్లిదండ్రులు చెల్లెలు ఇప్పటికీ అక్కడే నివసిస్తున్నారు. చిన్నప్పటి నుంచి నటన అంటే ఇష్టం. సినిమాలపై మక్కువ. తెలుగు సినిమాలతో పాటు అనేక సినిమాలు చూస్తూ పెరిగాను. క్రమంగా నటి కావాలనే కోరిక కలిగింది. ఆ కోరికను పట్టుదలతో సహకారం చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. ఇప్పుడు దానిని నిజం చేసుకోవడానికి ఎంతో కష్టపడ్డాను. ఒకవైపు చదువుతూనే మరొకవైపు ఆడిషన్స్ లో పాల్గొన్నాను. ఆ సమయంలో నాకు తెలుగు రాదు కానీ ఎప్పుడూ నా ప్రయత్నాన్ని వదులుకోలేదు. రెండు మూడు ఏళ్లపాటు ఆడిషన్లకు హాజరవుతూ భాష నేర్చుకోవడానికి తీవ్రంగా కష్టపడ్డాను. ముఖ్యంగా నా చుట్టూ ఉన్నవారితో తెలుగు మాట్లాడడం ప్రాక్టీస్ చేసి, క్రమంగా నేర్చుకున్నాను. ఇక ఆ పట్టుదల , శ్రమ ఫలితమే ఈ సినిమా అంటూ ఆమె చెప్పుకొచ్చింది.