బెల్లంకొండ 'భైరవం' ట్రైలర్.. యాక్షన్ ఎలివేషన్స్ వేరే లెవెల్..

విజయ్ కనకమేడల దర్శకత్వం వహిస్తున్న ఆ సినిమాలో టాలెంటెడ్ హీరోలు నారా రోహిత్, మంచు మనోజ్ పవర్ ఫుల్ రోల్స్ లో యాక్ట్ చేస్తున్నారు. ఆనంది, అదితి శంకర్, దివ్య పిళ్లై హీరోయిన్స్ గా యాక్ట్ చేస్తున్నారు. జయసుధ కీలక పాత్రలో కనిపించనున్నారు.;

Update: 2025-05-18 14:14 GMT

టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ లీడ్ రోల్ లో నటిస్తున్న లేటెస్ట్ మూవీ భైరవం. విజయ్ కనకమేడల దర్శకత్వం వహిస్తున్న ఆ సినిమాలో టాలెంటెడ్ హీరోలు నారా రోహిత్, మంచు మనోజ్ పవర్ ఫుల్ రోల్స్ లో యాక్ట్ చేస్తున్నారు. ఆనంది, అదితి శంకర్, దివ్య పిళ్లై హీరోయిన్స్ గా యాక్ట్ చేస్తున్నారు. జయసుధ కీలక పాత్రలో కనిపించనున్నారు.


తమిళంలో సూపర్ హిట్ గా నిలిచిన గరుడన్ కు రీమేక్ గా భైరవం తెరకెక్కగా.. తెలుగు నేటివిటీకి తగ్గట్టు మేకర్స్ మార్పులు చేశారు. అయితే ఇప్పటికే భైరవంపై ఆడియన్స్ లో మంచి అంచనాలు నెలకొన్నాయి. పోస్టర్స్, సాంగ్స్, టీజర్ అన్నీ మంచి రెస్పాన్స్ అందుకున్నాయి. మూవీ కచ్చితంగా వర్కౌట్ అవుతుందన్న ఫీలింగ్ అందరిలో ఏర్పడింది.

దీంతో మూవీ టీమ్ ఫుల్ జోష్ లో ఉంది. తాజాగా ట్రైలర్ ను రిలీజ్ చేసింది. 'పవిత్రాణాయ సాధూనాం.. వినాశాయ చదుష్కృతాం.. ధర్మస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే' అంటూ భగవద్గీతలోని శ్లోకంతో ట్రైలర్ పవర్ ఫుల్ గా స్టార్ట్ అయింది. ఆ తర్వాత 'కృష్ణుడు గీతలో శ్రీకృష్ణుడు చెప్పినట్లు ధర్మాన్ని కాపాడటం కోసం దేవుడే ఏదో రూపంలో వస్తాడు' అంటూ జయసుధ చెబుతున్న డైలాగ్ బ్యాక్ గ్రౌండ్ లో వస్తుంది.

అప్పుడే బెల్లంకొండ శ్రీనివాస్ ఓ రేంజ్ ఎలివేషన్స్ తో ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత నారా రోహిత్, మంచు మనోజ్ తో పాటు హీరోయిన్స్ ను పరిచయం చేశారు మేకర్స్. జయసుధ కీలక పాత్రలో నటిస్తున్నట్లు క్లియర్ గా తెలుస్తోంది. ముగ్గురు హీరోలకు సినిమాలో మేకర్స్ అదిరిపోయే రీతిలో ఎలివేషన్స్ ఇచ్చినట్లు ట్రైలర్ ద్వారా స్పష్టంగా అర్థమవుతుంది.

ముగ్గురు మిత్రులు.. ఓ ఆలయం చుట్టూ సాగే యాక్షన్‌ మూవీగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. అమ్మవారి నగలు, భమికి సంబంధించిన పట్టా పేపర్స్ ను కాపాడేందుకు యువకులు ఏం చేశారన్నది ఆసక్తిని కలిగిస్తోంది. బెల్లంకొండ శ్రీనివాస్ తనలోని టాలెంట్ మొత్తాన్ని చూపించినట్లు క్లియర్ గా కనిపిస్తోంది. గతంలో కంటే ఈసారి కథానాయకుడిగా మరింత పవర్ఫుల్ గా కనిపిస్తున్నాడు. ఇక కీలక పాత్రల్లో నటించిన మంచు మనోజ్, నారా రోహిత్ సినిమా కోసం బాగానే కష్ట పడినట్లు స్పష్టంగా అర్థమవుతోంది.

శ్రీ చరణ్ పాకాల అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ట్రైలర్ కు మెయిన్ అసెట్ గా మారింది. రాధామోహన్ ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్ గా ఉన్నాయి. ముఖ్యంగా ట్రైలర్ లోని డైలాగ్స్ గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి. 'ఈ సారి ఉత్సవాల్లో తెగేది మేక కాదురా పీక'.. 'చనిపోయిన వాళ్లను తగలబెట్టడం మన ఆచారం, వాళ్లతో పాటు మన భవిష్యత్తును తగలెట్టేసుకోవడం మూర్ఖత్వం'.. ఎదుటోడు మన మీద కన్నేసే లోపే మనం వాడి మీద మన్నేసెయ్యాలి.. మన వాళ్ల కోసం మన వాళ్లనే చంపుకునే మహాభారతం..' అంటూ ముగ్గురు హీరోలు చెప్పిన డైలాగ్స్.. సినిమాపై అంచనాలు పెంచేస్తున్నాయి. మరి చూడాలి మూవీ ఏ రేంజ్ లో హిట్ అవుతుందో..

Full View
Tags:    

Similar News