రామ్ సినిమాకు కలిసి వచ్చే భాగ్యం..?

ఇక రామ్ సినిమా ఒకటి ఉంది. ఐతే రామ్ సినిమాలో మాత్రం భాగ్య శ్రీకి మంచి పాత్ర దక్కిందని తెలుస్తుంది.;

Update: 2025-08-01 16:30 GMT

విజయ్ దేవరకొండ కింగ్ డమ్ వచ్చింది. అందులో భాగ్య శ్రీ రోల్ పై ఫ్యాన్స్ అసంతృప్తి తెలిసిందే. కనీసం ఆ సాంగ్ ఉంచినా బాగుండేదని ఫీల్ అవుతున్నారు. కింగ్ డమ్ లో సినిమా ఫ్లో మిస్ చేస్తుందని ఆ సాంగ్ కూడా లేపేశారు మేకర్స్. విజయ్, భాగ్య శ్రీ కెమిస్ట్రీ వర్క్ అవుట్ కాలేదు. ఐతే ఈ సినిమాపై హోప్స్ పెట్టుకున్న భాగ్య శ్రీకి పెద్ద షాక్ తగిలింది. కింగ్ డం యావరేజ్ టాక్ తో అలా అలా వెళ్తుంది.

హిట్టు పడితే ఏకంగా స్టార్ రేంజ్..

ఐతే ఈ సినిమాపై భాగ్య శ్రీ బోర్స్ చాలా ఎక్కువ అంచనాలే పెట్టుకుంది. ఇంకేముంది ఇది హిట్టు పడితే ఏకంగా స్టార్ రేంజ్ కి వెళ్లొచ్చు అనుకుంది. కానీ అమ్మడు అనుకున్నది ఒకటైతే జరిగింది మరొకటి. కింగ్ డమ్ రిజల్ట్ తేలింది. ఇక రామ్ సినిమా ఒకటి ఉంది. ఐతే రామ్ సినిమాలో మాత్రం భాగ్య శ్రీకి మంచి పాత్ర దక్కిందని తెలుస్తుంది.

రామ్ ఆంధ్రా కింగ్ తాలూకా సినిమాలో భాగ్య శ్రీ రాం లవర్ గా నటిస్తుంది. సినిమాలో ఆమె పాత్ర చాలా కీలకం అవుతుంది. సినిమాలో రామ్, భాగ్య శ్రీ జోడీ కూడా ఆకట్టుకుంటుందని అంటున్నారు. ఈ సినిమాతో భాగ్య శ్రీ కచ్చితంగా ఆడియన్స్ కి రీచ్ అవుతుందని అంటున్నారు. భాగ్య శ్రీ బోర్స్ కింగ్ డమ్ డిజప్పాయింట్ చేసినా రామ్ ఆంధ్రా కింగ్ తాలూకా మాత్రం నిలబెడుతుందని అంటున్నారు.

నువ్వుంటె చాలే సాంగ్..

అది తెలియాలంటే మాత్రం రామ్ సినిమా వచ్చే దాకా వెయిట్ చేయాలి. రాం ఆంధ్రా కింగ్ తాలూకా సినిమా నుంచి నువ్వుంటె చాలే సాంగ్ వచ్చింది. ఆ సాంగ్ రామ్ రాశాడని తెలిసిందే. మరి భాగ్య శ్రీ కెరీర్ కి రామ్ సినిమా ఏమేరకు హెల్ప్ అవుతుందో చూడాలి. రామ్ మాత్రం ఈ సినిమా మీద చాలా హోప్స్ పెట్టుకున్నాడు. రామ్ ఈ సినిమాలో యంగ్ లుక్స్ తో అదరగొట్టబోతున్నాడని తెలుస్తుంది.

డబుల్ ఇస్మార్ట్ మీద భారీ హోప్స్ పెట్టుకున్న రామ్ ఆ మూవీ ఇచ్చిన షాక్ నుంచి కోలుకుని ఆంధ్రా కింగ్ తాలూకా సినిమా చేశాడు. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుండగా మహేష్ బాబు పి డైరెక్ట్ చేస్తున్నాడు. సినిమా రిలీజ్ ఎప్పుడన్నది ఇంకా క్లారిటీ రాలేదు కానీ రామ్ ఫ్యాన్స్ మాత్రం ఈ మూవీ పై మంచి అంచనాలు పెట్టుకున్నారు.

Tags:    

Similar News