అందాల భామకి ఎక్కడ తేడా కొడుతుంది..?
అందం అభినయం ఉంటే చాలు వరుస ఛాన్స్ లు వచ్చేస్తాయి. కానీ ఆ రెండిటిలో పాటు లక్ అనే ఫ్యాక్టర్ కూడా ఉండాలి లేదంటే కాస్త ఇబ్బంది పడక తప్పదు.;
అందం అభినయం ఉంటే చాలు వరుస ఛాన్స్ లు వచ్చేస్తాయి. కానీ ఆ రెండిటిలో పాటు లక్ అనే ఫ్యాక్టర్ కూడా ఉండాలి లేదంటే కాస్త ఇబ్బంది పడక తప్పదు. ప్రస్తుతం అలాంటి పరిస్థితుల్లోనే ఉంది అందాల భామ భాగ్య శ్రీ బోర్స్. మామూలుగా అయితే రవితేజ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ కి హిట్ క్రేజ్ రావడమే కాదు కెరీర్ అదిరిపోతుంది. అదే దారిలో మిస్టర్ బచ్చన్ తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది భాగ్య శ్రీ బోర్స్. ఐతే ఆ సినిమా కమర్షియల్ గా వర్క్ అవుట్ కాలేదు కాబట్టి ఫస్ట్ షాక్ తగిలినట్టు అయ్యింది.
భాగ్య శ్రీ బోర్స్ థర్డ్ అటెంప్ట్ గా వచ్చిన కాంత..
ఐతే అది ఫ్లాప్ అయినా అమ్మడికి వరుస ఛాన్స్ లు వచ్చాయి. రెండో సినిమాగా రిలీజైన విజయ్ దేవరకొండ కింగ్ డమ్ మీద చాలా హోప్స్ పెట్టుకుంది భాగ్య శ్రీ. ఐతే ఆ సినిమా కూడా నిరాశపరచింది. ముఖ్యంగా భాగ్య శ్రీ రోల్ కూడా రన్ టైమ్ లిమిటేషన్స్ వల్ల క్లారిటీ లేకుండా పోయింది. ఇక థర్డ్ అటెంప్ట్ గా వచ్చిన కాంత సినిమా కూడా కమర్షియల్ సక్సెస్ అందుకోలేదు.
తెలుగులో దుల్కర్ సినిమా అంటే కచ్చితంగా సూపర్ హిట్టే అనే రేంజ్ క్రేజ్ ఏర్పరచుకున్నాడు. అలాంటి దుల్కర్ తో కాంత సినిమా చేసిన భాగ్య శ్రీ ఆ సినిమాతో కూడా ఫెయిల్యూర్ చవిచూసింది. ఐతే 3 సినిమాల్లో కింగ్ డమ్ లో తప్పితే మిగతా రెండిటిలో అటు గ్లామర్ పరంగా యాక్టింగ్ పరంగా భాగ్య శ్రీకి మంచి మార్కులే వేశారు ఆడియన్స్.
రామ్ తో జత కట్టిన ఈ అమ్మడు..
ఇక ఫైనల్ గా అమ్మడి చేతిలో ఉన్న ఒకే ఒక్క సినిమా ఆంధ్రా కింగ్ తాలూకా. రామ్ తో జత కట్టిన ఈ అమ్మడు అతనితో తొలి హిట్ అందుకుంటుందా అన్నది ఎగ్జైటింగ్ గా ఉంది. రామ్ తో తొలి పరిచయమైన ఇలియానా, కీర్తి సురేష్ లాంటి వాళ్లు స్టార్ హీరోయిన్స్ గా ఒక రేంజ్ కి వెళ్లారు. మరి అదే దారిలో భాగ్యానికి రామ్ సినిమా సక్సెస్ అందిస్తుందేమో చూడాలి.
రామ్ భాగ్య శ్రీ చేసిన ఆంధ్రా కింగ్ తాలూకా సినిమా ప్రమోషన్స్ అయితే ఇంప్రెసివ్ గా ఉన్నాయి.. ఈ సినిమా ఒక ఫ్యాన్ బయోపిక్ గా మేకర్స్ చెబుతూ వస్తున్నారు. మరి సినిమాతో భాగ్యానికి ఏమేరకు లక్ కలిసి వస్తుందో చూడాలి. ఆంధ్రా కింగ్ తాలూకా రిజల్ట్ ని బట్టే భాగ్య శ్రీ కెరీర్ ఆధారపడి ఉంటుందని చెప్పొచ్చు. ముఖ్యంగా సినిమా హిట్ పడితే అమ్మడు కూడా మరింత రెచ్చిపోదామనే ప్లాన్ తోనే ఉంది. మరి భాగ్యం కోరుకున్న ఆ ఒక్క హిట్ సినిమా ఆంధ్రా కింగ్ అవుతుందా లేదా అన్నది ఈ మంత్ ఎండ్ సినిమా రిలీజ్ అయ్యాక తెలుస్తుంది. హీరో రామ్ కూడా ఆంధ్రా కింగ్ తాలూకా సినిమా మీద చాలా హోప్స్ పెట్టుకునాడు. అతను కూడా ఈమధ్య వరుస ఫ్లాపులతో కెరీర్ ట్రాక్ తప్పాడు.