సౌత్ కు దొరికిన కొత్త అందం

టాలీవుడ్ లో హీరోయిన్ల కొరత ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. కొత్త ముఖాలు వస్తుంటాయి, కానీ అందులో నిలదొక్కుకునే వారు చాలా తక్కువ.;

Update: 2025-12-04 17:52 GMT

టాలీవుడ్ లో హీరోయిన్ల కొరత ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. కొత్త ముఖాలు వస్తుంటాయి, కానీ అందులో నిలదొక్కుకునే వారు చాలా తక్కువ. కేవలం గ్లామర్ ఉంటే సరిపోదు, దానికి తగ్గ నటన కూడా తోడవ్వాలి. ఇప్పుడు ఇండస్ట్రీలో సరిగ్గా ఇదే పాయింట్ మీద ఒక పేరు గట్టిగా వినిపిస్తోంది. ఆమె మరెవరో కాదు, భాగ్యశ్రీ బోర్సే. తక్కువ టైమ్ లోనే తనకంటూ ఒక స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంటూ దూసుకుపోతోంది.

రీసెంట్ గా వచ్చిన 'కాంత', 'ఆంధ్ర కింగ్ తాలూకా' సినిమాలు ఆమె కెరీర్ గ్రాఫ్ ను ఒక్కసారిగా మార్చేశాయి. సాధారణంగా ముంబై నుంచి వచ్చిన హీరోయిన్లకు మన నేటివిటీ పట్టుకోవడం కష్టం. కానీ భాగ్యశ్రీ మాత్రం పక్కా తెలుగు పల్లెటూరి అమ్మాయిలా కనిపించడం ప్రేక్షకులను ఆశ్చర్యపరిచింది. గ్లామర్ డాల్ గా మాత్రమే కాకుండా, ఎమోషనల్ సీన్స్ లోనూ ఆమె పండించిన హావభావాలు చూసి జనాలు ఫిదా అవుతున్నారు.

కొత్తగా వచ్చిన వారికి స్టార్ హీరోల పక్కన నటించడం అంటే కొంచెం భయంగానే ఉంటుంది. పైగా రవితేజ, దుల్కర్ సల్మాన్, రామ్ పోతినేని లాంటి ఎనర్జిటిక్ స్టార్స్ పక్కన స్క్రీన్ షేర్ చేసుకోవడం అంత ఈజీ కాదు. కానీ భాగ్యశ్రీ మాత్రం వారి ఎనర్జీకి ఏమాత్రం తగ్గకుండా చాలా కాన్ఫిడెంట్ గా నటించింది. సీనియర్ హీరోల ప్రజెన్స్ ఉన్నా, తన పాత్ర వరకు న్యాయం చేస్తూ ప్రత్యేకంగా కనిపించడం ఆమెలోని ప్రతిభకు నిదర్శనం.

తెలుగు తెరకు అందం, అభినయం కలబోసిన హీరోయిన్ల అవసరం ఎప్పుడూ ఉంది. గతంలో శ్రీదేవి, సౌందర్య, అనుష్క, సమంత లాంటి వారు ఆ స్థాయిని సెట్ చేశారు. ఈ మధ్య కాలంలో ఆ గ్యాప్ స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పుడు భాగ్యశ్రీ ఎంచుకుంటున్న పాత్రలు, ఆమె నటన చూస్తుంటే.. భవిష్యత్తులో ఆ లోటును భర్తీ చేసే సత్తా ఆమెకు ఉందనిపిస్తోంది. కేవలం పాటల కోసమే కాకుండా, పర్ఫార్మెన్స్ కు స్కోప్ ఉన్న పాత్రలే ఆమెను వెతుక్కుంటూ వస్తున్నాయి.

సోషల్ మీడియాలో కూడా ఇప్పుడు ఈ బ్యూటీకి ఫాలోయింగ్ పెరిగింది. గత రెండు సినిమాల్లో ఆమె నటన చూసిన నెటిజన్లు, సౌత్ సినిమాకు దొరికిన కొత్త ఫేస్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. డిజిటల్ ప్లాట్ ఫామ్స్ లో ఆమె వీడియోలకు వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే, ఆడియెన్స్ ఆమెను ఎంతగా ఓన్ చేసుకున్నారో అర్థమవుతుంది.

కెరీర్ ఆరంభంలోనే ఇలాంటి గుర్తింపు రావడం నిజంగా గ్రేట్. అయితే దీన్ని నిలబెట్టుకోవడంలోనే అసలైన సవాలు ఉంటుంది. ప్రస్తుతం ఆమె కథలను ఎంచుకుంటున్న విధానం చూస్తుంటే, లాంగ్ రన్ లో ఒక మంచి ఆర్టిస్ట్ గా మారుతుందనే నమ్మకం కలుగుతోంది. గ్లామర్, పర్ఫార్మెన్స్ రెండింటినీ బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తే, రాబోయే రోజుల్లో టాలీవుడ్ లో భాగ్యశ్రీ హవా నడవడం ఖాయం.

Tags:    

Similar News