• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  స‌హజ అందంతో...

స‌హజ అందంతో చ‌క్కిలిగింత‌లు పెడుతోంది

| భాగ్య‌శ్రీ బ్లాక్ ఫ్రాక్‌లో మేక‌ప్ లెస్ లుక్ లో ఎంతో నేచుర‌ల్‌గా క‌నిపించింది. సింపుల్‌గా క‌నిపిస్తూనే గుండెల్ని హ‌త్తుకుంది ఈ భామ‌.

By - Tupaki Desk
Update: 2025-01-25 20:30 GMT

త‌న‌దైన స‌హ‌జ అందంతో హృద‌యాల‌ను గెలుచుకున్న జ‌య‌ప్ర‌ద‌, సుహాసిని, సుమ‌ల‌త వంటి న‌టీమ‌ణుల‌కు వార‌సురాలిగా క‌నిపిస్తోంది భాగ్య‌శ్రీ బోర్సే. చూపులు తిప్పుకోనివ్వ‌ని, గిలిగింత‌లు పెట్టే అందం ఈ భామ సొంతం. తాజా ఇన్‌స్టా పోస్ట్ దీనిని మ‌రోసారి ధృవీక‌రించింది. భాగ్య‌శ్రీ బ్లాక్ ఫ్రాక్‌లో మేక‌ప్ లెస్ లుక్ లో ఎంతో నేచుర‌ల్‌గా క‌నిపించింది. సింపుల్‌గా క‌నిపిస్తూనే గుండెల్ని హ‌త్తుకుంది ఈ భామ‌. వాలు చూపుల‌తో వ‌లపు బాణాలు వేస్తోంది.


అందానికి అందం ప్ర‌తిభ‌తో ఆక‌ట్టుకుంటున్న భాగ్య‌శ్రీ టాలీవుడ్ లో బిజీ నాయిక‌గా వెలిగిపోతోంది. తెలుగు చిత్ర‌సీమ‌లో మిస్ట‌ర్ బ‌చ్చ‌న్ ఫేం భాగ్య‌శ్రీ బోర్సే వ‌రుస అవ‌కాశాల్ని అందుకుంది. విజ‌య్ దేవ‌ర‌కొండ స‌ర‌స‌న ఓ చిత్రంలో, నాని స‌ర‌స‌న మ‌రో చిత్రంలో భాగ్య‌శ్రీ అవ‌కాశాలు అందుకుంద‌ని క‌థ‌నాలొచ్చాయి.


భాగ్య‌శ్రీ స్వ‌గతంలోకి వెళితే... నైజీరియాలోని లాగోస్ లో భాగ్యశ్రీ బోర్సే చదువుకుంది. భారతదేశం తిరిగి వచ్చి బిజినెస్ మేనేజ్మెంట్ డిగ్రీలో చేరింది. ఆ సమయంలోనే మోడలింగ్ కెరీర్ గా ఎంచుకుని ఒక ఎజెన్సీతో కలసిపనిచేసింది. పలు బ్రాండ్లకు అంబాసిడర్ గా వ్యవహరించింది. క్యాడ్‌బరీ డైరీ మిల్క్ సిల్క్ యాడ్ తో భాగ్య‌శ్రీ బాగా పాపుల‌రైంది. అలా బాలీవుడ్ చిత్రం `యారియాన్ 2`లో రాజ్యలక్ష్మి పాత్రలో తన నటనతో యువతను ఆకట్టుకుంది. ఆ తరువాత, చందు ఛాంపియన్ లోనూ నటించింది. హరీశ్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన మిస్టర్ బచ్చన్ (2024) చిత్రంలో రవితేజ సరసన భాగ్య‌శ్రీ‌ నటించింది. మిస్ట‌ర్ బ‌చ్చ‌న్ త‌ర్వాత భాగ్య‌శ్రీ న‌టించే సినిమాల గురించి ఇంకా అధికారిక ప్ర‌క‌ట‌న వెలువ‌డాల్సి ఉంది.


Tags:    
  • Bhagyashriborse 
  • Actressbhagyashriborse 
  • Tollywood 
  • Bollywood 
  • Sociallooks 
  • Trendingclicks 
  • Bhagyashripictures 
  • Mrbachchan 
  • VD12 
  • Filmindustry 

Similar News

ట్రెండీ టాక్: జాతీయ ఉత్త‌మ న‌టి ప్ర‌యోగాలు

2026-11-19 10:30 GMT

సైఫ్ అలీ ఖాన్‌కు బెదిరింపులు.. హత్య కేసులో నిందితుడి పేరుతో డెత్ థ్రెట్!

2026-11-19 10:07 GMT

కృతి, కీర్తిలతో కలిసి రజినీకాంత్‌గా మారిన అనిల్ రావిపూడి..!

2026-11-19 09:55 GMT

చైతూ గురించి మీనాక్షి ఇంట్రస్టింగ్‌ కామెంట్స్‌

2026-11-19 09:54 GMT

హీరోయిన్ల వ్య‌క్తిగ‌త జీవితాల్లో హీరోలు!

2026-11-19 09:30 GMT

Tupaki Exclusive: ఫౌజీ సినిమా వేరే లెవెల్‌లో ఉంటుంది. నాకు మొత్తం కథ తెలుసు...

2026-11-19 08:26 GMT

Tupaki Exclusive: వెంకీ సార్ కి చైతు కి మధ్య తేడా ఇదే...!

2026-11-19 08:24 GMT

టాలీవుడ్ గ్లోబ‌ల్ పెట్టుబ‌డుల‌ను రాబ‌ట్టాలంటే CM రేవంత్ విజ‌న్!

2026-11-19 08:18 GMT

నేపో కిడ్స్ వ‌ల్ల‌నే ఈ యువ‌న‌టుడికి ఛాన్సుల్లేవా? వెక్కి వెక్కి ఏడ్చాడు!

2026-11-19 08:08 GMT

మాతృశిశు మంగళ ఆశీర్వాదం పద్ధతిలో సమంత సీమంతం.. శీతల్ క్లారిటీ!

2026-11-19 08:08 GMT

శ్రీలీల ఈసారి తెలుగు సినిమాల‌కు ఒకే చెబుతుందా?

2026-11-19 08:07 GMT

నితిన్ వర్సెస్ చైతూ.. అసలు ఫైట్ దర్శకులదే!

2026-11-19 08:07 GMT

Copyright @2026

Powered by Blink CMS